వెస్ట్ మినిస్టర్ రాజభవనం

హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ లేదా వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ అని కూడా పిలువబడే వెస్ట్ మినిస్టర్ రాజభవనము , యునైటెడ్ కింగ్డం పార్లమెంట్ యొక్క రెండు సభలు-- ది హౌస్ ఆఫ్ లార్డ్స్ మరియు ది హౌస్ ఆఫ్ కామన్స్ రెండు సమావేశమయ్యే ప్రాంగణము. ఇది థేమ్స్ నది యొక్క ఉత్తర తీరాన, వెస్ట్ మినిస్టర్ నగరము యొక్క నడిబోడ్డులో ఉన్న లండన్ బరో లో ఉంది. ఇది చారిత్రాత్మక వెస్ట్ మినిస్టర్ అబ్బే కు మరియు వైట్ హాల్ మరియు డౌనింగ్ స్ట్రీట్ యొక్క ప్రభుత్వ భవనాలకు దగ్గరగా ఉంది. ఈ పేరు క్రింద తెలిపిన రెండు కట్టడాలకు సంబంధించినది: మధ్యయుగపు భవన సముదాయము అయిన పురాతన రాజభవనము - ఇది 1834లో కూల్చివేయబడింది మరియు దాని స్థానంలో కట్టబడిన మరియు ప్రస్తుతము ఉన్నటువంటి కొత్త రాజభవనము . ఇది తన సహజ శైలిని మరియు ఆచార వ్యవహారములకు రాజభవనము అనే ప్రతిష్టను కాపాడే విధంగా ఉంది.

మొదటి రాజభవనము పదకొండవ శతాబ్దములో నిర్మించబడింది మరియు వెస్ట్ మినిస్టర్ ఇంగ్లాండ్ రాజుల ప్రధాన లండన్ నివాసముగా, 1512లో జరిగిన అగ్నిప్రమాదములో భావనములోని చాల భాగమునకు నష్టము జరిగిన తరువాతి వరకు కొనసాగింది. ఆ తరువాత, అది పార్లమెంట్ భవనముగా సేవలను అందించింది. పదమూడవ శతాబ్దము వరకు పార్లమెంట్ అక్కడ సమావేశము అయ్యేది మరియు అది వెస్ట్ మినిస్టర్ హాల్ లోపల మరియు చుట్టుప్రక్కల రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టీస్ కు ఆధారముగా నిలిచింది. 1834లో, పునర్నిర్మించిన హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ లో ఇంకా పెద్ద అగ్ని ప్రమాదము జరిగింది. ఈ ప్రమాదములో మిగిలిన కట్టడాలు వెస్ట్ మినిస్టర్ హాల్, ది క్లాయిస్టర్స్ ఆఫ్ సెయింట్ స్టీఫెన్'స్, ది ఛాపెల్ ఆఫ్ సెయింట్ మేరి అండర్క్రఫ్ట్ మరియు ది జ్యూవెల్ టవర్.

ఆ తరువాత రాజభవనము యొక్క పునర్నిర్మాణమునకు ఏర్పడిన పోటీలో శిల్పకారుడు చార్లెస్ బర్రి మరియు భవన నిర్మాణములో అతని పర్పెండిక్యులర్ గోతిక్ శైలి విజయము సాధించాయి. పురాతన రాజభవనము యొక్క శిధిలాలు (విడిపడిన జివెల్ టవర్ మినిహ) మరింత ఎక్కువ విస్తీర్ణములో తిరిగి కట్టబడ్డాయి. దీనిలో 1,100 గదులు కోర్టు యార్డుల చుట్టూ రెండు వరుసలలో అమర్చబడ్డాయి. కొత్త రాజభవనము యొక్క 3.24 hectare (8 acre) విస్తీర్ణములో కొంత భాగము థేమ్స్ నుండి పునర్నిర్మిత మయ్యింది. అందులో భాగంగా ఆ భవనము యొక్క ప్రధాన ముందరి భాగము ది 265.8 మీటర్లు (872 అడుగులు) రివర్ ఫ్రంట్ గా ఏర్పరచబడింది. గోతిక్ నిర్మాణ శాస్త్రము మరియు శైలిపై పట్టు మరియు అధికారము ఉన్న అగస్తస్ W.N. ప్యుగిన్ సహాయముతో బర్రి రాజభవనము యొక్క అలంకరణ మరియు అలంకరణ వస్తువుల కొరకు ఆకృతులను అందించాడు. 1840లో నిర్మాణము మొదలయ్యి ముప్ఫై సంవత్సరాలు కొనసాగింది. ఈ క్రమములో ఎన్నో ఆలశ్యాలు మరియు అధిక ఖర్చులు, ఇద్దరు ప్రధాన నిర్మాణకారుల మరణాలు; అంతర్గత అలంకరణ పనులు ఇరవైయవ శతాబ్దములో కూడా కొనసాగాయి. లండన్ యొక్క వాయు కాలుష్యము వలన అప్పటి నుండి పెద్ద ఎత్తున సంరక్షణ పనులు చేయబడ్డాయి మరియు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత విస్తారమైన మరమ్మత్తులు జరిగాయి. వీటిలో 1941 యూక్క బాంబు దాడి తరువాత కామన్స్ చాంబరు యొక్క పునర్నిర్మాణము కూడా ఉంది.

యునైటెడ్ కింగ్డంలో రాజకీయ జీవనానికి రాజభవనము ఒక ముఖ్య కేంద్రము; "వెస్ట్ మినిస్టర్" UK పార్లమెంటు యొక్క ఉత్ప్రేక్ష గా నిలిచింది మరియు ప్రభుత్వము యొక్క వెస్ట్ మినిస్టర్ పధ్ధతి అనే పేరు దానిని అనుసరించి పెట్టబడింది.. ముఖ్యంగా, దాని క్లాక్ టవర్, దాని ముఖ్య గంటను అనుసరించి బిగ్ బెన్ అని పిలువబడేది. ఇది లండన్ మరియు యునైటెడ్ కింగ్డంల యొక్క ముఖ్య గుర్తింపుగా నిలిచింది. మరియు ఇది ముఖ్య పర్యాటక కేంద్రముగా కూడా ఉంది మరియు పార్లమెంటరి ప్రజాస్వామ్యం యొక్క ముద్రగా కూడా నిలిచింది. వెస్ట్ మినిస్టర్ రాజభవనము గ్రేడ్ 1 గుర్తింపు ఉన్న భవనము గా 1970 నుండి నిలిచింది మరియు 1987 నుండి UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఒక భాగంగా ఉంది.

చరిత్ర

పురాతన రాజభవనము

థేమ్స్ నది ఒడ్డున ఉన్న కారణంగా వెస్ట్ మినిస్టర్ రాజభవనము స్థలము మధ్య యుగముల సమయములో చాల ముఖ్యమైనదిగా ఉండేది. థార్నిద్వీపము అని మధ్యయుగపు సమయంలో పిలువబడిన ఈ ప్రదేశము కనాట్ ది గ్రేట్ చే తన ఏలుబడి కాలం అయిన 1016 నుండి 1035 వరకు అధికారిక నివాసముగా ఉపయోగింప బడింది. ఇంగ్లాండ్ యొక్క ఉపాంత్య సాస్క్సన్ చక్రవర్తి అయిన సెయింట్ ఎద్వార్ర్డ్ ది కన్ఫేసర్ థార్ని ద్వీపముపై ఒక రాజ భవనమును నిర్మించాడు. ఇది సిటి ఆఫ్ లండన్ కు పడమరగా ఉంది. ఈ భవనము ఆయన వెస్ట్ మినిస్టర్ అబ్బే నిర్మించిన సమయంలోనే నిర్మించారు (1045–50). థార్నిద్వీపము మరియు దాని పరిసర ప్రాంతాలు త్వరలోనే వెస్ట్మిన్స్టర్ అని గుర్తింపు పొందాయి. (వెస్ట్ మరియు మిన్స్టర్ అనే రెండు పదాల కలయిక). సాక్షాన్లు లేక విలియం I వాడిన ఏ భవనములు కూడా నిలిచి లేవు. రాజ భవనము (వెస్ట్ మినిస్టర్ హాల్) యొక్క ప్రస్తుతము ఉన్న అతిపురాతనమైన భాగము కూడా విలియం I యొక్క వారసకుడైన కింగ్ విలియం II యొక్క ఏలుబడి నుండి ఉన్నదే.

మధ్య యుగపు కాలము చివరిలో వెస్ట్ మినిస్టర్ రాజభవనము చక్రవర్తి యొక్క ప్రధాన నివాసముగా ఉంది. పార్లమెంటుకు ముందుండిన క్యూరియా రెజిస్ (రాయల్ కౌన్సిల్) వెస్ట్ మినిస్టర్ హాల్ నందు సమావేశము అయ్యేది (రాజు వేరే రాజభావనములకు మారినప్పుడు అది కూడా ఆయనను ఆనుసరించినప్పటికీ). ఇంగ్లాండ్ యొక్క మొదటి అధికారిక పార్లమెంటు అయిన నమూనా పార్లమెంట్ 1295 లో రాజభవనములో సమావేశమయ్యింది. ఇంచుమించు ఆ తరువాతి అన్ని పార్లమెంటలు అక్కడే సమావేశము అయ్యాయి.

1530లో రాజానుగ్రహం కోల్పోయిన శక్తివంతుడైన మంత్రి, కార్డినల్ థామస్ వోల్సీ నుండి కింగ్ హెన్రి VIII యార్క్ ప్లేస్ స్వాధీనము చేసుకొన్నాడు. వైట్ హాల్ రాజ భవనము అని తిరిగి నామకరణము చేసి హెన్రి దానిని ప్రధాన నివాసముగా ఉపయోగించుకొన్నాడు. వెస్ట్ మినిస్టర్ అధికారికంగా ఒక రాజ భవనముగా నిలిచినప్పటికీ, అది పార్లమెంటు యొక్క రెండు సభలచే ఉపయోగించ బడింది మరియు వివిధ రాజ న్యాయస్థానములచే కూడా.

నిజానికి అది ఒక రాజ భవనము కావడము చేత, ఆ రాజభవనములో రెండు సభల కొరకు ప్రత్యేకముగా నిర్మించిన చాంబర్లు లేవు. ముఖ్యమైన స్టేట్ ఉత్సవాలు పెయింటెడ్ చాంబర్ లో జరిగేవి. హౌస్ ఆఫ్ లార్డ్స్ మొదటినుంచి క్వీన్స్ చాంబరులో సమావేశము అయ్యేది. ఇది భవనము యొక్క దక్షిణాన ఉన్నటువంటి అమరికగల హాలు. 1801లో ఎగువ సభ పెద్దదైన వైట్ చాంబరులోనికి మారింది. ఈ చాంబరు ఇంతకు ముందు కోర్ట్ట్ ఆఫ్ రిక్వెస్ట్స్ ల కోసం ఉపయోగింపబడేది; 18వ శతాబ్దములో కింగ్ జార్జ్ III యొక్క అధికార విస్తరణ, దగ్గరలో ఉన్న ఆక్ట్ ఆఫ్ యూనియన్ విత్ ఐర్లాండ్, అన్ని కలిసి ఈ మార్పుకు దారి తీసాయి ఎందుకంటే ముందున చాంబరు పెరిగిన న్యాయకోవిదుల సంఖ్యకు సరిపోలేదు.

తనకంటూ సొంతంగా చాంబరు లేని హౌస్ ఆఫ్ కామన్స్ కొన్నిసార్లు తన చర్చలను చాప్టర్ హౌస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ అబ్బే లో నిర్వహించేది. ఎడ్వర్డ్ VI ఏలుబడిలో రాయల్ రాజభవనము యొక్క చాపెల్ అయిన సెయింట్ స్టీఫెన్స్ చాపెల్ ను కామన్స్ రాజ భవనములో తమ శాశ్వత నివాసముగా సాధించుకొన్నారు. 1547 లో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల మూతబడిన తరువాత ఆ భవనము కామన్స్ కు అందుబాటులోనికి వచ్చింది. దిగువ సభ యొక్క అనుకూలము కొరకు తరువాతి మూడు శతాబ్దాలలో సెయింట్ స్టీఫెన్స్ చాపెల్ కు మార్పులు చేయబడ్డాయి. దీనితో దాని మధ్య యుగపు ఆకారము క్రమముగా ధ్వంసము చేయబడింది.

ఉన్న పరిమితమైన స్థలములో మరియు పాత భవనములలో పార్లమెంటు తన కార్యకలాపాలు సాగించుకొనుటకు చాల ఇబ్బంది పడటముతో మొత్తం మీద వెస్ట్ మినిస్టర్ రాజభవనము18వ శతాబ్దము నుండి ప్రముఖమైన మార్పులను చవిచూసింది. పూర్తిగా కొత్త రాజభవనము కొరకు పిలుపులు పెడచెవిన పెట్టబడ్డాయి. దానికి బదులుగా మరిన్ని భవనములు చేర్చబడ్డాయి. సెయింట్ మార్గరెట్ వీధి వైపుకు ముఖము తిరిగి ఉన్నటువంటి ఒక భవనము పల్లాడియాన్ శైలిలో 1755 మరియు 1770ల మధ్య నిర్మించారు. ఇందులో దస్తావేజుల నిలువకు మరియు కమిటీ గదులకు ఎక్కువ చోటు కేటాయించారు. హౌస్ ఆఫ్ కామన్స్ యొక్క స్పీకరు కొరకు ఒక అధికారిక నివాసము సెయింట్ స్తీఫెంస్ చాపెల్ ఆనుకొని నిర్మించబడింది మరియు ఈ నిర్మాణము 1795లో పూర్తి చేయబడింది. నియో-గోతిక్ నిర్మాణశిల్పి అయిన జేమ్స్ వ్యాట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ మరియు కామన్స్ రెండింటిలోను 1799 మరియు 1801ల మధ్య పనులు కొనసాగించాడు.

రాజభవన సముదాయము మరొకసారి పునః ఆకృతీకరించ బడింది. ఈ సారి 1824 మరియు 1827ల నడుమ సర్ జాన్ సోఅనే చే చేయబడింది. 1605లో జరిగిన విఫలయత్నమైన గన్‌పౌడర్ ప్లాట్ నందు గురి చేయబడిన మధ్యయుగపు హౌస్ ఆఫ్ లార్డ్స్ చాంబరు, ఈ పనిలో భాగముగా ధ్వంసము చేయబడింది మరియు కొత్త రాయల్ గ్యాలరి సృష్టించ బడింది మరియు రాజభవనము యొక్క దక్షిణవైపున ఉత్సవ ప్రవేశ ద్వారము కూడా సృష్టించ బడింది. రాజభవనము వద్ద సోఅనే యొక్క పనిలో భాగంగా పార్లమెంట్ యొక్క రెండు సభలకు కొత్త గ్రంథాలయ సౌకర్యాలు మరియు చాన్సేరి మరియు కింగ్స్ బెంచ్ కొరకు కొత్త న్యాయస్థానా సౌకర్యాలు కూడా ఉన్నాయి. నియో-క్లాసికల్ నిర్మాణ శైలి యొక్క వాడకము వలన సోఅనే యొక్క మార్పులు వివాదాలకు దారి తీసాయి. ఇవి పురాతన భవనము యొక్క గోతిక్ శైలికి వ్యతిరేకముగా ఉండేవి.

అగ్నిప్రమాదము మరియు పునర్నిర్మాణము

1834, అక్టోబర్ 16న రాజభవనములో ఒక అగ్నిప్రమాదము జరిగింది. ఎక్స్‌చెకర్ యొక్క టల్లి స్టిక్స్ నిలవలను ధ్వంసము చేసేందుకు ఉపయోగించిన ఒక పొయ్యి ఎక్కువగా వేడెక్కి మంటలు అంటుకొని హౌస్ ఆఫ్ లార్డ్స్ చాంబరు అగ్నిప్రమాదానికి గురయ్యింది. దీని ఫలితంగా పెద్దదైన పెనుమంట వలన పార్లమెంటు రెండు సభలు రాజభవన సముదాయములోని ఇతర భవనములతో సహా ధ్వంసము అయ్యాయి. గాలి దిశా మార్పువలన మరియు అగ్నిని ఆర్పే ప్రయత్నాల వలన వెస్ట్ మినిస్టర్ హాలు కాపాడబడింది. మిగిలిన రాజభవనములోని ఇతర భాగాలలో ది జివేల్ టవర్, ది అండర్‌క్రోఫ్ట్ చాపెల్ మరియు ది క్లోయిస్టర్స్ మరియు సేయిన్త్ట్ స్టీఫెన్స్ చాపెల్ ఉన్నాయి.

అగ్నిప్రమాదము జరిగిన వెంటనే, కింగ్ విలియం IV ఇంచుమించు పూర్తి అయినటువంటి బకిన్ఘం రాజభవనము ను పార్లమెంటుకు ఇచ్చుటకు ముందుకు వచ్చాడు. తన నివాసముగా ఉన్న ఈ భవనము ఆయనకు నచ్చక దానిని వదిలించుకోవాలని ఆశపడ్డాడు. అయినప్పటికీ, ఆ భవనము పార్లమెంటరి వాడకమునకు తగినటువంటిది కాదని భావించి కానుక నిరాకరించ బడింది. చారింగ్ క్రాస్ లేక సెయింట్ జేమ్స్ పార్కులకు మారడము గురించిన ప్రతిపాదనల విషయంలో కూడా ఇలాగే జరిగింది; రాజ భవనము యొక్క స్థలాభావము ఉన్నప్పటికీ సంప్రదాయము పట్ల ఆకర్షణ మరియు వెస్ట్ మినిస్టర్ యొక్క చారిత్రాత్మక మరియు రాజకీయ సంఘాలు అన్ని రాజభవనము మార్పుకు చాల బలంగా వ్యతిరేకించాయి. ఈ మధ్యకాలంలో, తరువాతి పార్లమెంటుకు వసతి ఏర్పాటు చేయడము అత్యవసరము అయ్యింది అందువలన పెయింటెడ్ చాంబరు మరియు వైట్ చాంబరు త్వరితగతిని మరమ్మత్తు చేయబడి హౌస్ ఆఫ్ లార్డ్స్ మరియు కామన్స్ యొక్క తాత్కాలిక వాడకము కొరకు తయారు చేయబడ్డాయి. ఈ పనులు బోర్డ్ ఆఫ్ వర్క్స్ యొక్క మిగిలిన నిర్మాణశిల్పి సర్ రాబర్ట్ స్మిర్కే ఆధ్వర్యములో జరిగాయి. పనులు త్వరిత గతిని పూర్తయ్యాయి మరియు ఫిబ్రవరి 1835 నాటికి చాంబరులు వాడకమునకు సిద్ధంగా తయారయ్యాయి.

రాజభవనము యొక్క పునర్నిమాణమును అధ్యయనం చేయుటకు ఒక రాయల్ కమిషన్ నియమించబడింది మరియు అనుకొన్న శైలి విషయంలో ప్రజా వాదనలు అనుసరించాయి. యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి వైట్ హౌస్ మరియు ఫెడరల్ కాపిటల్ ను పోలి ఉన్నటువంటి నియో-క్లాసికల్ అప్రోచ్ ఆ కాలంలో చాల ప్రాచుర్యంలో ఉండేది మరియు అప్పటికే పురాతన రాజభవనమునకు చేసిన చేర్పులలో సోఅనే చే వాడబడ్డది కాని విప్లవము మరియు రిపబ్లికనిజం యొక్క ఊహలు కలిగి ఉండేది. గోతిక్ ఆకృతులు సంరక్షణాత్మక విలువలు కలిగి ఉండేవి. "భవనముల యొక్క శైలి గోతిక్ శైలిలో కాని ఎలిజాబెతన్ శైలిలో కాని ఉంటాయని" జూన్ 1835లో కమిషన్ ప్రకటించింది. ఈ ప్రాధమిక నిబంధనలను అనుసరించి నిర్మాణశిల్పుల నుండి ప్రతిపాదనలు తీసుకోవాలని రాయల్ కమిషన్ నిర్ణయించింది.

1836లో, 97 విరోధి ప్రతిపాదనలు అధ్యయనం చేసిన తరువాత రాయల్ కమిషన్ చార్లెస్ బర్రి యొక్క గోతిక్-శైలి రాజభవనము ప్రణాళికను ఆమోదించింది. 1840లో పునాది రాయి వేయబడింది; 1847లో లార్డ్స్ చాంబరు పూర్తి చేయబడింది మరియు కామన్స్ చాంబరు 1852లో తయారయ్యింది (ఈ దశలో బర్రి నైట్హుడ్ అందుకొన్నాడు). ఇంచుమించు ఎక్కువభాగం పని 1860 నాటికి పూర్తి కావింప బడినప్పటికీ, నిర్మాణం ఆ తరువాత దశాబ్దము వరకు పూర్తికాలేదు. తన సొంత శైలి గోతిక్ కంటే ఎక్కువగా క్లాసికల్ గా ఉండే బర్రి, కొత్త రాజభవనమును నియో-క్లాసికల్ సిమ్మెట్రి సూత్రముపై నిర్మించాడు. ఆయన ఆడంబరమైన మరియు ప్రత్యేకమైన గోతిక్ అంతర్గతాలకు ఎక్కువగా ఆగస్టస్ పుగిన్ పై ఆధారాపడ్డాడు. వీటిలో వాల్పేపర్లు, చిత్రపని, స్తేయిండ్ అద్దములు, ఫ్లోర్ టైల్స్, లోహపు పనులు మరియు ఫర్నిచర్ వంటివి ఉన్నాయి.

ఇటీవలి చరిత్ర

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో లండన్ యొక్క జర్మన్ బాంబు దాడులలో, ది బ్లిట్జ్ చూడండి , వెస్ట్ మినిస్టర్ రాజభవనము పదునాలుగు వేరువేరు సందర్భాలలో బాంబులతో దాడి చేయబడింది. 1940, సెప్టెంబర్ 26న ఒక బాంబు పురాతన రాజభవనములో పడి సెయింట్ స్టీఫెన్స్ పోర్చ్ మరియు పడమర వైపును తీవ్రంగా నష్ట పరచింది. బాంబు దాడి యొక్క తీవ్రత వలన రిచర్డ్ ది లయన్ హార్ట్ యొక్క విగ్రహము దాని పీఠముపై నుండి పెకిలించబడింది. ఈ విగ్రహము ప్రజాస్వామ్యము యొక్క బల చిహ్నముగా ఉపయోగించబడింది. "ఇది సాధారణ దాడులలో వంగిపోతుందేమో కాని విరగదు" ఇంకొక బాంబు డిసెంబర్ 8న ఎక్కువ శాతం ప్రార్ధనామందిరాలను నష్టపరచింది.

అన్నిటికన్నా తీవ్రమైన దాడి 1941 మే 10/11 రాత్రి జరిగింది. ఈ దాడిలో రాజభవనముపై కనీసము పన్నెండు అఘాతాలు తగిలాయి మరియు ముగ్గురు చనిపోయారు. ఒక తగలబెట్టే బాంబు హౌస్ ఆఫ్ కామన్స్ చాంబరుపై దాడి చేసి తగలబెట్టింది; ఇంకొకటి వెస్ట్ మినిస్టర్ హాల్ యొక్క పైకప్పును తగలబెట్టింది. అగ్నిమాపక దళం రెండింటిని కాపాడలేక పోయింది మరియు హాలును కాపాడే నిర్ణయము తీసుకొనబడింది. ఈ ప్రయత్నములో వారు విజయం సాధించారు. ఇంకొకవైపు పరిత్యక్త అయిన కామన్స్ చాంబరు మరియు సభ్యుల లాబీ రెండూ ధ్వంసము చేయబడ్డాయి. ఒక బాంబు లార్డ్స్ చాంబరును కూడా తాకింది కాని నేలపై నుండి పేలకుండా వెళ్ళిపోయింది. ఒక చిన్న బాంబు లేక యాంటి-ఎయిర్క్రాఫ్ట్ షెల్ క్లాక్ టవరును పైకప్పు యొక్క చూరును తాకి అక్కడ ఎక్కువ నష్టము చేసింది. దక్షిణ గడియార ముఖబిళ్ళ పేల్చివేయబడింది కాని దాని ముళ్ళు మరియు గంటలు సురక్షితముగానే ఉన్నాయి. ఆ గొప్ప గడియారము సమయాన్ని సరిగ్గా చూపడము కొనసాగించింది.

కామన్స్ చాంబరు యొక్క ధ్వంసము తరువాత, లార్డ్స్ తమ సొంత చర్చా చాంబరును కామన్స్ యొక్క వాడుకకై ఇచ్చారు; లార్డ్స్ సమావేశాలకు క్వీన్స్ రోబింగ్ గదిని తాత్కాలికంగా ఏర్పాటుచేసుకున్నారు. యుద్ధము తరువాత కామన్స్ చాంబరు నిర్మాణశిల్పి సర్ గిలెస్ గిల్బర్ట్ స్కాట్ ఆధ్వర్యములో ఇంతకు ముందు ఉన్న పురాతన చాంబరు శైలిలో సూక్ష్మీకరించి పునర్నిర్మించ బడింది. 1950లో పని పూర్తి చేయబడింది, దానితో రెండు సభలు వారివారి చాంబరులకు తిరిగి చేరుకొన్నాయి.

రాజభవనములో ఆఫీసు స్థలము యొక్క ఆవశ్యకత పెరగడముతో, పార్లమెంటు సమీపములోని నార్మన్ షా భవనము లో ఆఫీసు స్థలము 1975లో సంపాదించింది మరియు ఈ మధ్యలో కస్టం-బిల్ట్ పోర్ట్క్యులిస్ హౌస్ లో చోటు సంపాదించి 2000లో పూర్తిచేసింది. ఈ పెరుగుదల MP లందరికి తమ సొంత ఆఫీసు సౌకర్యాలు ఏర్పరచుకునే అవకాశం కల్పించింది.

బాహ్య ప్రదేశము

River front of the Palace of Westminster

View from across the Thames in the morning...
...and at dusk. Portcullis House is visible on the right.

వెస్ట్ మినిస్టర్ రాజభవనము కొరకు సర్ చార్లెస్ బర్రి యొక్క ఆకృతులు పర్పెండిక్యులర్ గోతిక్ శైలిని ఉపయోగిస్తాయి. ఈ శైలి 15వ శతాబ్దము కాలములో చాల ప్రాచుర్యములో ఉంది మరియు 19వ శతాబ్దము గోతిక్ రివైవల్ సమయములో తిరిగి వచ్చింది. బర్రి ఒక క్లాసికల్ నిర్మాణశిల్పి కానీ ఆయన గోతిక్ నిర్మాణశిల్పి అయినటువంటి అగస్తస్ పుగిన్ చే సహాయము చేయబడ్డాడు.11వ శతాబ్దములో నిర్మించబడిన వెస్ట్ మినిస్టర్ హాల్ 1834 నాటి అగ్నిప్రమాదమును తట్టుకోంది. ఇది బర్రి యొక్క ఆకృతితో స్థాపించబడింది. పగిన్ ఆ పని యొక్క ఫలితముతో సంతృప్తి పడలేదు ముఖ్యంగా బర్రి ఆకృతి చేసిన సిమ్మెట్రికల్ లే అవుట్ విషయంలో. ఆయన ఇలా వ్యాఖ్యానించారు, అంతా గ్రేషియన్, సర్, క్లాసిక్ బాడిపై ట్యూడర్ వివరాలు".

రాతిపని

భవనము యొక్క రాతిపని నిజానికి అన్స్టన్ కు సంబంధించినది. ఇది ఒక రకమైన ఇసుక-రంగు ఉన్న మగ్నీసియాన్ సున్నపురాయి. దీనిని దక్షిణ యోర్క్శైర్ లోని ఆన్స్టన్ గ్రామము నుండి తీసుకొని రాబడింది. అయినప్పటికీ, ఆ రాయి కాలుష్యము వలన మరియు నాణ్యమైన రాయి వాడకపోవడం వలన క్షీణించి పోవడం మొదలయ్యింది. 1849 నాటికి ఇటువంటి లోపాలు స్పష్టమైనప్పటికీ మిగిలిన 19వ శతాబ్దములో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయినప్పటికీ, 1910ల కాలంలో, కొంత భాగము రాతిపని మార్చవలసిన అవసరము ఉందని స్పష్టమయ్యింది. 1928లో రుట్లాండ్ నుండి తేబడిన ఒక రకమైన తేనే-రంగు సున్నపురాయి, క్లిప్స్‌హాం రాయిని వాడి క్షీణించిన అన్స్టన్ ను మార్చే అగత్యము ఏర్పడింది. ఈ ప్రణాళిక 1930లలో మొదలయ్యింది కాని రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా నిలిపివేయబడి 1950లలో పూర్తి చేయబడింది. 1960ల నాటికి కాలుష్యము తిరిగి తన తరుగు మొదలుపెట్టింది. బాహ్య ప్రకర్షలకు మరియు తవరులకు రాయి సంరక్షణ మరియు పునఃస్థాపన కార్యక్రమము 1981లో మొదలయ్యి 1994లో పూర్తి చేయబడింది. హౌస్ అధికారులు అప్పటినుండి చాల అంతర్గత కోర్ట్ యార్డుల బాహ్య పునఃస్థాపన పనులు చేపట్టారు. ఈ పని సుమారు 2011 నాటికి పూర్తి అవుతుందని అంచనా.

టవరులు

వెస్ట్ మినిస్టర్ రాజభవనములో మూడు ముఖ్యమైన టవరులు ఉన్నాయి. వీటిలో, 98.5 మీటర్లు (323 అడుగులు) విక్టోరియ టవరు అతిపెద్దది మరియు అత్యున్నతమైనది. ఇది రాజభవనము యొక్క నైరుతి భాగమును ఆక్రమించింది. ఆ కాలములో ఏలుబడిలో ఉన్నఅప్పటి చక్రవర్తి విలియం VI గౌరవార్ధము "కింగ్స్ టవర్" అని పిలువబడే ఈ టవరు, బర్రి యొక్క సహజ ఆకృతులలో ఒక భాగము. దీనిని ఆయన చాల ముఖ్యమైన అంశముగా అనుకున్నారు. గొప్ప చతురస్రాకారపు టవరును లెజిస్లేటివ్ కోటకు కాపలాగా నిర్మాణశిల్పి భావించాడు (ప్రణాళికా పోటీలో పోర్త్క్యూల్లిస్ యొక్క ఎంపిక తన గుర్తుగా చెప్పాడు) మరియు దానిని రాజభవనములోనికి రాచ ప్రవేశాముగా ఉపయోగించాడు మరియు పార్లమెంటు యొక్క రక్షిత అంశాలకు అగ్నిప్రమాదాల నుండి రక్షించేదిగా కూడా ఉపయోగించాడు. విక్టోరియ-టవరు చాలసార్లు పునరాకృతీకరించబడింది మరియు దాని ఎత్తు కూడా పెరగసాగింది; 1858లో అది పూర్తి అయిన సమయములో అది ప్రపంచములో అత్యున్నతమైన భవనముగా నిలిచింది.

టవరు యొక్క పీఠభాగమున సార్వభౌముని ప్రవేశము ఉన్నది. ఇది చక్రవర్తి పార్లమెంటును ప్రారంభించుటకు లేదా ఇతర స్టేట్ సందర్భాల కొరకు రాజభావనములోనికి ప్రవేశించు సమయంలో ఉపయోగించారు. 15.2 మీటర్లు (50 అడుగులు) ఎత్తున వున్నకమాను సెయింట్ జార్జ్, ఆండ్రూ మరియు పాట్రిక్ మరియు రాణి విక్టోరియా యొక్క విగ్రహాలతో సహా ఎన్నో శిల్పాలతో ఎంతో ఘనంగా అలంకరించ బడింది. విక్టోరియా టవరు యొక్క ముఖ్య భాగములో పార్లమెంటరి ప్రాచీన దస్తావేజులు సుమారు మూడు మిలియన్ల దస్తావేజుల వరకు 8.8 కిలోమీటర్లు (5.5 మైళ్ళు) లో స్టీల్ అల్మారాలో సుమారు 12 అంతస్తులలో వ్యాపించి ఉన్నాయి; వీటిలో 1497 నుండి అన్ని పార్లమెంట్ అక్ట్స్ యొక్క మాస్టర్ కాపీలు మరియు అసలు బిల్ ఆఫ్ రైట్స్ మరియు కింగ్ చార్లెస్ I యొక్క మరణ వాన్గ్మూలము వంటి ముఖ్యమైన గ్రంధములు ఉన్నాయి. కాస్ట్-ఐరన్ పిరమిడ్ ఆకారపు పైకప్పు పైభాగములో ఒక 22.3 మీటర్లు (73 అడుగులు) ధ్వజస్తంభము ఉంది. అక్కడినుండి రాజభవనములో సార్వభౌముడు ఉన్నప్పుడు రాయల్ స్టాండర్డ్ (చక్రవర్తి యొక్క వ్యక్తిగత జెండా) ఎగురుతుంది. పార్లమెంటు యొక్క రెండు సభలు జరుగుతున్నప్పుడు మరియు నిర్దేశించిన ఫ్లాగ్ డేస్ లలో, యూనియన్ పతాకము ధ్వజముపై నుండి ఎగురవేయ బడుతుంది.

రాజభవనము యొక్క ఉత్తర దిశగా ఎంతో ప్రాచుర్యము పొందిన క్లాక్ టవర్ ఉంది. ఇది బిగ్ బెన్ అని పిలువబడుతుంది. 96.3 మీటర్లు (316 అడుగులు) వద్ద, అది విక్టోరియా టవర్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది కాని దానికన్నా చాల సన్నగా ఉంటుంది. దీనిలో వెస్ట్ మినిస్టర్ యొక్క గ్రేట్ క్లాక్ ఉంది. దీనిని ఎడ్వర్డ్ జాన్ డెంట్, ఔత్సాహిక హోరాలజిస్ట్ అయిన ఎడ్మండ్ బెక్కేట్ డెనిసన్ యొక్క ఆకృతులపై నిర్మించారు. ఒక గంటలోని సెకను వరకు తిరిగే ది గ్రేట్ క్లాక్ గడియారము పై స్థాయి నిర్దుష్టతను సాధించింది. పంతొమ్మిదో శతాబ్దపు గడియార తయారీదారులలోకెల్లా గొప్ప నిర్దిష్టతను సాధించిన గడియారంగా గుర్తించబడింది. 1859లో తన సేవలందించినప్పటి నుండి నమ్మదగ్గ సమయాన్ని చూపిస్తున్నది. సమయము నాలుగు గడియార బిళ్ళలపై చూపబడుతుంది. ఇవి 7 మీటర్లు (23 అడుగులు) వ్యాసార్థము కలిగి ఉన్నాయి మరియు వీటిని ఒపాల్ గ్లాస్ తో తయారు చేసారు. రాత్రి వేళలలో వెనుక వైపునుండి వెలిగించ బడతాయి; గంటల ముల్లు 2.7 మీటర్లు (8 అడుగులు 10 in) పొడవు ఉంది మరియు నిమిషాల ముల్లు 4.3 మీటర్లు (14 అడుగులు) పొడవు ఉంది;

గడియారముపై నున్న గంటగూడులో అయిదు గంటలు వ్రేలాడుతూ ఉన్నాయి. నాలుగు పావుగంట గంటలు వెస్ట్ మినిస్టర్ సంగీతమును ప్రతి పావుగంటకు మ్రోగిస్తాయి. అతిపెద్ద గంట ప్రతి గంటకు మ్రోగుతుంది; అధికారికంగా దీనిని ది గ్రేట్ బెల్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ అంటారు. ఇది సాధారణంగా బిగ్ బెన్ అని పిలువబడుతుంది. ఈ పేరు కొన్ని మూలాలలో వాడబడే ఎగతాళి పేరు. కాలక్రమములో ఇది మొత్తం టవరుకు వర్తింపజేశారు. ఈ పేరుగల మొదటి గంట పరీక్షించే సమయంలో పగిలింది మరియు పునర్నిర్మించ బడింది; ప్రస్తుతము ఉన్న గంటపై ఆ తరువాత ఒక చీలిక ఏర్పడి, దానివలన ఒక విభిన్నమైన శబ్దమును ఇస్తుంది. ఇది బ్రిటన్ లోనే మూడవ అత్యంత బరువైన గంట. దీని బరువు 13.8 tonne (13.6 long ton). క్లాక్ టవరు పైన ఉన్న లాంతరులో అయ్ర్టన్ లైట్ ఉంది. ఇది పార్లమెంటు యొక్క ఏదైనా సభ చీకటి పడ్డ తరువాత సమావేశమైతే వెలిగించబడుతుంది. దీనిని 1885లో రాణి విక్టోరియ కోరిక మేరకు స్థాపించారు. దీనిని ఆమె బకిన్ఘం రాజభవనము నుండి సభ్యులు పనిలో ఉన్నారో లేదోనని చూచుటకు ఏర్పాటు చేయించారు. దీనికి 1870లలో మొదటి కమిషనర్ ఆఫ్ వర్క్స్ అయిన ఆక్టన్ సమీ అయ్ర్టన్ పేరు పెట్టబడింది.

రాజభవనము యొక్క మూడు ప్రధాన టవరులలో చిన్నదైన అష్టముఖాకృతి కలిగిన సెంట్రల్ టవర్ (91.4 మీటర్లు (300 అడుగులు) వద్ద) భవనము యొక్క మధ్యలో మరియు సెంట్రల్ లాబీకి పైన ఉన్నది. కొత్త పార్లమెంటు సభల యొక్క వెంటిలేషన్ విషయంలో బాధ్యత ఉన్న డా.డేవిడ్ బోస్వెల్ రీడ్ పట్టుబట్టడము వలన దీనిని కూడా ప్రణాళికలో చేర్చడము జరిగింది: ఆయన ప్రణాళిక ప్రకారము ఒక పెద్ద సెంట్రల్ గొట్టము అవసరము అయ్యింది. ఈ గొట్టము ద్వారా రాజభవనము చుట్టు ఉన్నటువంటి నాలుగు వందల అగ్నిప్రదేశాల నుండి వచ్చే వేడి మరియు పొగతో కూడిన చెడు వాయువులు భవనము బయటికి లాగివేయబడతాయి. టవరుకు చోటు కల్పించుటకు, బర్రి తప్పనిసరిగా సెంట్రల్ లాబీ కొరకు ఆలోచించిన దానికంటే లాఫ్టి పైకప్పును తగ్గించ వలసి వచ్చింది మరియు దాని కిటికీల యొక్క ఎత్తు కూడా తగ్గించ వలసివచ్చింది, అయినప్పటికీ, టవరు రాజభవనము యొక్క బాహ్య ఆకృతిని అభివృద్ధి పరచు అవకాశము ఇచ్చింది. మరింత భారీ లాటరల్ టవరులను సమము చేయుటకు బర్రి దాని కొరకు ఒక రకమైన గోపురము ను ఎంచుకొన్నాడు.. చివరిలో, అనుకున్న ప్రయోజనము పూర్తిచేయుటలో సెంట్రల్ టవరు పూర్తిగా విఫలమయ్యింది కాని ఇది ఒక విషయములో గుర్తించదగ్గది "నిర్మాణ శాస్త్ర ఆకృతిపై యాంత్రిక సేవలు నిజమైన ప్రభావము చూపిన మొదటి సందర్భము".

రాజభవనము ముందు భాగాములలోని కిటికీ బేల మధ్య నుండి మొదలయ్యే శిఖరాలు కాకుండా, భవనము యొక్క స్కైలైన్ వెంబడి ఎన్నో టుర్రేట్ లు రంజింప జేస్తాయి. సెంట్రల్ టవరు మాదిరిగా, వీటిని కూడా కొన్ని వ్యవహారిక కారణాల వలన మరియు మాస్క్ వెంటిలేషన్ షాఫ్ట్ ల కొరకు చేర్చడము జరిగింది.

This template is currently non-functional due to http://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=37256. <section>begin=</section><section>end=</section>వెస్ట్ మినిస్టర్ రాజభవనములో మరికొన్ని ఇతర విషయాలు ఉన్నాయి. వీటిని కూడా టవరులు అంటారు. సెయింట్.స్టీఫెన్స్ టవర్ రాజభవనము యొక్క పడమర ముఖము వైపు మధ్యలో మరియు వెస్ట్ మినిస్టర్ హాల్ మరియు పురాతన రాజభవనము ప్రాంగణముల మధ్య స్థాపించబడింది. దీనిలో పార్లమెంటు సభలకు ప్రజల ప్రవేశామునకు ద్వారము ఉంది. దీనిని సెయింట్. స్టీఫెన్స్ ఎంట్రన్స్ అంటారు. నదీ ముఖమున ఉత్తర మరియు దక్షిణ చివర్లలో ఉన్న మండపాలను స్పీకర్స్ టవర్ మరియు చాన్సేల్లర్స్ టవర్ అని అంటారు. ఈ పేర్లను రాజభవనము యొక్క పునర్నిర్మాణము సమయంలో రెండు సభలలో పదవిలో ఉన్న అధికారులైన హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకరు మరియు ది లార్డ్ హై చాన్సేల్లర్ ల పేరుమీద పెట్టబడ్డాయి. స్పీకర్స్ టవర్ లో స్పీకర్స్ హౌస్ ఉంది. ఇది హౌస్ ఆఫ్ ది కామన్స్ స్పీకరు యొక్క అధికారిక నివాసము.

గ్రౌండ్‌లు (మైదానాలు)

వెస్ట్ మినిస్టర్ రాజభవనము చుట్టూ ఎన్నో చిన్న ఉద్యానవనాలు ఉన్నాయి. విక్టోరియ టవర్ గార్డెన్స్ రాజభవనమునకు దక్షిణమున నది తీరమున ప్రజా ఉద్యానవనముగా ఉంది. బ్లాక్ రోడ్స్ గార్డెన్ (జెంటిల్మాన్ ఉషార్ ఆఫ్ ది బ్లాక్ రోడ్ పేరుమీద ఉన్నది) ప్రజలకు అనుమతించబడదు మరియు అది వ్యక్తిగత ప్రవేశముగా ఉపయోగించబడుతుంది. పురాతన రాజభవన ప్రాంగణము, రాజభవనము యొక్క ముందు భాగములో ఉంది. ఇది పక్కాగా కట్టబడింది మరియు కాంక్రీట్ భద్రత బ్లాకులతో కప్పబడింది ( క్రింద భద్రత ను చూడండి ) క్రామ్వెల్ గ్రీన్ (ఫ్రంటేజ్ పైన కూడా, 2006లో కొత్త సందర్శకుల కేంద్ర నిర్మాణం కొరకు హోర్డింగ్ తో కప్పివేయబడింది), న్యూ ప్యాలెస్ యార్డ్ (ఉత్తర దిక్కున) మరియు స్పీకర్స్ గ్రీన్ (ప్యాలెస్ యొక్క ఉత్తరాన ఉన్న) - ఇవ్వన్ని ప్రజల సందర్శనకు అనుమతించారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ ఎదురుగా ఉన్నటువంటి కాలేజ్ గ్రీన్ ఒక చిన్న ముక్కోణపు గ్రీన్. ఇది రాజకీయవేత్తల యొక్క టెలివిజన్ ముఖాముఖిలకు ఉపయోగించబడుతుంది.

అంతర్గత భాగం

వెస్ట్ మినిస్టర్ రాజ భవనములో సుమారు 1,100 గదులు, 100 మెట్లు మరియు 4.8 కిలోమీటర్లు (3 మైళ్ళు) వెళ్ళే దారులు ఉన్నాయి. ఇవి అన్ని నాలుగు అంతస్తులలో వ్యాపించి ఉన్నాయి. భూతల అంతస్తులో ఆఫీసులు, భోజన శాలలు మరియు బార్లు ఉన్నాయి; మొదటి అంతస్తులో (ప్రధాన అంతస్తు అని పిలువబడే) రాజభవనము యొక్క ముఖ్యమైన గదులు ఉన్నాయి. వీటిలో చర్చలు జరిగే చాంబరులు, లాబీలు మరియు గ్రంథాలయాలు ఉన్నాయి. పై రెండు అంతస్తులు కమిటీ గదులు మరియు ఆఫీసులుగా ఉపయోగింపబడుతున్నాయి.

రూపరేఖ

ఒక ముఖ్య సింహ ద్వారము బదులు, రాజభవనములో వేరువేరు ఉపయోగాలకు వెళ్ళే వర్గాలకు వేరువేరు ప్రవేశద్వారాలు ఉన్నాయి. విక్టోరియా టవరు యొక్క పీఠభాగములో ఉన్నటువంటి సార్వభౌముని ప్రవేశద్వారము రాజభవనము యొక్క నైరుతి భాగమున ఉన్నది మరియు ఇది రాచ ఊరేగింపుల మార్గమునకు మరియు పార్లమెంటు యొక్క స్టేట్ ప్రారంభోత్సవాల వద్ద చక్రవర్తి చే ఉపయోగింపబడే సెరిమోనియల్ గదుల సూట్ నకు మొదలు. ఇందులో రాయల్ మెట్లదారి, ది నార్మన్ పోర్చ్, ది రోబింగ్ గది, రాయల్ గ్యాలరీ మరియు రాకుమారుని చాంబరు ఉన్నాయి మరియు ఉత్సవము జరిగే లార్డ్స్ చాంబరులో ముగుస్తుంది. హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు పురాతన రాజభవనము ప్రాంగణములో మధ్యలో ఉన్న పీర్స్ ప్రవేశద్వారమును వాడతారు. ఇది ఒక రాతి కారేజ్ పోర్చ్ చే కప్పబడి ప్రవేశ హాలులోనిది దారితీస్తుంది. అక్కడి నుండి ఒక మెట్లదారి, ఒక కారిడార్ గుండా, రాకుమారుడి చాంబరులోనికి దారితీస్తుంది.

పార్లమెంట్ సభ్యులు వారి భావన భాగాములోనికి కొత్త రాజభవనము ప్రాంగణములో దక్షిణమున ఉన్న సభ్యుల ప్రవేశద్వారము గుండా ప్రవేశిస్తారు. వారి దారి ఒక ప్రార్ధనా గదుల క్రింది అంతస్తులో ఉన్న క్లాక్‌రూం గుండా వస్తుంది మరియు కామన్స్ చాంబరునకు దక్షిణమున ఉన్న సభ్యుల లాబిలోనికి చేరుకుంటుంది. కొత్త రాజభవనము ప్రాంగణము నుండి స్పీకర్ యొక్క కోర్టుకు మరియు రాజభవనమునకు ఈశాన్యములో ఉన్న స్పీకరు నివాసము యొక్క ప్రధాన ద్వారము వద్దకు చేరుకొనవచ్చు.

సెయింట్ స్తీఫెంస్ ప్రవేశద్వారము, అందాజుగా భవనము యొక్క పదమార ముఖము మధ్యలో ప్రజల కొరకు ప్రవేశ ద్వారము ఉంది. అక్కడి నుండి, సందర్శకులు వరుస హాల్ దారుల వెంట నడచి మెట్లు ఎక్కి ప్రధాన అంతస్తుకు మరియు రాజభవనము యొక్క హబ్ అయిన అష్ట కోణాకృతిగల సెంట్రల్ లాబికి చేరుకొంటారు. ఈ హాలుకు ఫ్రెస్కో చిత్రలేఖనాలతో అలంకరించిన సిమ్మెట్రికల్ కారిడార్లు ఉన్నాయి. ఇవి ప్రక్క గదులకు మరియు రెండు సభల యొక్క చర్చా చాంబరులకు దారి తీస్తాయి: ఉత్తరాన ఉన్న సభ్యుల లాబీ మరియు కామన్స్ చాంబరు మరియు దక్షిణాన ఉన్న పీర్స్ లాబీ మరియు లార్డ్స్ చాంబరు. ఇంకొక మురల్-లైండ్ కారిడార్ దిగువ నిరీక్షనా హాలుకు తూర్పునకు దారి తీస్తుంది మరియు మెట్లదారి మొదటి అంతస్తుకు దారి తీస్తుంది. ఇక్కడ నదీ ముఖము వరుస 16 కమిటీ గడులచే ఆక్రమించబడింది. వాటికి నేరుగా క్రింది వైపున, రెండు సభల యొక్క గ్రంథాలయాలు ప్రధాన అంతస్తులో థేమ్స్ నదికి అభిముఖంగా ఉంటాయి.

నార్మన్ పోర్చ్

విక్టోరియా టవరు కిందనున్న సార్వభౌముని ద్వారము వెస్ట్ మినిస్టర్ భవంతి కి రాచమార్గము. ఇది చక్రవర్తి ఉపయోగార్ధం తయారుచేయబడింది. చక్రవర్తి ప్రతి సంవత్సరము పార్లమెంట్ స్టేట్ ప్రారంభోత్సవమునకు బకింగ్హాం భవంతి నుంచి ప్రయాణం చేస్తారు. సందర్భానుసారంగా సార్వభౌముడు ధరించే ఇంపీరియల్ స్టేట్ క్రౌన్, రాచరిక అధికారానికి ప్రతీకలైన కాప్ ఆఫ్ మెయింటెనెన్స్ మరియు స్వార్డ్ ఆఫ్ స్టేట్, కూడా కోచ్ చేత భవంతి లోకి ప్రవేశం పొందుతాయి. ఊరేగింపు ముందు చక్రవర్తి సమక్షంలో వీటిని వాడతారు. రాయల్ భావంతులలోని పరివారము ఈ వస్తువులు భవంతిలోకి ప్రవేశించినపుడు తోడుగా ఉంటారు. వీరిని సమూహముగా రిగేలియా అని అంటారు. వీరు చక్రవర్తి రాకకు కొంచం ముందే వస్తారు. ఈ వస్తువులను రాయల్ గ్యాలరి లో అవసరం పడే వరకు ప్రదర్శనకు ఉంచుతారు. సార్వభౌముని ప్రవేశమార్గము పర్యటించే ప్రముఖులకు మరియు భవంతిని సందర్శించే ప్రజలకు కూడా ఇది ముఖ్య మార్గము.

అక్కడి నుండి, రాయల్ మెట్లు ప్రధాన అంతస్తుకు దారితీస్తుంది. గ్రే రంగులో గ్రెనైట్ రాయితో 26 మెట్లు విశాలంగా ఏర్ప??

Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
George X
8 November 2015
Amazing architecture & of course the famous Big Ben.Visit Westminster Palace inside,even if tickets are expensive.You will wander around parliament's halls/see the place where all decisions are taken.
David
6 July 2015
One of the top must place to visit when in London. Tour of the Parliament must be booked in advance via internet. Verry interesting and comprehensive visit. Architecture of the building is amazing.
Josh Wood Productions
12 January 2013
Fantastic architectural masterpiece! You must visit this place! The Palace of Westminster commonly known as the Houses of Parliament housing the House of Commons and the House of Lords.
Filmsquare
14 July 2013
Following James Bond's escapades at the Golden Dragon Casino, Macau in Skyfall (2012) we are transported to Gareth Mallory's office via a wide shot focusing on the Palace of Westminster at night.
Filmsquare
14 June 2013
Popular with the Bond franchise, the Palace of Westminster was first seen in an establishing shot in Goldfinger (1964) just after Jill Masterson was painted gold and 007 is meeting with M.
Filmsquare
25 May 2013
The Palace of Westminster is seen in the background of a scene in For Your Eyes Only (1981). Shortly afterwards James Bond's helicopter pilot is killed and he has to battle to regain control.
9.0/10
Hadia Gh. మరియు 139,194 ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు
Spectacular Strand 2 bed apartment!!

ప్రారంభించడం $0

Amba Hotel Charing Cross

ప్రారంభించడం $645

1 Compton

ప్రారంభించడం $0

Clarendon Serviced Apartments - Chandos Place

ప్రారంభించడం $0

The Grand at Trafalgar Square

ప్రారంభించడం $418

Amba Hotel Charing Cross

ప్రారంభించడం $0

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
House of Commons of the United Kingdom

The House of Commons is the lower house of the Parliament of the

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Victoria Tower

The Victoria Tower is the square tower at the southern end of the

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Jewel Tower

The Jewel Tower in London is one of only two surviving sections of the

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
St. Margaret's, Westminster

The Anglican church of St. Margaret, Westminster Abbey is situated in

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
బిగ్ బెన్

బిగ్ బెన్ అనేది లండన్ లోని వెస్ట్‌మినిస్టర్ రాజభవనము యొక్క ఉత్తర కొన వ

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Westminster Abbey

The Collegiate Church of St Peter at Westminster, which is almost

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Parliament Square

Parliament Square is a square at the northwest end of the Palace of

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
The Burghers of Calais

Les Bourgeois de Calais is one of the most famous sculptures by

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Nymphenburg Palace

The Nymphenburg Palace (German: Schloss Nymphenburg), i.e. 'Nymph's

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
El Escorial

El Escorial is an historical residence of the king of Spain. It is one

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Royal Pavilion

The Royal Pavilion is a former royal residence located in Brighton,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
ఫర్బిడెన్ సిటీ

ఫర్బిడెన్ సిటీ (Forbidden City) మింగ్ రాజవంశం నుండి క్విం

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Palace of Versailles

The Palace of Versailles, or simply Versailles, is a royal château in

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి