స్వాత్ లోయ

ఇది కూడ చూడు

పాకిస్తాన్ పశ్చిమోత్తర భాగం చిత్రపటంలో స్వాత్ (పసుపు రంగులో చూపబడింది) ప్రకృతి రమణీయతకు పేరొంది, పాకిస్తాను దేశపు స్విట్జర్లాండ్ అనబడు ప్రాంతము స్వాత్ లోయ[1]. ఇచట ప్రవహించు స్వాత్ నది పేరుమీద ఈ ప్రాంతమునకు, మండలమునకు పేరులు అబ్బాయి. ప్రాచీన భారతములో స్వాత్ పేరు సువస్తు. పాకిస్తాన్ లోని వాయువ్య రాష్ట్రములో, రాజధాని ఇస్లామాబాద్ నకు 160 కి.మీ. దూరములో నున్నది. స్వాత్ మండలములోని ముఖ్య పట్టణము సైదు షరీఫ్. ఇస్లామిక ఉగ్రవాదులు (తాలిబన్లు) స్వాత్ లోయను ఆక్రమించి[2], అచట షరియా చట్టము చెల్లునటుల పాకిస్తాన్ ప్రభుత్వముతో ఒడంబడిక చేసుకున్నారు. ఈ ప్రాంతములో 170 పాఠశాలలు ధ్వంసము చేసి, బాలికలకు విద్యను దూరము చేశారు.[3]

చరిత్ర

సువస్తు నదీ ప్రస్తావన తొలుత ఋగ్వేదము (8.19.37) లో గలదు[4][5]. ఋగ్వేద కాలములో ఈ ప్రాంతముపేరు ఉద్యానము. క్రీ. పూ. 4వ శతాబ్దిలో జరిగిన అలెగ్జాండర్ దండయాత్రలో ఇచటి ఉదేగ్రామ, బారికోట గ్రీకుల వశమయ్యాయి. క్రీ.పూ. 325లో స్వాత్ లోయ, ఆఫ్ఘనిస్తాన్ మౌర్యులపాలనలోకి వచ్చాయి. స్వాత్ లోయ అందాలకు, చక్కని ప్రశాంత వాతావరణమునకు ముగ్ధులైన బౌద్ధులు, ఇండో-గ్రీకులు, కుషాణులు క్రీ.పూ రెండవ శతాబ్దిలో ఇచట స్థిరపడ్డారు. వజ్రయాన బౌద్ధము ఇచటనే ఉద్భవించినది. పలు బౌద్ధ స్తూపాలు, శాక్యముని విగ్రహ సంపదకు స్వాత్ లోయ నెలవు[6].

వేద కాలము

గాంధార లేక స్వాత్ సంస్కృతి (క్రీ.పూ. 1700 నుండి క్రీ.పూ. 300 వరకు) గాంధార దేశము, స్వాత్ నదీ పరివాహక ప్రాంతములో వ్యాపించినది. అప్పటి ప్రజలు (ఇండో-ఆర్యులు) వేద సంస్కృతము, ప్రాచీన పారశీకము మొదలగు ఆర్య భాషలు మాట్లాడేవారు[7]. క్రీ.పూ. 1700-1100 మధ్య ఆర్యులు స్వాత్ లోయ, సప్త సింధు మైదానములలో తొలుత ఋగ్వేదమును ఉచ్చరించారు[8][9]. ఈ ప్రాంతములన్నియూ క్రీ. పూ 500 (పాణిని కాలము) వరకు వేద మంత్రోచ్చారణలతో ప్రతిధ్వనించుచుండెడివి. .

బౌద్ధము

క్రీ. పూ 4వ శతాబ్ది కాలములో స్వాత్ లోయ మౌర్య చక్రవర్తుల ఆధిపత్యము క్రిందికి వచ్చినది. అశోక చక్రవర్తి ప్రభావముతో బౌద్ధము ఇచట అడుగిడింది. పద్మసంభవుడను భిక్షువు మొదటి బౌద్ధ ఆశ్రమమును స్థాపించాడు. ఈతడే తాంత్రిక బౌద్ధమును టిబెట్ లోనికి వ్యాపింపచేశాడు. పిదప తొమ్మిది శతాబ్దములు గాంధారములోను, స్వాత్ లోయలోను బౌద్ధము పరిఢవిల్లింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గాంధార శిల్పము బుద్ధుని సుందర ప్రతిమలకు, విహారములకు, స్తూపములకు మూల స్థంభమయ్యింది. ఆశియా ఖండము నలుమూలల నుండి జ్ఞానపిపాసులైన బౌద్ధులు ఈ ప్రాంతమును సందర్శించి బౌద్ధమును చదివి పలుప్రాంతములకు వ్యాపింప చేశారు. స్వాత్ లోయలో 1400 స్తూపములు, విహారములు, 6000 సువర్ణ బుద్ధ ప్రతిమలు ఉండెడివి. ప్రస్తుతము 160 చదరపు కి.మీ. ప్రాంతములో 400 బౌద్ధ స్థలాలు ఉన్నాయి. బుత్ఖారా స్తూపములో బుద్ధుని అవశేషములు దొరికాయి. ఘలేగే అను ఊరిలో శిలలో తొలుచబడిన చక్కని బౌద్ధ విగ్రమున్నది. దీని సమీపములో ఒక పెద్ద బౌద్ధ స్తూపము గలదు.

హిందూ ధర్మము

ఇస్లాం ప్రవేశము

స్వాత్ నది

స్వాత్ నది. స్వాత్ నది హిందూకుష్ పర్వతాలనుండి పాకిస్తాన్ పశ్చిమోత్తర ప్రాంతపు కలామ్ లోయగుండా ప్రనహించి పెషావర్ లోయలోని కాబూల్ నదిలో కలుస్తుంది. స్వాత్ జిల్లాలో వ్యవసాయానికి, మత్స్యపరిశ్రమకు ఇది ముఖ్యమైన ఆధారం. సుందరమైన ఈ నదీలోయను సందర్శించడానికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ఈ నదిపై రెండు జలవిద్యుత్కేంద్రాలు ఉన్నాయి.

ఋగ్వేదం (8.19.37) లో ఈ నది "సువస్తు" అని చెప్పబడింది. అలెగ్జాండర్ తన సైన్యంతో ఈ నదిని దాటినట్లు తెలుస్తున్నది. ఈ నది తీరప్రాంతం ఒకప్పుడు "శ్రీవస్తు" అని, తరువాత "సువస్తు" అని పిలువబడ్డాయి.

సాంఘిక స్వరూపము

చూడదగిన ప్రదేశాలు

తాలిబన్ల ప్రభావము

తాలిబాన్లను సృష్టించింది పాకిస్థానీ నేతలేనని,అమెరికాకు చెందిన సిఐఎ, తన దేశానికి చెందిన ఐఎస్ఐ కలసి తాలిబన్ లకు ఊపిరిపోశాయని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అన్నారు.(ఈనాడు - ‎10 మే 2009)

  • పాక్‌లోని స్వాత్ లోయలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తాలిబన్లు ఈ రెండేళ్లలో 200 స్కూళ్లకు నిప్పు పెట్టారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఆడపిల్లలు చదువుకోకూడదని ఆదేశాలిస్తున్న తాలిబస్లు ఆడపిల్లలు చదువుకోకుండా అడ్డుకునేందుకు ఏకంగా స్కూళ్లనే తగులబెట్టారు. మీరు నిజమైన ముస్లింలు అయితే అమ్మాయిలను చదివించవద్దని పిలుపు ఇచ్చారు.తమపై సైనిక దాడులను తక్షణం నిలిపేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని ఉగ్రవాద సంస్థలు అల్‌ఖైదా , తాలిబన్ హెచ్చరించాయి.ఇలాంటి బెదిరింపులను ప్రభుత్వం లెక్కచేయబోదని, ఉగ్రవాదులందరినీ అంతంచేసే వరకు సైనిక పోరాటం కొనసాగుతుందని జర్దారీ తేల్చిచెప్పారు. ఈనాడు 24.5.2009

మూలాలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

వర్గం:పాకిస్తాన్

en:Swat, Pakistan hi:स्वात ar:سوات cs:Svát cy:Swat da:Swat (Pakistan) de:Swat (Distrikt) fa:سوات fi:Swatin laakso fr:District de Swat ia:Swat it:Swat (Pakistan) ko:스와트 (파키스탄) nl:Swat no:Swat (Pakistan) pl:Dolina Swat pt:Swat (Paquistão) ru:Сват (Пакистан) sh:Swat (Pakistan) simple:Swat District sv:Swat ur:سوات wuu:斯伐脱县

zh:斯瓦特县
  1. In the Realm of Mullah Fazlullah
  2. [1]"Scenic Pakistani valley falls to Taliban militants", AP News, December 31, 2008
  3. The News, Pakistan, January 21, 2009
  4. Journal of Indian History, Dept. of Modern Indian History, University of Kerala, 1963, page 28
  5. Features of Person and Society in Swat: Collected Essays on Pathans, F. Barth, Routledge, 1981, Page 19
  6. Students' Britannica India, Dale Hoiberg అన్ద్ Indu Ramchandani, Page 138
  7. Tulsa, Sebastiano, 1977, The Swat Valley in the 2nd and 1st Millennia BC: A Question of Marginality, South Asian Archaeology 6:675-695
  8. The Vedic People: Their History and Geography, Rajesh Kochar, 2000, Orient Longman, ISBN 81-250-1384-9
  9. Bryant, Edwin, 2001, The Quest for the Origins of Vedic Culture, Oxford University Press, ISBN 0-19-513777-9
Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
స్వాత్ లోయ కోసం ఇంకా చిట్కాలు లేదా సూచనలు లేవు. తోటి ప్రయాణికులకు ఉపయోగకరమైన సమాచారాన్ని పోస్ట్ చేసిన మొదటి వ్యక్తి మీరు కావచ్చు? :)
Pearl Continental Peshawar

ప్రారంభించడం $94

Pearl Continental Muzaffarabad

ప్రారంభించడం $104

Shelton's Green

ప్రారంభించడం $33

Bhurban Apartments Murree

ప్రారంభించడం $39

VIP Guesthouse

ప్రారంభించడం $80

Bhurban Apartments

ప్రారంభించడం $24

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Gharm-Chashma

Gharm-Chashma is a hot spring in the mountains of the Ishkoshim Range

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Tirich Mir

Tirich Mir (alternatively Terich Mir and Terichmir) is the highest

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Hindu Kush

The Hindu Kush is a mountain range in eastern and central

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Takht Bhai

Takht Bahi (or Takhtbai or Takht-i-Bahi) is a Buddhist monastic

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Makra Peak

Makra is a scenic peak in the Hazara region of the Himalayas in

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Muzaffarabad Fort

Muzaffarabad Fort - there are two historical forts on opposite sides

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Bala Hisar Fort

Bala Hisar Fort is one of the most historic places of Peshawar. The

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Jamrud Fort

Located at the entrance to the Khyber Pass, Jamrud Fort was built by

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Chaco Culture National Historical Park

Chaco Culture National Historical Park is a United States National

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Trolltunga

Trolltunga is a piece of rock that stands horizontally out of the

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
White Cliffs of Dover

The White Cliffs of Dover are cliffs which form part of the British

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Dune of Pilat

The Dune of Pilat (French: Dune du Pilat, official name), also called

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Balanced Rock

Balanced Rock is one of the most popular features of Arches National

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి