సింహిక

సింహిక (ప్రాచీన గ్రీకు: Σφίγξ /స్పింక్స్‌, కొన్ని సందర్భాల్లో Φίξ /ఫిక్స్‌ ) అనేది శయనించినట్లుగా కనిపించే మానవ శిరస్సును కలిగిన సింహం యొక్క ఒక పురాతన విగ్రహం. పురాతన ఈజిప్టుకు చెందినవిగా భావిస్తున్న పలు విగ్రహాల్లో దీనికి సంబంధించిన మూలాలున్నాయి. పురుష రాక్షసుడుకి "స్ట్రాంగ్లర్ (గొంతునులిమి హతమార్చేవాడు)" అనే పేరును ప్రాచీన గ్రీకులు పెట్టారు. అంటే పురాతన గ్రీకుకు చెందిన ఒక ప్రాచీన విగ్రహమని అర్థం. అలాంటి విగ్రహాలు దక్షిణ మరియు ఆగ్నేయాసియాల్లోనూ దర్శనమిస్తాయి. ఐరోపా అలంకార కళలో, పునరుజ్జీవన సమయంలో సింహిక భారీస్థాయి పునరుద్ధరణకు నోచుకుంది. వాస్తవిక ఈజిప్టు నాగరికతతో అత్యంత సారూప్యత కలిగిన సింహిక ప్రతిమ పలు ఇతర సంస్కృతుల (నాగరికతలు)కు కూడా విస్తరించింది. వాస్తవ వివరణల అనువాదాలు మరియు ఇతర సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి భావ పరిణామక్రమాల వల్ల ఈజిప్టు నాగరికత తరచూ భిన్నమైన రీతిలో విశ్లేషించబడింది.

సింహికలు సాధారణంగా దేవాలయ సంరక్షకులుగా ఉంటాయి. రాజుల సమాధులు లేదా మత సంబంధిత దేవాలయాలు వంటి నిర్మాణాల ఎదుట వాటిని ఏర్పాటు చేస్తారు. అత్యంత పురాతన సింహికను టర్కీలోని గోబెక్లి టెపీలో 9,500 B.C.లో గుర్తించారు. కొన్నిసార్లు ఈజిప్టులోని తొలి సింహిక 2723-2563 BC మధ్యకాలంలో ముగిసిన నాలుగో రాజవంశమునకు చెందిన హెతెఫియర్స్ IIను తెలుపుతుంది. అదే రాజవంశానికి చెందిన గ్రేట్ స్పింక్స్ ఆఫ్ గిజాను అతిపెద్ద మరియు ప్రసిద్ధ సింహికగా పేర్కొంటారు. నైలు నది పశ్చిమ తీరాన, తూర్పు ముఖంగా ఉన్న గిజా పీఠభూమిపై అరబిక్‌‌లో: أبو الهول అని రాయబడి ఉంది. దానిని ఎప్పుడు నిర్మించారనేది కచ్చితంగా తెలియకపోయినా, గ్రేట్ స్పింక్స్ యొక్క శిరస్సు ఫరావో ఖఫ్రాదిగా ప్రస్తుతం విశ్వసించబడుతోంది.

ఆ విగ్రహానికి దానిని కట్టినవారు ఏమి పేరు పెట్టారో తెలియదు. గ్రేట్ స్పింక్స్ వద్ద ప్రసరణ స్తంభంపై శాసనాన్ని 1400 BCEలో తుట్‌మోస్ IV వెయ్యేళ్ల తర్వాత నిలిపారు. అప్పటి స్థానిక ఆరాధ్యదైవం సూర్యదేవుడు యొక్క ఖిపెరా, రీ, ఆటమ్ అనే మూడు రూపాల పేర్లను అది సూచిస్తుంది. సమాధి మరియు దేవాలయ సముదాయాల్లో వీటిని ఏర్పాటు చేయడం సత్వరం సంప్రదాయమైపోయింది. శక్తివంతమైన దేవత సిఖ్‌మెట్‌తో తమ దగ్గరి సంబంధాన్ని తెలిపే విధంగా పలువురు ఫరావోల (పురాతన ఈజిప్టు రాజులు) సమాధుల వద్ద సంరక్షక విగ్రహాల పైభాగాన వారి శిరస్సులను చెక్కడం ఆనవాయితీగా మారిపోయింది.

ఇతర ప్రసిద్ధ ఈజిప్టు సింహికల్లో పరావో హట్‌షెప్‌సట్‌ తలను కలిగిన దానిని చెప్పుకోవచ్చు. ఆమెను పోలిన సింహికను గ్రానైట్‌పై చెక్కారు. అది ప్రస్తుతం న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఉంది. పాలరాయితో తయారు చేసిన మెంఫిస్‌ సింహిక ప్రస్తుతం అక్కడ బయటప్రాంతంలో నిర్మించిన మ్యూజియంలో ఉంది. సమాధులు మరియు దేవాలయాల వద్ద సంరక్షక సింహికల యొక్క అతిపెద్ద వరుసలను ఏర్పాటు చేయడం మరియు మెట్ల సమూహాలుగా కనిపించే స్తంభాలపై వివరాలను పొందుపరచడం విస్తృతమైంది. అమోన్‌ను తెలిపే తొమ్మిది వందల పొట్టేల తలలతో కూడిన విగ్రహాలను తీబ్స్‌లో నిర్మించడం జరిగింది. అక్కడ అతన్ని అమితంగా ఆరాధిస్తారు.

గ్రీకు సంప్రదాయాలు

కాంస్య యుగం మొదలుకుని ఈజిప్టుతో గ్రీకులకు వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలున్నాయి. అంతకుముందు అలెగ్జాండర్‌ ఈజిప్టును ఆక్రమించాడు. ఈ విగ్రహాలకు గ్రీకు పేరు స్పింక్స్‌ అప్పటికే అమల్లో ఉంది. గ్రీసు చరిత్రకారులు మరియు భౌగోళిక శాస్త్రవేత్తలు ఈజిప్టు సంస్కృతిపై విస్తృత రచనలు చేశారు. పొట్టేల తలల సింహికలను వారు కొన్ని సందర్భాల్లో క్రియోస్పింక్సెస్‌ గానూ, పక్షి తలలతో చెక్కిన వాటిని హీరోకోస్పింక్సెస్‌ గానూ పిలిచేవారు.[ఆధారం కోరబడింది]

స్పింక్స్‌ అనే పదం గ్రీకు Σφίγξ నుంచి ఉద్భవించింది. కచ్చితంగా σφίγγω (స్పింగో ) అనే క్రియ నుంచి జనించింది. అంటే "ఊపిరాడకుండా చేయు" అని దానర్థం. సింహాల్లో వేటాడటంలో ఆడసింహాలు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అవి వేటాడే జంతువును ఊపిరాడకుండా గొంతుకొరికి, చనిపోయేంత వరకు అలాగే పట్టుకుని ఉంటాయి, దీని వలనే ఈ పేరును వీటికి ఆపాదించి ఉండవచ్చు. ఇదే మూలం నుంచే స్పింక్టర్‌ అనే పదం కూడా ఉద్భవించింది. అయితే "స్పింక్స్ (సింహిక)" అనే పదం నిజానికి "జీవమున్న రూపం" అనే అర్థానిచ్చే ఈజిప్టు పేరు "షీసేపంక్‌" నుంచి తప్పుగా వచ్చిందని చరిత్రకారుడు సుసాన్ వైజ్ బౌర్ తెలిపాడు. క్రూరమృగం కంటే "జీవమున్న రాయి" (చెక్కబడి, మరొక ప్రదేశం నుండి తీసుకుని వచ్చినది కాకుండా, అదే ప్రదేశంలో ఉన్న రాతితో తయారు చేసినది) నుంచి చెక్కిన సింహిక విగ్రహాన్ని సూచించడానికి ఉపయోగించారు.

గ్రీకు పురాణంలో ఒకే ఒక సింహిక ఉంది. అది విశిష్ట విధ్వంసక రాక్షసి మరియు దురదృష్టానికి ప్రతీక. ఎచిద్నా మరియు ఆర్ద్రస్ కుమార్తెయైన హీసోయిద్‌‌ మరియు ఇతరుల సమాచారం ప్రకారం, ఆమె ఎచిద్నా మరియు టైఫూన్‌ల తనయ. ఇవన్నీ కూడా గ్రీకు దేవుళ్లను ఒలింపియన్లు ఆరాధించడానికి ముందు అంటే ప్రారంభ గ్రీకు కల్పితగాథలకు సంబంధించిన చితోనిక్ (భూ ఉపరితలానికి దగ్గరగా జీవించే) ప్రతిమలు. చరిత్రకారుడు పియర్ గ్రిమాల్ యొక్క ది పెంగ్విన్ డిక్షనరీ ఆఫ్ క్లాసికల్ మైథాలజీ ఇలా చెబుతోంది, సింహిక యొక్క కచ్చిత నామం ఫిక్స్‌ (Φίξ). అయితే ఈ సమాచారానికి సంబంధించి, అది ఒక వనరును గుర్తించకపోవడం గమనార్హం.సింహికను గ్రీకు కవి హీసోయిద్ థియోగోనీ (సంతతులు మరియు దేవుళ్ల వంశవృక్ష అధ్యయన శాస్త్రం)లోని 326వ లైనులో ఈ పేరుతో (ఫిక్స్‌ (Φίξ)) పేర్కొన్నాడు.

గ్రీకు పురాణంలో సింహిక అనేది మహిళ శిరస్సు, సింహం యొక్క దేహం, డేగ రెక్కలు మరియు విష సర్పం తోక కలిగిన ఒక దెయ్యాన్ని తెలుపుతుంది.

సింహిక అనేది పురాతన చివోస్ నగరం యొక్క చిహ్నం. అంతేకాక ఇది ముద్రికలపై మరియు ఆరో శతాబ్దం BC, మూడో శతాబ్దం AD మధ్య ప్రాంతంలో నాణేల ముఖ భాగంపై కూడా దర్శనమిచ్చింది.

ఎథీనా పార్థీనోస్‌ విగ్రహం యొక్క శిరస్త్రానం మధ్య భాగంలోనూ ఒక సింహిక కనిపిస్తుంది.

సింహిక వృత్తాంతం

సింహిక గ్రీకు నగరమైన తీబ్స్‌ ప్రవేశద్వారం వద్ద కాపలా కాస్తున్నట్లు చెప్పబడుతోంది. ప్రయాణీకులకు దారివ్వడానికి వారిని అది ఒక చిక్కు ప్రశ్న అడుగుతుంది. అయితే సింహిక ఎలాంటి ప్రశ్న అడుగుతుందన్న విషయాన్ని పూర్వీకులు స్పష్టం చేయలేదు. దిగువ తెలిపిన విధంగా గ్రీకు చరిత్ర ఆఖరి వరకు కూడా దానిని స్థిరీకరించలేదు.

సింహికను హెరా లేదా ఆరీస్‌ తన ఇథియోఫియా స్వదేశం (గ్రీకులు ఎప్పుడూ సింహిక యొక్క విదేశీ సంతతినే గుర్తించుకుంటుంటారు) నుంచి గ్రీసులోని తీబ్స్‌కు పంపినట్లు గతంలో చెప్పబడింది. చరిత్రలోనే అత్యంత క్లిష్టమైనదిగా చెప్పుకునే ఈ చిక్కు ప్రశ్నను అక్కడి పాదచారులందరిని ఆమె అడుగుతుంది. "ఏ జీవి ఉదయం పూట నాలుగు కాళ్లపై, మధ్యాహ్నం రెండు కాళ్లపై, సాయంత్రం మూడు కాళ్లపై నడుస్తుంది? మరియు దానికున్న మరిన్ని కాళ్లు? వాటిలో బలహీనమైనది?". సరైన సమాధానం చెప్పని వారిని ఆమె గొంతునులిమి, హతమారుస్తుంది. ఓడిపస్‌ ఆమె ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చాడు, మనిషి-శిశువుగా ఉన్నప్పుడు నాలుగింటి (కాళ్లు మరియు చేతులు కలిపి)పై పాకుతాడు, పెద్దవాడు కాగానే రెండు కాళ్లపై తర్వాత వృద్ధాప్యంలో కర్ర సాయంతో నడుస్తాడు. మరికొన్ని గణాంకాల ప్రకారం (చాలా అరుదుగా), మరో చిక్కు ప్రశ్న కూడా ఉంది, "ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అందులో ఒకరు మరొకరికి జన్మనిచ్చారు. అందుకు ప్రతిగా ఆమె మొదటి ఆమెకు జన్మనిచ్చింది." దీనికి సమాధానం "పగలు మరియు రాత్రి" (గ్రీకులో ఈ రెండు పదాలూ స్త్రీవాదానికి సంబంధించినవే)

చివరగా ఉత్తమ సమాధానం లభించేంత వరకు ఈ చిక్కు ప్రశ్నావళి కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత సింహిక తనకు తానుగా ఎత్తైన రాతిబండపై నుంచి దూకి, చనిపోతుంది. ఆయితే ఆమె తనకు తానుగా పూర్తిగా హతమార్చుకుంటుందనే మరో వాదన కూడా ఉంది. ప్రశ్నకు సరైన సమాధానమిచ్చిన ఓడిపస్ ఒక "ప్రవేశ" లేదా గుమ్మపు ప్రతిమగా గుర్తించబడతాడు. సదరు ప్రతిమ సింహిక మరణాన్ని పురస్కరించుకుని ఆచరించే పురాతన మతపర ఆచారాలు మరియు కొత్తగా వెలుగులోకి వస్తున్న ఒలింపియా దేవుళ్ల మధ్య తేడాను ప్రభావితం చేయడానికి సాయపడుతుంది.

ఓడిపస్ గురించి జీన్ కోక్టియా మరోసారి వివరించిన ది ఇన్‌ఫెరల్ మెషీన్‌లో చిక్కుప్రశ్నకు సమాధానాన్ని సింహిక అతనికి చెబుతుంది. తనను హతమార్చడం వల్ల భవిష్యత్తులో తాను ఎవరినీ చంపలేనని అతనికి చెబుతుంది. అంతేకాక అతను తనను ప్రేమించే విధంగా కూడా ఆమె చేస్తుంది. అయితే చిక్కుప్రశ్నకు తనకు సమాధానమిచ్చిన ఆమెకు అతను ధన్యవాదాలు కూడా చెప్పకుండా వెళ్లిపోతాడు. సింహిక మరియు చిక్కుప్రశ్నకు సమాధానం చెప్పని వారిని చంపే అనూబిస్ (సమాధుల వద్ద ఉండే కాపలాదారు) స్వర్గానికి తిరిగి వెళ్లడం ద్వారా సన్నివేశం ముగుస్తుంది.

దక్షిణ మరియు అగ్నేయాసియాల్లోని సింహికలు

సింహం యొక్క దేహం మరియు మానవ శిరస్సుతో కూడిన అవిభక్త పురాణ సంబంధిత ప్రతిమ దక్షిణ మరియు ఆగ్నేయాసియా సంప్రదాయాలు, పురాణాలు మరియు కళల్లో చోటుచేసుకుంది. భారతదేశంలో ఎక్కువగా పురుషమృగ (సంస్కృతం,, "పురుష-మృగం"), పురుషమిరుగం (తమిళం, "పురుష-మృగం"), నరవిరాళ (సంస్కృతం, "పురుష-మార్జాలం") అని లేదా శ్రీలంకలో నరసింహ (పాళీ, "పురుష-సింహం") అని, మియన్మార్‌లో మనుసిహ లేదా మనుతిహ (పాళీ, "పురుష-సింహం") అని మరియు థాయ్‌లాండ్‌లో నోరా నాయర్‌ లేదా థెప్‌నోరాసింగ్ అని పిలుస్తుంటారు.

నాగరికత ఆగిపోయిన కారణంగా ప్రాచీన సంప్రదాయాలు కనుమరుగైన ఈజిప్టు, మెసపటోమియా మరియు గ్రీసుల్లోని సింహికల మధ్య తేడా నేపథ్యంలో "ఆసియా సింహిక" సంప్రదాయాలు నేడు చాలా వరకు ఆచరించబడుతున్నాయి. దక్షిణాసియా ఉపఖండంలోని "సింహికల" తొలి సృజనాత్మక చిత్రణలు ఎక్కువగా హెలెనిస్టిక్ కళ మరియు రచనల ద్వారా ప్రభావితమయ్యాయి. కొద్దిమేర హెలెనిస్టిక్ ప్రభావం చేత బౌద్ధ కళ మార్పు చెందిన కాలం నుంచే ఇవి గుర్తింపు పొందాయి. అయితే మూడో శతాబ్దం BC, మొదటి శతాబ్దం AD మధ్యకాలంలోని మధుర, కౌసంబి మరియు సాంచిలకు చెందిన సింహికలు హెలినిస్టు (పురాతన గ్రీసు అధ్యయన వేత్త)యేతరమైనదిగా, దేశీయ లక్షణాన్ని కలిగి ఉన్నాయి. విదేశీ ప్రేరణ ద్వారా పుట్టిన "సింహిక" భావనను తీర్మానించడం అసాధ్యం..

దక్షిణ భారతదేశంలో "సింహిక"ను పురుషమృగ (సంస్కృతం) లేదా పురుషమిరుగం (తమిళం)గా పిలుస్తారు. అంటే "పురుష మృగం" అని అర్థం. అంతేకాక దేవాలయాలు మరియు ప్యాలెస్‌లలోనూ ఇది ఎక్కువగా దర్శనమిస్తుంది. అపోట్రోపియాక్ (అదృష్ట దేవత)గా పనిచేస్తుంది. పురాతన ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇవి "సింహికలు"గా మాత్రమే ఉంటాయి. సింహిక గురించి సంప్రదాయబద్ధంగా ఈ విధంగా చెప్పబడింది, దేవాలయంలోకి ప్రవేశించిన భక్తుల పాపాలను తొలగించడం మరియు సాధారణంగా చెడు ప్రభావాలను దూరం చేయడం. సింహిక తరచూ గోపురం లేదా ఆలయ ప్రధాన ద్వారం లేదా గర్భగుడి ప్రవేశం వద్ద వ్యూహాత్మక భంగిమలో కనిపిస్తుంది.

పురుషమృగ దక్షిణ భారత శైవ ఆలయాల్లో ప్రతినిత్యం జరిపే పూజా కార్యక్రమాల్లో విశిష్ట పాత్రను కలిగి ఉంటుంది. షోడశోపచార (లేదా పదహారు గంటల) పుణ్యకార్యాన్ని ఒకటి నుంచి ఆరు సార్లు రోజంతా ఎంతో నిష్టగా చేస్తారు. ఇందులో దీపారాధన లేదా దీపోత్సవానికి సంబంధించిన దీపాల్లో ఒక దానిని అలంకరించడం జరుగుతుంది. మరియు అనేక దేవాలయాల్లో పురుషమృగ ఒకానొక వాహనంగా లేదా బ్రహ్మోత్సవాలు లేదా పండుగ సందర్భాల్లో దేవుళ్ల ఊరేగింపు కోసం రథాల వలే ఉపయోగించబడుతుంది.

భారత ఉపఖండంలోని దక్షిణ భాగాన ఉన్న చివరి ప్రాంతం కన్యాకుమారి జిల్లాలో శివరాత్రి రోజు రాత్రి పన్నెండు శివాలయాలను సందర్శించడం మరియు దర్శించడం ద్వారా భక్తులు 75 కిలోమీటర్లు పరిగెత్తుతారు. శివ ఓట్టం (లేదా శివుడి కోసం పరుగు) సింహిక మరియు మహాభారతం లోని ప్రముఖ కథానాయకుల్లో ఒకడైన భీముడు మధ్య పరుగు పందెం కథకు గుర్తుగా దానిని జరుపుకుంటారు.

సంప్రదాయ గ్రీకు ఆలోచనతో దగ్గర సంబంధాన్ని కలిగిన సింహిక యొక్క భారతీయ భావన అనేది శరభ పద్ధతి. అంటే ఇదొక ప్రాచీన జంతువు. చూడటానికి కొంత సింహం, కొంత మనిషి మరియు కొంత పక్షి ఆకారంలో కనిపిస్తుంది. నరసింహుడి హింసను అరికట్టడానికి శివుడు శరభ అవతారమెత్తుతాడు.

ఫిలిప్పైన్స్‌లో సింహికను నికోలోనియాగా పిలుస్తారు. మనిషి మరియు డేగ భాగాలను కలిగిన ఇది బికాల్ ప్రాంతంలో సంచరించే పాదచారులను చిక్కుప్రశ్నలను అడుగుతుంటుంది. తన ప్రశ్నకు జవాబు చెప్పలేని వారిని మేయాన్ అగ్నిపర్వతం వద్దకు తీసుకెళ్లి, అక్కడ అగ్నిదేవుడు గెవ్రా కోపాన్ని చల్లార్చడానికి వారిని బలిస్తారని చెబుతుంటారు.

శ్రీలంకలో సింహికను నరసింహ లేదా పురుష-సింహంగా పిలుస్తారు. సింహికకు సింహం మాదిరి శరీరం మరియు మనిషి శిరస్సు ఉండటం వల్ల నరసింహ విషయంలో అయోమయం చెందకూడదు. నరసింహ అనేది విష్ణువు నాలుగో అవతారం. ఈ అవతారం లేదా పునర్జన్మలోనే ఆయన మనిషి శరీరం మరియు సింహం శిరస్సుతో అవతరించాడు. "సింహిక" నరసింహ అనేది బౌద్ధ సంప్రదాయం మరియు కార్యక్రమాల్లో భాగం. ఉత్తర దిక్కు సంరక్షణ చూసుకునేదిగా మరియు బ్యానర్లపై కూడా చిత్రీకరించారు.

బర్మాలో సింహికను మనుసిహ మరియు మనుతిహగా పిలుస్తారు. దీనిని బౌద్ధ స్థూపాల మూలల్లో చిత్రీకరించారు. అప్పుడే జన్మించిన రాజవంశపు శిశువును రాక్షసుల నుంచి కాపాడటానికి బౌద్ధ బిక్షువులు దీనిని ఏ విధంగా రూపొందించారన్న విషయాన్ని పూర్వీకులు వివరించారు.

నోరా నాయర్ మరియు థెప్‌ నోరాసింగ్ అనేవి థాయ్‌లాండ్‌లో "సింహిక"ను పిలిచేందుకు వాడే రెండు పేర్లు. దిగువ భాగం సింహం లేదా జింక శరీరం మరియు పై భాగం మనిషి రూపంలో ఉండే అవి నిటారుగా నడుస్తున్నట్లుగా రూపొందించడం జరిగింది. తరచూ అవి ఆడ-మగ జంటల మాదిరిగా అనిపిస్తాయి. ఇక్కడ కూడా సింహిక సంరక్షక బాధ్యతను నిర్వర్తిస్తుంది. పవిత్ర హిమాపన్‌ పర్వత ప్రాంతాల్లో నివశించే ప్రాచీన జీవుల్లో దీనిని కూడా చేర్చడం జరిగింది.

ఐరోపాలో పునరుద్ధరించిన సింహికలు

పునరుద్ధరించబడిన పదహారవ శతాబ్దపు మన్నెరిస్ట్ సింహిక కొన్ని సందర్భాల్లో ఫ్రెంచ్ సింహిక మాదిరిగా అనిపిస్తుంది. ఆమె తలను నిటారుగా అమర్చారు. ఆమె యువ మహిళ మాదిరిగా ఉరోజాలును కలిగి ఉంది. తరచూ ఆమె కమ్మలు మరియు ముత్యాల ఆభరణాలను ధరిస్తుంది. ఆమె శరీరం సహజంగా పడుకుని ఉన్న ఒక ఆడసింహం మాదిరిగా కనిపిస్తుంది. రోమ్‌కు సంబంధించిన పదిహేనవ శతాబ్దంలో నీరో "గోల్డెన్ హౌస్ " (డోమస్ అరియా ) యొక్క చిన్న గుహ లేదా "వింతైన" అలంకరణలు వెలుగులోకి వచ్చిన సందర్భంగా అలాంటి సింహికలను పునరుద్ధరించడం జరిగింది. ఆమె సింహికను పదహారవ మరియు పదిహేడవ శతాబ్దాల్లో ఐరోపా అంతటా వ్యాపించిన ముద్రణ పటాల్లో చోటు చేసుకున్న చిత్రవిచిత్రమైన రూపకల్పనల సంప్రదాయక పదజాలంలో ఇమిడ్చారు. రోమ్ గుహలకు సంబంధించిన పదజాలాన్ని అభివృద్ధి చేసిన రాపాయెల్‌ (1515-20) వర్క్‌షాపు ద్వారా వాటికన్ ప్యాలెస్‌ యొక్క పొడవాటి వసారా అలంకరణలో సింహికలు ఏర్పాటు చేయబడ్డాయి.

ఫ్రెంచ్ కళకు సంబంధించిన సింహికల మొట్టమొదటి దృశ్యాలు 1520 మరియు 1530 దశకాల్లో స్కూల్ ఆఫ్ ఫౌంటెయిన్‌బ్లూలో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత ఫ్రాన్స్ చారిత్రక కాలం రీజెన్స్‌ (1715–1723)కు చెందిన కనుమరుగైన సృజనాత్మక శైలిలోనూ ఆమె సింహికల ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది.

ఆమె ఫ్రాన్స్ నుంచి ఐరోపా అంతటా వ్యాపించింది. తద్వారా పద్దెనిమిదో శతాబ్దపు భవంతి ఉద్యానవనాలకు సంబంధించి బయట ప్రదేశాల్లోని అలంకార శిల్పాలకు ఆమె విశిష్టతను సంతరించుకుంది. వియన్నాలోని అప్పర్ బెల్వెదీర్ ప్యాలెస్, పాట్స్‌డామ్‌లోని శాన్‌సౌకి పార్క్, స్పెయిన్‌లోని లా గ్రాంజా, బెయిల్‌స్టాక్‌లోని బ్రానిక్కి ప్యాలెస్ లేదా పోర్చుగీసు క్యూలజ్ నేషనల్ ప్యాలెస్ (కొన్నిసార్లు 1760 దశకాలకు చెందినదిగా చెబుతారు) మైదానాల్లోని పూర్వపు రొకోకో ఉదాహరణలను చెప్పుకోవచ్చు. వీటిలోని సింహికలన్నీ మెడపట్టీలు మరియు భుజాల మీదుగా దుస్తులు కప్పబడిన ఉరోజాలు వీపు కిందకు దిగజారే ఒక చిన్న వస్త్ర విశేషంతో ముగుస్తాయి.

సింహికలు రాబర్ట్ ఆడమ్ మరియు అతని అనుచరగణం యొక్క గత సంప్రదాయక శైలి పునరుద్ధరణ విశిష్టత అంతర్గత అలంకరణల ప్రత్యేకతను చాటుకున్నాయి. తద్వారా అవి గుహ యొక్క వస్త్రరహిత శైలిని తిరిగి సమీపించాయి. శృంగార కళాకారుల మరియు రూపకర్తల పరంగా అవి సమానమైన నివేదన కలిగి ఉంటాయి. తర్వాత పందొమ్మిదో శతాబ్దంలో ప్రతీకవాద భావనలు చోటు చేసుకున్నాయి. వీటిలో అనేక సింహికలు రెక్కలు లేకపోయినప్పటికీ, అవి ఈజిప్టు కంటే గ్రీకు సింహికను సూచిస్తుండటం గమనార్హం.

రాతితో నిర్మించిన సింహికలు

సింహిక రూపాన్ని తాపీ వృత్తి నిపుణులు కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు. రహస్యాలను కాపాడటానికి ఈజిప్టులోని దేవాలయాల ఎదుట సింహికలను ఏర్పాటు చేశారు. వాటిలో ప్రవేశించే వారిని అవి హెచ్చరిస్తాయి. మహాద్వారం అనేది హెబ్రూ టిసాఫన్‌, దాచడానికి అనే పదం నుంచి పుట్టింది. సింహిక విజయవంతంగా ప్రతి దేవుడికి చిహ్నంగా మారిపోయిందని ఛాంపోలియన్ పేర్కొన్నాడు. దేవుళ్లంతా మనుషుల్లోనే ఉంటారనే విషయాన్ని తెలియజేసే విధంగా పూజారుల్లో మహాద్వారం ఒక ఆలోచనను కలిగిస్తుంది. కాగా, పవిత్ర దేవాలయాల్లో పరిరక్షించబడుతున్న వారి మేధస్సు ఆద్యులకు మాత్రమే బహిర్గతమవుతుంది. తాపీ వృత్తి ద్వారా రూపొందించిన చిహ్నంగా సింహిక దాని ఈజిప్టు రూపంలో ఒక రహస్య చిహ్నంగా ఆమోదించబడింది. కొన్నిసార్లు అది తాపీ వృత్తి ద్వారా నిర్మించిన దేవాలయాల ఎదుట అలంకార ప్రతిమలు (విగ్రహాలు)గా లేదా తాపీలు నిర్మించిన భవనాల ముఖ భాగంలో కూడా దర్శనమిస్తాయి. అయితే సాధారణంగా పురాతనమైనదిగా పిలవబడిన ఇది వరుస చిహ్నంగా గుర్తింపు పొందలేకపోయింది. తులనాత్మకంగా దానిని ఈ మధ్యే పరిచయం చేశారు. ప్రతీకాత్మక అలంకరణ కంటే మూఢ విశ్వాసాన్ని తెలిపే చిహ్నంగా అది పరిచయం చేయబడింది.

సారూప్య జంతువులు

  • 32,000 ఏళ్ల కాలం నాటి సింహ పురుషుడు మనిషి మాదిరిగా కనిపించే ఒక ఆరిగ్నాసియన్ (అరిగ్నాసియన్ సంస్కృతి)కి చెందిన విగ్రహం. దీనికి సింహం శిరస్సుతో కూడిన మనిషి శరీరం ఉంటుంది.
  • మనిషి శిరస్సులు కలిగిన అన్ని పురాతన జంతువులు సింహికలు కాదు. ప్రాచీన ఆస్రియాలో, ఉదాహరణకు, ఎద్దు శరీరంతో కూడిన గడ్డం బాగా ఎదిగిన కిరీటాలున్న రాజుల యొక్క ప్రతిమలు దేవాలయాల ప్రవేశద్వారాల వద్ద కాపలాకాస్తుంటాయి.
  • దేవుళ్లు జంతు రూపాలను వహించగలిగినప్పటికీ, గ్రీసు యొక్క సంప్రదాయక ఒలింపియా పురాణంలో వారు మనిషి రూపాన్ని కలిగి ఉన్నారు. గ్రీకు పురాణానికి చెందిన మనిషి మరియు జంతువు మిళిత రూపాన్ని కలిగిన అన్ని జంతువులు పురాతనమైనవి. సెంటార్‌ (సగం మనిషి సగం గుర్రం)లు, టైఫూన్ (వంద తలల రాక్షసుడు), మెదుసా (ప్రాచీన జంతువు), లామియా (రక్తపిశాచి).
  • నరసింహ ("పురుష-సింహం") అనేది విష్ణువు యొక్క పునర్జన్మ (అవతారం)గా హిందూమత పౌరాణిక గ్రంథాల్లో పేర్కొనబడుతోంది. ఆయన సగం మనిషి/ సగం-సింహం మాదిరి రూపం కలిగిఉన్నాడు. శరీరం కింది భాగం మనిషి మాదిరిగానూ మరియు సింహం మాదిరిగా ముఖం మరియు గోళ్లు కలిగి ఉన్నాడు.
  • మాంటికోర్ (పురాణ రాక్షసుడు) కూడా అదే విధమైన జంతువే. ఇది కూడా మనిషి ముఖంతో సింహం శరీరాన్ని కలిగి ఉంటుంది.

ఇవి కూడా చూడండి

  • యాళి (సింహము మాదిరి శరీరము, డేగ మాదిరి శిరస్సు ఉన్న ఒక ప్రాచీన జంతువు)
  • పిరమిడ్
  • ఈజిప్టు పిరమిడ్లు
  • రెక్కల గుర్రం
  • ఒక రకమైన విహంగం
  • దేవత
  • ఫి సిగ్మా సిగ్మా
Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
Abinesh S
4 January 2018
Negotiate the horse carriage prices to lesser than half before getting on the horse. And all the pyramids in the area are walkable. As the 'guides'to cut the bullshit when they say u can't walk.
MedellinStyle.com GMID
1 November 2012
Just say "no thank you no". To all the camel and horse scammers. They may take pictures and say is free or also free ride saying "pay what makes you happy" be careful. But nothing to worry about.
Dave Mc
31 August 2018
No, Napoleon Bonaparte didn't shoot off his nose, but yes the head looks smaller than the body so maybe there was originally a larger head that was re-carved into what we see today?
Bassem Helal
1 March 2018
It is really amazing to see. My advice to you is to go there at winter not summer due to the scorching sun and sunburns many will try to sell you stuff and make you ride for money.Enjoy.
Angeline Teoh
9 December 2019
The side and front angle looks amazing. Great place for photography but be aware of pick pockets and gift sellers who continues to pester you non stop
Chelsea Doll
6 March 2017
Go on the 30 minute camel ride for the best view of all of the pyramids. The panorama views are breathtaking and even better on a camel.
8.7/10
憑き狐娘, Vadim I మరియు 20,324 ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు
Marriott Mena House, Cairo

ప్రారంభించడం $247

Four Seasons Hotel Cairo at The First Residence

ప్రారంభించడం $180

Swiss Inn Nile Hotel

ప్రారంభించడం $29

Barcelo Cairo Pyramids

ప్రారంభించడం $60

Amarante Pyramids Hotel

ప్రారంభించడం $34

Hor Moheb Hotel

ప్రారంభించడం $31

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Khufu ship

The Khufu ship is an intact full-size vessel from Ancient Egypt that

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Giza Necropolis

The Giza Necropolis stands on the Giza Plateau, on the outskirts of

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
ఈజిప్టు పిరమిడ్లు

'పిరమిడ్' అనునది (Greek: πυραμίς pyramis) జ్యామితి పరంగా పిరమిడ్

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Pyramid of Khafre

The Pyramid of Khafre is the second largest of the Ancient Egyptian

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Pyramid of Menkaure

The Pyramid of Menkaure, located on the Giza Plateau in the

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Layer Pyramid

The Layer Pyramid (known locally in Arabic as il-haram il-midawwar,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Abu Rawash

Abu Rawash (also known as Abu Roach, Abu Roash), 8 km to the North of

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Pyramid of Djedefre

The Pyramid of Djedefre consists today mostly of ruins located at Abu

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Pnyx

The Pnyx (Greek: Πνὐξ, pronounced 'Pniks' in Ancient Greek, Πνύκ

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Saint-Bertrand-de-Comminges

Saint-Bertrand-de-Comminges is a commune in the Haute-Garonne

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Choragic Monument of Lysicrates

The Choragic Monument of Lysicrates near the Acropolis of Athens was

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Bryn Celli Ddu

Bryn Celli Ddu is a prehistoric site on the Welsh island of Anglesey

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Chumash Painted Cave State Historic Park, California

Painted Cave State Historic Park is a small sandstone cave adorned

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి