మెరామిక్ జలాంతర్గత గుహలు

మెరామిక్ జలాంతర్గత గుహలు యునైటెడ్ స్టేట్స్‌ లోని సెయింట్ లూయిస్ పట్టణము తూర్పున ఉన్న మిస్సోరీ నది కింది భాగములో ఏర్పడిన అద్భుతమైన గుహలు. ఇవి లైమ్ స్టోన్స్(సున్నపురాయి) నీటి కలయిక వలన భూ అంతర్భాగములో రూపు దిద్దుకున్నాయి. అనేక వేల సంవత్సరాల నుండి విస్తారమైన సున్నపురాయి నిలువల మీద ప్రవహిస్తున్న మిస్సోరీ నది కారణంగా అద్భుత జలాంతర్గత గుహలు రూపు దిద్దుకున్నాయి. ఈ గుహల్లో కొలంబస్‌కు పూర్వపు స్థానిక అమెరికన్ అవశేషాలు కనుగొనబడ్డాయి. ప్రస్తుతము ఇవి సెయింట్ లూయిస్ పట్టణ ప్రత్యేక పర్యటక ఆకర్షణలలో ప్రధానమైనవి. యు ఎస్ హైవే 66 ప్రధాన ఆకర్షణలలో ఇది ఒకటి. దీనిని సంవత్సరానికి 1,50,000 మంది సందర్శిస్తుంటారని అంచనా. యు.ఎస్.ఎ. బాబ్ కేవ్ కామ్ ఈ గుహలను అమెరికాలో ఉన్న పొడవైన గుహలలో 171వ శ్రేణిలో ఉన్నట్లు గుర్తించారు.

చరిత్ర

మెరామిక్ కేవర్న్ గుహలు 400 వేల సంవత్సరాల నుండి చిన్నగా సున్నపురాయి నిలువల కారణంగా రూపు దిద్దుకుంటున్నట్లు పరిశీలకుల భావన. శతాబ్దాల ముందు కాలములో స్థానిక అమెరికన్లు వీటిని నివాసార్థము ఉపయోగించారు. మొదటి సారిగా మిసిసిపి నది పశ్చిమ తీరములో ఐరోపా వారు దీనిని గుర్తించారు. ఒక ఫ్రెంచి మైనరు (గనుల తవ్వకము దారు) దీనిని 1722 వ సంవత్సరము లో కనిపెట్టాడు. 18వ శతాబ్దములో ఈ గుహల నుండి లభించిన మూల పదార్థము గన్ పౌడర్ (తుపాకీ మందు) తయారీకి వాడబడింది. సివిల్ వార్ శకములో యూనియన్ ఆర్మీ ఈ గుహలను సాల్ట్ పీటర్ తయారీ సంస్థకు ఉపయోగించారు. కాని ఈ తయారీ సంస్థను కాన్‌ఫిడరేట్ గొరిల్లాల చేత కనిపెట్టబడి ధ్వంసము చేయబడినది. 1870 లో ఈ గుహలను జేమ్స్, అతడి నేరాలలో భాగస్థుడు అయిన సొదరునితో తన మరుగైన స్థావరంగా చట్టము నుండి దాగుకొనడానికి ఉపయోగించుకున్నాడు. షెరీఫ్, ఈ గుహల ముందు భాగములో వారు బయటకు వచ్చినప్పుడు పట్టుకునే ప్రయత్నములో కూర్చుని ఎట్టకేలకు మరొక మార్గములో వారిని పట్టుకున్నాడు. 1933 లో ఈ గుహల విస్తరణను పూర్తిగా గుర్తించారు. ఈ గుహలు 4.6 మైళ్ల పొడవున విస్తరించి ఉన్నాయి. ఈ గుహలు 1935 వ సంవత్సరము నుండి పర్యటకులకు ఆకర్షణగా బంపర్ స్టిక్కర్ స్థాపకుడైన డి.బిల్ చేత తెరువబడ్డాయి. 1960 లో మెరామిక్ కేవర్న్‌ లో ప్రకటన ఫలకాలు చోటు చేసుకున్నాయి. వీటి యజమానులు ప్రపంచములోనే భూమిలోపల చోటుచేసుకున్న ప్రకటనలు తమవేనని తమ ప్రత్యేకత చాటుకున్నారు.

గుహల సందర్శన

ఈ గుహలను చూడడానికి సందర్శకులు తమ తమ వాహనాలలో ఇక్కడకు చేరుకుంటారు. గుహలను చూడడానికి ప్రత్యేక రుసుము వసూలు చేస్తారు. ఈ రుసుమును చెల్లించి లోపలికి ప్రవేశించిన తరువాత ఒక్కొక్క బృందాన్ని ఒక్కొక్క మార్గదర్శకుడు(గైడు) గుహలను గురించి ఆంగ్లములో వివరిస్తూ సందర్శకులను ముందుకు తీసుకు వెళతాడు. ఇలా అనేక బృందాలు లోపల సందర్శన చేస్తు ఉంటాయి. లోపలకు వెళ్ళే ముదు సందర్శకులు కొనుగోలు చేయడనికి వీలుగా ఒక విక్రయశాల ఉంటుంది. ఇక్కడ ఆకర్షణీయమైన అనేక వస్తువులను విక్రయిస్తుంటారు. గుహలకు సంబంధించిన అనేక అలంకార ఇతర ఉపయోగకరమైన వస్తువులను ఇక్కడ విక్రయిస్తుంటారు. వీటిని సందర్శకులు తాము గుహలను చూసిన దానికి గుర్తుగా కొనుగోలు చేస్తుంటారు. తరువాత గైడు సహాయముతో లోనికి ప్రవేశించిన తరువాత, ముందుగా ఆ గుహలను తమ రహస్య స్థావరంగా ఉపయోగించిన జెస్ మరియు జేమ్స్ శిల్పాలు, వారి స్థావరము చూడ వచ్చు. దానిని దాటి లోపలకు వెళ్ళే ముందు ఒక పెద్ద దర్బారు వంటి ప్రదేశములో లోలకములా ఒక తాడు పైకప్పు నుండి వేలాడుతూ ఉంటుంది. దానిని ఆగుహలను ఉపయోగించిన వారు దిక్కులను తెలుసుకోవడానికి ఉపయోగించుకున్నారు. గుహల లోపల గాఢాంధకారముగా ఉంటుంది కనుక అక్కడక్కడా విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు. ఆ దీపాలను గైడులు వెలిగిస్తూ సందర్శకులను ముందుకు తీసుకు వెడుతుంటారు. సందర్శకులు దాటగానే ఆ దీపాలను ఆర్పి వేస్తుంటారు. అలా ముందుకు సాగుతూ సందర్శకులు అద్భుతమైన గుహలను దర్శించవచ్చు. లోపల అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది కనుక చలి అధికముగా ఉంటుంది. సందర్శకులు చలి తట్టుకోవడానికి ఉన్ని వస్త్రాల వంటి వాటిని ధరించడము ముఖ్యము. లోపలికి వెళ్ళే కొద్దీ వివిధ రూపాలలో, వివిధ వర్ణాలలో, వివిధ పరిమాణాలలో నీటికి కరిగి రూపుదిద్దుకుని పై కప్పు నుండి కిందకు జాలు వారిన గుహల సహజ సౌందర్యము సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. కొన్ని చోట్ల దారికి ఇరువైపులా అడుగున చేరి ఉన్న స్వచ్ఛమైన జలాలో ప్రతిబింస్తున్న అందమైన గుహలు సందర్శకులను ఆశ్చర్యానందాలకు గురి చేస్తాయి. అలా గుహలను మొత్తముగా సందర్శించిన తరువాత, చివరగా చిన్న ప్రదర్శన ఉంటుంది. దీనికి ప్రత్యేక రుసుము చెల్లించ వలసిన పని లేదు. ఈ ప్రదర్శనలో ప్రేక్షకులు గుహల అందాలను వివిధమైన వర్ణాల విద్యుద్దీప కాంతిలో చూడవచ్చు. తరువాత గైడులు సందర్శకులను ప్రధాన ద్వారానికి చేర్చడంతో సందర్శన పూర్తి అవుతుంది. రెండు నుండి మూడు గంటల సమయములో ఈ గుహ సందర్శన పూర్తి చేయవచ్చు. గుహల ప్రధాన ద్వారములో ఉన్న అల్పాహారశాలలో కాఫీ, టీ, ఐస్ క్రీమ్ లతో పాటు వివిధ పానీయాలు, అల్పాహారము లభిస్తుంది.

గుహల వెలుపలి ప్రదేశము

గుహల వెలుపల ఉన్న నదీతీరములో సందర్శకులు కొంత సమయము సేద తీర్చుకోవచ్చు. రెండు వైపులా దట్టముగా పెరిగి ఉన్న చెట్ల మధ్య ప్రవహిస్తున్న నదీ ప్రాంతము సందర్శకులకు మరింత ఆహ్లాదము చేకూరుస్తుంది. ఈ నదిలో రుసుము చెల్లించి పడవలలో, చిన్న బోట్లలో ప్రయాణము చేయవచ్చు. కేవర్న్ క్వీన్ 1 మరియు కెవర్న్ క్వీన్ 2 పడవలు ఒక్కో దఫా 25 మందిని నదీ విహారానికి తీసుకుని వెడతాయి. ఈ ప్రయాణము అరగంట సమయము సాగుతుంది. ఇవి ఏప్రిలు నుండి సెప్టెంబరు వరకు వాతావరణానుకూలముగా నడుస్తుంటాయి. ఇవి కాక కేనో ఫ్లోట్స్ అనే కార్యక్రమాలు కూడా సందర్శకులకు అందుబాటులో లభిస్తాయి. ఆరు నుండి పదకొడు మైళ్లు ప్రయాణించే ఈ పడవలలో ప్రయాణించడానికి షటిల్స్ అనే ఉచిత బస్సులు లభిస్తాయి. ఈ బస్సులలో ప్రయాణించి, పడవలు లభించే ప్రదేశానికి చేరి, పడవలను ఎక్కి, తిరిగి తమ వాహనాలను నిలిపిన ప్రదేశానికి చేరుకోవచ్చు.

ఇతర ఆకర్షణలు

  1. . జిప్ లైన్ సాహసిక క్రీడలలో మే మాసము నుండి అక్టోబరు వరకు రుసుము చెల్లించి పాల్గొన వచ్చు. ఈ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులు ఎత్తైన ప్రదేశము నుండి నడుముకు బెల్టు కట్టుకుని తీగ ద్వారా ప్రయాణించి నదిని దాటవచ్చు. నదిని ఒక సారి దాటి, అవతల తీరానికి చేరుకుని తిరిగి అక్కడ నుండి బయలుదేరిన ప్రదేశానికి చేరుకుంటారు. ఇలా నది మీద అటూ ఇటూ దాటడానికి అరగంట సమయము పడుతుంది. దీనిలో పాల్గొనడానికి రుసుము అధికమే.
  2. . లాంతర్న్ టూర్ అనే మరో ఆకర్షణ శని ఆది వారాలలో మాత్రమే ఉంటుంది. దీనికి ప్రత్యేక రుసుము వసూలు చేస్తారు. లాంతర్న్ టూరుకు సందర్శకులు రుసుము చెల్లించి, లాంతరు చేతితో పట్టుకుని గైడు సహాయముతో గుహలను సందర్శించ వచ్చు.
  3. . గుహలలో ఉన్న విక్రయ శాలలో క్రిస్టల్ తో చేసిన అలంకార సామాగ్రి, సహజమైన మధ్యకు కోసిన ఆకర్షణీయమైన క్రిస్టల్ రాళ్లు, శిలాజాలు, వివిధమైన బహుమతి ప్రధానమైన వస్తువులు లభిస్తాయి.
  4. . ప్రదర్శనకు పెట్టిన పురాతన వస్తులు, ఉపయోగించిన పురారాతన వస్తువులు, సందర్శకులను ప్రత్యేకముగా ఆకర్షిస్తాయి.
  5. . గుహలలో సందర్శకుల సౌకర్యార్ధం ఆల్పాహార విక్రయశాల ఉంది. ఇక్కడ దేశీయ ఆహారపదార్ధాలు, ఐస్‌క్రీమ్స్, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, కుక్క్డ్ కార్న్ వంటి అహారపదార్థాలు, మరియు ఇతర చిరుతిండ్లు లభిస్తాయి.
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
Roy Taylor
7 October 2018
Great first time for me. If you’re taking the cave tour, be sure to bring a light jacket. Nice and cool inside. Wear shoes with good traction.
Cris Rosado
14 July 2013
Zip lining tours and cave tours are worth the $
Lorrane Nascimento
17 June 2014
Bring a jacket! It is cold insude the caves!
Chad Hembree
8 August 2018
Lots to do and see.
Andy Anders
28 September 2013
Awesome Breath Taking Beautiful
Michelle K
3 August 2010
Even if it is 100 degrees outside bring a sweatshirt to the cave it is cool inside.
మ్యాప్
1135 Hwy W, Sullivan, MO 63080, యునైటెడ్ స్టేట్స్ దిశలను పొందండి
Sat 8:00 AM–6:00 PM
Sun 9:00 AM–6:00 PM
Mon 9:00 AM–5:00 PM
Tue 9:00 AM–6:00 PM
Wed 10:00 AM–5:00 PM
Thu 10:00 AM–3:00 PM
Baymont by Wyndham Sullivan

ప్రారంభించడం $105

Comfort Inn

ప్రారంభించడం $109

Americas Best Value Inn - Sullivan, MO

ప్రారంభించడం $59

Super 8 By Wyndham Sullivan

ప్రారంభించడం $58

Budget Lodging Saint Clair

ప్రారంభించడం $94

Super 8 By Wyndham St. Clair Mo

ప్రారంభించడం $58

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Donald Danforth Plant Science Center

The Donald Danforth Plant Science Center is a not-for-profit

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Taum Sauk Hydroelectric

Taum Sauk Hydroelectric ఒక పర్యాటక ఆకర్షణ, Pinkley (

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Monsanto Insectarium

The Monsanto Insectarium is an insectarium located within the St.

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Saint Louis Art Museum

The Saint Louis Art Museum is one of the principal U.S. art museums,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Apotheosis of St. Louis

Apotheosis of St. Louis is a statue of King Louis IX of France,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Missouri Botanical Garden

The Missouri Botanical Garden is a botanical garden located in St.

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
St. Louis Lambert International Airport

St. Louis Lambert International Airport (IATA: STL, ICAO: KSTL, FAA

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
World Chess Hall of Fame

The World Chess Hall of Fame (WCHOF) is a nonprofit, collecting

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Blue Whale of Catoosa

The Blue Whale of Catoosa is a waterfront structure, located just east

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Delgadillo's Snow Cap Drive-In

Delgadillo's Snow Cap Drive-In is a historic eatery and roadside

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Great Platte River Road Archway Monument

The Great Platte River Road Archway Monument is a museum of and

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Weeki Wachee Springs

Weeki Wachee Springs is a natural tourist attraction located in Weeki

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
The Big Texan Steak Ranch

The Big Texan Steak Ranch is a steakhouse restaurant and motel located

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి