డిస్నీల్యాండ్

డిస్నీల్యాండ్ పార్క్ అనేది ఒక థీమ్ పార్కు, ఇది కాలిఫోర్నియాలోని అనాహైమ్‌లో ఉంది, ది వాల్ట్ డిస్నీ కంపెనీలో భాగమైన వాల్ట్ డిస్నీ పార్క్స్ అండ్ రిసార్ట్స్ యాజమాన్యంలో ఇది నిర్వహించబడుతుంది. మొదట దీనిని డిస్నీల్యాండ్ అని పిలిచేవారు, ఇప్పటికీ వ్యవహారికంగా దీనిని పిలిచేందుకు ఈ పేరు ఉపయోగిస్తున్నారు, టెలివిజన్‌లో ప్రసారమైన ఒక ప్రసారమాధ్యమ ప్రకటనతో జూలై 17, 1955న ఇది అంకితమివ్వబడింది, జూలై 18, 1955న ప్రజల సందర్శనకు దీనిని తెరిచారు. వాల్ట్ డిస్నీ స్వీయ ప్రత్యక్ష పర్యవేక్షణలో రూపకల్పన మరియు నిర్మాణం పూర్తి చేసుకున్న ఒకేఒక్క థీమ్ పార్కుగా డిస్నీల్యాండ్ ప్రత్యేకత కలిగివుంది. 1998లో, ఈ థీమ్ పార్కు పేరును "డిస్నీల్యాండ్ పార్కు"గా మార్చారు, అతిపెద్ద డిస్నీల్యాండ్ రిసార్ట్ సముదాయం నుంచి దీనిని వేరుచేసేందుకు ఈ పేరు పెట్టారు.

ప్రపంచంలో మిగిలిన అన్ని థీమ్ పార్కుల కంటే డిస్నీల్యాండ్‌ను భారీ సంఖ్యలో ప్రజలు సందర్శించారు, జులై 18, 1955 నుంచి ఇప్పటివరకు సుమారుగా 600 మిలియన్‌ల మంది అతిథులు దీనిని సందర్శించడం జరిగింది. 2009లో పార్కును 15.9 మిలియన్ల మంది పౌరులు సందర్శించారు, ఈ ఏడాది ప్రపంచంలో అత్యధిక మంది పౌరులు సందర్శించిన రెండో పార్కుగా ఇది నిలిచింది.

అంకితం

"To all who come to this happy place: -Welcome- Disneyland is your land. Here age relives fond memories of the past ... and here youth may savor the challenge and promise of the future. Disneyland is dedicated to the ideals, the dreams, and the hard facts that have created America ... with the hope that it will be a source of joy and inspiration to all the world."
—Walter E. Disney, July 17, 1955 4:43pm

చరిత్ర

ఆలోచన మరియు నిర్మాణం

తన కుమార్తెలు డయానా మరియు షారోన్‌లతో కలిసి ఒక ఆదివారం వాల్ట్ డిస్నీ గ్రిఫిత్ పార్కును సందర్శించిన సందర్భంగా ఆయనకు డిస్నీల్యాండ్ ఆలోచన వచ్చింది. తన కుమార్తెలు మెర్రీ-గో-రౌండ్‌పై ఆడుకోవడం చూసినప్పుడు, పెద్దవారు మరియు వారి పిల్లలు వినోదాన్ని పంచుకునే ఒక ప్రదేశం గురించిన ఆలోచన ఆయనకు కలిగింది. అనేక సంవత్సరాలపాటు ఆయన కల కార్యరూపం దాల్చలేదు. చికాగోలో 1893నాటి వరల్డ్స్ కొలంబియన్ ఎక్స్‌పొజిషన్ గురించి తన తండ్రి జ్ఞాపకాలు ద్వారా కూడా వాల్ట్ డిస్నీ ప్రభావితమై ఉండవచ్చు (ఆయన తండ్రి ఈ ఎక్స్‌పొజిషన్‌లో (ప్రజల సందర్శనార్థం ఉన్న ఒక వస్తుసేకరణ ప్రదేశం) పనిచేశారు). అక్కడ ఉన్న మిడ్‌వే ప్లాయిసాన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఆకర్షణలు మరియు మానవ చరిత్రలో వివిధ కాలాలకు ప్రాతినిధ్యం వహించే వస్తువులు ఉండేవి; దీనిలో మొదటి ఫెర్రీస్ వీల్‌, ఒక "ఆకాశ" విహారం, వృత్తాకార పరిధిలో తిరిగే ప్రయాణికుల రైలు మరియు వైల్డ్ వెస్ట్ ప్రదర్శన కూడా ఉండేవి. చికాగోలో 1893 ప్రపంచ ప్రదర్శన ఒక్క వేసవికాలంలోనే జరిగినప్పటికీ, తరువాత 60 ఏళ్లకు నిర్మించిన డిస్నీల్యాండ్‌లో దీనిని వెంటనే స్ఫురింపజేసే పలు ఉదాహరణలు ఉన్నాయి.

డిస్నీ స్టూడియోను సందర్శించడం గురించి అనేక మంది ప్రజలు వాల్ట్ డిస్నీకి లేఖలు రాసేవారు, ఒక చలనచిత్ర స్టూడియో ద్వారా సందర్శక అభిమానులకు అతికొద్ది వినోదాన్ని మాత్రమే అందించగలమని ఆయన ఈ లేఖల ద్వారా తెలుసుకున్నారు. దీంతో పర్యాటకుల సందర్శనకు ఉద్దేశించి తన బుర్‌బ్యాంక్ స్యూడియోకు సమీపంలో ఒక ప్రదేశాన్ని నిర్మించాలనే ఆలోచనలు ఆయనలో పెరిగిపోవడం మొదలైంది. ఆయన ఆలోచనలు తరువాత ఒక చిన్న వినోద పార్కు, బోటు విహార ఏర్పాట్లు మరియు ఇతర వస్తు ప్రదేశాలుగా రూపుదిద్దుకున్నాయి. వాల్ట్ యొక్క మొదటి భావన "మిక్కీ మౌస్ పార్కు", ఇది రివర్‌సైడ్ డ్రైవ్‌పై 8-acre (3.2 ha) విస్తీర్ణంలో ప్రారంభమైంది. ఆపై స్ఫూర్తి మరియు ఆలోచనల కోసం వాల్ట్ ఇతర పార్కులను సందర్శించడం మొదలుపెట్టారు, ఆయన ఇందుకోసం సందర్శించిన పార్కుల్లో టివోలీ గార్డెన్స్, గ్రీన్‌ఫీల్డ్ విలేజ్, ఎఫ్టెలింగ్, టిల్‌బర్గ్, ప్లేల్యాండ్, మరియు చిల్డ్రన్స్ ఫెయిరీల్యాండ్ తదితరాలు ఉన్నాయి. ఈ ఆలోచనలపై తన డిజైనర్‌ల చేత పనిచేయించడం ప్రారంభించారు, అయితే ఇది చివరకు 8 acres (3.2 ha) విస్తీర్ణం కంటే ఎక్కువ ప్రదేశం అవసరమైన ప్రాజెక్టుగా మారింది.

స్టాన్‌ఫోర్డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి హారిసన్ ప్రైస్ అనే ఒక సలహాదారుడిని వాల్ట్ నియమించుకున్నారు, ప్రదేశ సంభావ్య వృద్ధి ఆధారంగా థీమ్ పార్కును ఏర్పాటు చేసేందుకు సరిపోయే ప్రదేశాన్ని అంచనా వేసే బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ప్రైస్ ఇచ్చిన నివేదికతో, పొరుగునున్న ఆరంజ్ కౌంటీలో లాస్ ఏంజిల్స్ నగరానికి ఆగ్నేయంగా అనాహైమ్‌లో నారింజ తోటలు మరియు అక్రోటుకాయ చెట్లతో ఉన్న 160 acres (65 ha) భూభాగాన్ని డిస్నీ కొనుగోలు చేశారు.

నిధులు సమకూర్చడంలో ఇబ్బందులు కారణంగా డిస్నీ వాటి సేకరణకు కొత్త పద్ధతులను అన్వేషించడం మొదలుపెట్టారు. ఆయన ప్రజల్లోకి తన ఆలోచలను తీసుకెళ్లేందుకు టెలివిజన్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు, దీంతో డిస్నీల్యాండ్ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని సృష్టించారు, ఇది అప్పుడప్పుడే రెక్కలు తొడుగుకుంటున్న ABC టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారమైంది. దీనికి బదులుగా, ఈ నెట్‌వర్క్ కొత్త పార్కుపై నిధులు పెట్టుబడికి సాయం చేసేందుకు అంగీకరించింది. మొదట ఐదేళ్లపాటు డిస్నీల్యాండ్ కార్యకలాపాలు డిస్నీల్యాండ్, ఇంక్. యాజమాన్యంలో ఉంటాయి, ఇది వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్, వాల్ట్ డిస్నీ, వెస్ట్రన్ పబ్లిషింగ్ మరియు ABC యాజమాన్యంలోని సంస్థ. 1960లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ ABC యొక్క వాటాను కొనుగోలు చేసింది (దీనికి ముందు అది వెస్ట్రన్ పబ్లిషింగ్ మరియు వాల్ట్ డిస్నీల వాటాను కూడా కొనుగోలు చేసింది). అంతేకాకుండా, ప్రధాన వీధిలోని అనేక షాపులు, U.S.A.లు డిస్నీ నుంచి అద్దెకు తీసుకున్న స్థలంలో ఇతర కంపెనీల యాజమాన్య నిర్వహణలో ఉండేవి.

దీని నిర్మాణం జూలై 16, 1954న ప్రారంభమైంది, పూర్తికావడానికి USD$ 17 మిలియన్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు, సరిగ్గా ఈ తేదీ నుంచి ఒక సంవత్సరం ఒక రోజు తరువాత ఇది ప్రారంభమైంది. ఇదే సమయంలో ఈ ప్రదేశానికి ఉత్తరంవైపు U.S. రహదారి 101 (తరువాత అంతరాష్ట్ర రహదారి 5) నిర్మాణంలో ఉంది: ఇది డిస్నీల్యాండ్‌కు రద్దీని తీసుకొస్తుందని భావించారు, పార్కు నిర్మాణం పూర్తికాకముందే ఈ రహదారిని మరో రెండు మార్గాలు జోడించి పెద్ద రహదారిగా మార్చారు.

జులై, 1955: అంకితమిచ్చిన రోజు మరియు ప్రారంభ దినం

డిస్నీల్యాండ్ పార్కు జూలై 18, 1955న ప్రజల సందర్శనార్థం తెరిచారు, ఆ సమయంలో దీనిలో 20 ఆకర్షణలు మాత్రమే ఉన్నాయి. అయితే, ఒక ప్రత్యేక అంతర్జాతీయ మీడియా ప్రదర్శన కార్యక్రమం ఆదివారం జూలై 17, 1955న జరిగింది, ప్రత్యేకంగా ఆహ్వానించిన అతిథులు మరియు మీడియా ప్రతినిధులకు మాత్రమే ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక ఆదివారపు కార్యక్రమాలతోపాటు, అంకితమివ్వడం దేశవ్యాప్తంగా టెలివిజన్‌లో ప్రసారమైంది, వాల్ట్ డిస్నీ యొక్క ముగ్గురు హాలీవుడ్ మిత్రులు దీనికి యాంకర్‌లుగా వ్యవహరించారు: వారు ఆర్ట్ లింక్‌లెటర్, బాబ్ కుమ్మింగ్స్ మరియు రోనాల్డ్ రీగాన్. ABC ఈ కార్యక్రమాన్ని తన నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది; ఆ సమయంలో, ఇది ఒక అతిపెద్ద మరియు అత్యంత సంక్లిష్ట ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంగా నిలిచింది.

ఈ కార్యక్రమం సాఫీగా సాగలేదు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇచ్చిన ఆహ్వాన టిక్కెట్‌లకు‌ నకిలీ ఆహ్వాన టిక్కెట్‌లు తోడవడంతో పార్కులో జనసమ్మర్థం ఎక్కువయింది. ఈ కార్యక్రమంలో కేవలం 11,000 మంది మాత్రమే పాల్గొంటారని భావించగా, చివరకు 28,154 మంది హాజరయ్యారు. చలనచిత్ర నటులు మరియు ఇతర ప్రముఖ వ్యక్తులు కార్యక్రమంలో ప్రతి రెండు గంటలకు రావాల్సి ఉండగా, అందరూ ఒకేసారి వచ్చారు. దీనికి సమీపంలోని అన్ని ప్రధాన రోడ్‌లు నిర్మానుష్యమయ్యాయి. ఉష్ణోగ్రత అసాధారణంగా 101 °F (38 °C)కి చేరుకుంది, ప్లంబర్‌లు సమ్మె చేయడంతో, పార్కులో త్రాగునీటి ఫౌంటైన్‌లు ఖాళీ అయ్యాయి. ఫౌంటైన్‌లు లేదా మరుగుదొడ్లు ఏదో ఒకటి పనిచేయించడం ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో, డిస్నీ రెండో దానికి మొగ్గుచూపారు.

అయితే, పార్కు ప్రారంభ కార్యక్రమానికి పెప్సీ స్పాన్సర్ (ప్రాయోజితురాలు)గా వ్యవహరించడంతో ప్రతికూల ప్రచారం జరిగింది; నిరాశ చెందిన అతిథులు సోడాను విక్రయించేందుకు త్రాగునీటి ఫౌంటైన్‌లు పనిచేయకుండా చేశారని భావించారు. ఆ రోజు ఉదయం పోసిన తారు ఆరకపోవడంతో, హై-హీల్స్ బూట్లు ధరించిన మహిళల కాళ్లు తారులో దిగబడ్డాయి. వ్యాపారుల వద్ద ఆహారం ఖాళీ అయింది. ఫాంటసీల్యాండ్‌లో గ్యాస్ లీక్ కావడంతో, అడ్వెంచర్‌ల్యాండ్, ఫ్రాంటియర్‌ల్యాండ్ మరియు ఫాంటసీల్యాండ్ మధ్యాహ్నం వరకు మూతబడ్డాయి. కింగ్ ఆర్థూర్ కారౌసెల్ వంటి సవారీల్లోకి తమ పిల్లలను ఎక్కించేందుకు కొందరు తల్లిదండ్రులు ఆహుతుల భుజాలపైగా ఎక్కించి పంపడం కనిపించింది.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మీడియా ప్రదర్శనలో ఇటువంటి గందరగోళాలు చోటుచేసుకోవడంతో, వాల్ట్ డిస్నీ ప్రత్యేక ఆహ్వానితులు రెండో రోజు డిస్నీల్యాండ్‌ను సరిగా వీక్షించేందుకు ఏర్పాట్లు జరిగాయి. తరువాతి సంవత్సరాల్లో వాల్ట్ మరియు ఆయన యొక్క 1955 కార్యనిర్వాహక అధికారులు జూలై 17, 1955ను "బ్లాక్ సండే"గా సూచించారు. ప్రస్తుతం, ప్రదర్శన సభ్యులు జూలై 17న పార్కు యొక్క వార్షికోత్సవం సందర్భంగా పిన్ బ్యాడ్జ్‌లు ధరిస్తుంటారు, ఇవి 1955 ప్రారంభం నుంచి గడిచిన సంవత్సరాల సంఖ్యను సూచిస్తుంటాయి. అయితే మొదటి దశాబ్దం తరువాత, డిస్నీ అధికారికంగా జూలై 18, 1955ను ప్రారంభ దినంగా పేర్కొన్నారు, 18వ తేదీని పార్కు వార్షికోత్సవంగా జరుపుకున్నారు. ఉదాహరణకు, 1967లో డిస్నీల్యాండ్ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో జూలై 17, 1955 అంకితమిచ్చిన రోజు అని, ప్రారంభ దినం కాదని సూచించింది.

సోమవారం జూలై 18న, అంటే ప్రారంభమైన రోజున, ఉదయం 2 గంటల నుంచే ప్రజలు క్యూలో బారులుతీరారు, ఈ పార్కు మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేసిన మరియు మొదట ఈ పార్కులో అడుగుపెట్టిన సాధారణ సందర్శకుడు డేవిడ్ మ్యాక్‌పెర్సన్, ఆయన ప్రవేశ టిక్కెట్ సంఖ్య 2, రాయ్ ఓ. డిస్నీ ముందు ఏర్పాట్లతో 1వ నెంబర్ టిక్కెట్‌ను టిక్కెట్‌ల నిర్వాహకుడు కర్టిస్ లైన్‌బెర్రీ నుంచి కొనుగోలు చేశాడు. ఇద్దరు పిల్లలతో వాల్ట్ డిస్నీ ఒక అధికారిక ఛాయాచిత్రం తీయించుకున్నారు, ఆ పిల్లల పేర్లు వెస్ వాట్‌కిన్స్ (వయస్సు 5, 1955లో) మరియు మైకెల్ షెవార్ట్‌నెర్ (వయస్సు 7, 1955లో); వీరు ముగ్గురు ఉన్న ఛాయాచిత్రానికి ఒక అసంబంధమైన నేపథ్యం జోడించబడింది, ఈ ఛాయాచిత్రం కింద పిల్లలను డిస్నీల్యాండ్ యొక్క మొదటి ఇద్దరు అతిథులుగా తప్పుగా సూచించడం జరిగింది. వాట్‌కిన్స్ మరియు షెవార్ట్‌నెర్ ఇద్దరికీ ఆ రోజు డిస్నీల్యాండ్‌కు జీవితకాలపు ఉచిత పాస్‌లు లభించాయి, మ్యాక్‌పెర్సన్‌కు ఆ తరువాత మరో జీవితకాలపు ఉచిత పాస్‌ను అందించారు, ఈ పాస్‌లు తరువాత ప్రపంచవ్యాప్తంగా డిస్నీ-యాజమాన్యంలోని ప్రతి పార్కుకు విస్తరించబడ్డాయి. సోమవారం ప్రారంభ రోజున పార్కుకు సుమారుగా 50,000 మంది సందర్శకులు వచ్చారు.

ప్రారంభ సంవత్సరాలు

సెప్టెంబరు 1959లో, సోవియట్ ప్రధాన మంత్రి నికిటా ఖ్రుష్చెవ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పదమూడు రోజులపాటు పర్యటించారు. ఖ్రుష్చెవ్ పర్యటనలో రెండు ఆహ్వాన విజ్ఞప్తులు ఉన్నాయి: వాటిలో ఒకటి డిస్నీల్యాండ్‌ను సందర్శించడం కాగా, రెండోది హాలీవుడ్ అగ్రశ్రేణి నటుడు జాన్ వాయ్నేను కలుసుకోవడం. ప్రచ్ఛన్న యుద్ధ ఉద్రిక్తత మరియు భద్రతా ఆందోళనలు కారణంగా, ఆయన డిస్నీల్యాండ్‌కు వెళ్లేందుకు నిరాకరించారు. ఇరాన్ షా మరియు రాణి ఫారాహ్‌ను 1960వ దశకం ప్రారంభంలో వాల్ట్ డిస్నీ తమ డిస్నీల్యాండ్‌కు ఆహ్వానించారు. షా మరియు డిస్నీ మాటెర్‌హార్న్ రోలర్ కాస్టర్‌పై సవారీ చేస్తున్న వీడియో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

1990ల్లో మార్పు: రిసార్ట్‌గా మారిన పార్కు

1990వ దశకం చివరికాలంలో, ఒకే పార్కు-ఒకే హోటల్ అనే ప్రతిపాదనతో దీనిని విస్తరించే పని ప్రారంభమైంది. డిస్నీల్యాండ్ పార్కు, డిస్నీల్యాండ్ హోటల్ మరియు కొనుగోలు చేసిన పరిసర భూములతోపాటు, అసలు పార్కింగ్ ప్రదేశం వినోద రిసార్ట్ అభివృద్ధి కార్యక్రమంలో భాగమయ్యాయి. ఈ రిసార్ట్‌లోని కొత్త భాగాల్లో మరో థీమ్ పార్కు డిస్నీస్ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్; ఒక షాపింగ్, డైనింగ్ మరియు వినోద సముదాయం డౌన్‌టౌన్ డిస్నీ; ఒక ఆధునికీకరించిన డిస్నీల్యాండ్ హోటల్; డిస్నీస్ గ్రాండ్ కాలిఫోర్నియా హోటల్; మరియు పాన్ పసిఫిక్ హోటల్ కొనుగోలు (తరువాత దీనిని ఆధునికీకరించి డిస్నీస్ పారడైజ్ పీర్ హోటర్ అనే పేరు పెట్టారు) భాగంగా ఉన్నాయి. అప్పటికే ఉన్న పార్కింగ్ ప్రదేశం (డిస్నీల్యాండ్ దక్షిణంవైపు)లో ఈ కట్టడాలను నిర్మించగా, ఆరు-అంతస్తుల 10,250 "మికీ అండ్ ఫ్రెండ్స్" పార్కింగ్ ప్రదేశాన్ని వాయువ్య మూలన నిర్మించారు, 2000లో దీని నిర్మాణం పూర్తయ్యే సమయానికి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతిపెద్ద పార్కింగ్ నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది.

పార్కు నిర్వహణా బృందం 1990వ దశకం మధ్యకాలంలో డిస్నీల్యాండ్ అభిమానులు మరియు ఉద్యోగుల్లో వివాదాస్పదంగా ఉంది. లాభాలను పెంచే చర్యల్లో భాగంగా, తరువాత నిర్వాహక అధికారులుగా మారిన సైంథియా హారిస్ మరియు పాల్ ప్రెస్లెర్ వివిధ మార్పులు ప్రారంభించారు. వారి చర్యలు వాటాదారులకు స్వల్పకాలికంగా లాభాలు తెచ్చిపెట్టినా, అవి ఉద్యోగులు మరియు అతిథులు నుంచి ముందుచూపు లేని చర్యలని విమర్శలు వచ్చాయి. హారిస్ మరియు ప్రెస్లెర్ రీటైల్ వ్యాపార నేపథ్యం ఫలితంగా డిస్నీల్యాండ్ యొక్క దృష్టి క్రమక్రమంగా ఆకర్షణల నుంచి వ్యాపారంవైపుకు మళ్లింది. ప్రధాన కార్యకలాపాలకు వెలుపలి సలహాదారులు మెక్‌‍కిన్సే అండ్ కో సాయం కూడా తీసుకున్నారు, దీని ఫలితంగా అనేక మార్పులు మరియు ధర తగ్గింపులు మొదలయ్యాయి. సుమారుగా దశాబ్దకాలంపాటు వైవిధ్యమైన నిర్వహణ తరువాత, వాల్ట్ డిస్నీ అసలు థీమ్ పార్కులో నిర్లక్ష్యపు జాడలు స్పష్టంగా కనిపించాయి. పార్కు అభిమానులు వినియోగదారుకు విలువ తగ్గడం మరియు పార్కు నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు, నిర్వహణా బృందం యొక్క తొలగింపుకు పిలుపునిచ్చారు.

21వ శతాబ్దంలో డిస్నీల్యాండ్

గతంలో డిస్నీ క్రూయిజ్ లైన్ అధ్యక్షుడిగా ఉన్న మాట్ ఓయిమెట్ 2003 చివరికాలంలో డిస్నీల్యాండి రిసార్ట్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. తరువాత కొద్దికాలానికి, ఆయన గ్రెగ్ ఎమ్మెర్ను కార్యకలాపాల విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేశారు. ఫ్లోరిడాకు వెళ్లకముందు, ఎమ్మెర్ తన యుక్త వయస్సు నుంచి డిస్నీల్యాండ్‌లో డిస్నీ ప్రదర్శనల సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు, ఆయన వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లో అనేక కార్యనిర్వాహక నాయకత్వ హోదాల్లో పనిచేశారు. ఓయిమెట్ త్వరగా కొన్ని ధోరణులను మార్చడంపై దృష్టిపెట్టారు, ముఖ్యంగా కాస్మోటిక్ నిర్వహణలో మార్పులు చేపట్టారు, అసలు మౌలిక సదుపాయాల నిర్వహణ క్రమాన్ని తీసుకొచ్చారు, గతంలోని భద్రతా చరిత్ర పునరుద్ధరణపై నమ్మకం కల్పించారు. వాల్ట్ డిస్నీ మాదిరిగానే, ఓయిమెట్ మరియు ఎమ్మెర్ వ్యాపార సమయాల్లో తమ సిబ్బందితో పార్కులో నడవడం తరచుగా కనిపిస్తుండేది. వారు కూడా ప్రదర్శన సభ్యుల పేర్ల బాడ్జ్‌లను ధరించేవారు, ఆకర్షణలను చూసేందుకు క్యూల్లో నిలబడి వేచివుండటంతోపాటు, అతిథుల నుంచి స్పందనలను ఆహ్వానించేవారు.

2006 వరకు PDలో 5,000 గ్యాలన్లలకుపైగా పేయింట్, మొత్తంమీద 100,000 ద్వీపాలు, మిలియన్ల సంఖ్యలో మొక్కలు పార్కు కోసం ఉపయోగించారు, 400 మిలియన్‌ల పౌరులు ఈ పార్కును సందర్శించారు, ఈ దశలో జూలై 2006న స్టార్‌వుడ్ హోటల్స్ & రిసార్ట్స్ వరల్డ్‌వైడ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు తాను ది వాల్ట్ డిస్నీ కంపెనీని విడిచిపెడుతున్నట్లు మాట్ ఓయిమెట్ ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత కొద్దికాలానికే, వాల్ట్ డిస్నీ ఎట్రాక్షన్స్ జపాన్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎడ్ గ్రెయెర్ డిస్నీల్యాండి రిసార్ట్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గ్రెగ్ ఎమ్మెర్ ఫిబ్రవరి 8, 2008న తన బాధ్యతల నుంచి పదవీ విరమణ చేశారు. అక్టోబరు 2009న, ఎడ్ గ్రెయర్ కూడా తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు, ఆయన స్థానంలో జార్జ్ కాలోగ్రిడిస్ డిస్నీల్యాండ్ రిసార్ట్ కొత్త అధ్యక్షుడిగా నియమించబడ్డారు.

50వ వార్షికోత్సవం

ప్రధాన వ్యాసం: :Happiest Homecoming on Earth

జులై 18, 1955న ప్రారంభమైన డిస్నీల్యాండ్ థీమ్ పార్కు యొక్క 50వ వార్షికోత్సవాన్ని "హాపియెస్ట్ హోమ్‌కమింగ్ ఆన్ ఎర్త్" అనే పేరుతో పద్దెనిమిది నెలల వేడుకగా (2005 నుంచి 2006 వరకు జరిగింది) నిర్వహించారు. డిస్నీ థీమ్ పార్కు ప్రారంభించి యాభై ఏళ్లు గడిచిన సందర్భంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని డిస్నీ పార్కుల్లో డిస్నీల్యాండ్ చేరుకున్న మైలురాయిని గుర్తిస్తూ హాపియెస్ట్ సెలెబ్రేషన్ ఆన్ ఎర్త్ వేడుక జరిగింది. 2004లో, పార్కులో అనేక ప్రధాన ఆధునికీకరణ ప్రాజెక్టులు చేపట్టారు, ఇవన్నీ పార్కు యొక్క యాభైయ్యొవ వార్షికోత్సర వేడుకను పురస్కరించుకొని జరిగాయి.

అనేక సంప్రదాయ ఆకర్షణలు పునరుద్ధరించబడ్డాయి, ముఖ్యంగా స్పేస్ మౌంటైన్, జంగిల్ క్రూయిజ్, హంటెట్ మాన్షన్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మరియు వాల్ట్ డిస్నీస్ ఎన్‌ఛాంటెడ్ టికీ రూమ్ తదితరాలతోపాటు, 1955లో ప్రారంభమైన రోజున ఉన్న ఆకర్షణలను పునరుద్ధరించారు, పార్కు మొత్తం బంగారువర్ణపు మికీ చెవులు ఏర్పాటు చేశారు. 50వ వార్షికోత్సవ వేడుక మే 5, 2005న ప్రారంభమైంది (ఈ రోజు 5-5-05), సెప్టెంబరు 30, 2006న ముగిసింది, డిస్నీ పార్కుల "ఇయర్ ఆఫ్ ఎ మిలియన్ డ్రీమ్స్" వేడుక వాస్తవానికి డిసెంబరు 31, 2008న 27 నెలలకు ముగిసింది.

55వ వార్షికోత్సవం

జనవరి 1, 2010న డిస్నీ పార్కులు గివ్ ఎ డే, గెట్ ఎ డిస్నీ డే స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించింది, అన్ని వయస్సుల పౌరులను స్వచ్ఛందంగా డిస్నీ సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రోత్సహించడానికి, కాలిఫోర్నియాలోని డిస్నీ రిసార్ట్‌లో లేదా ఫ్లోరిడాలోని వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లో ఉచితంగా ఒక రోజు సందర్శించేందుకు వీలు కల్పించారు. మార్చి 9, 2010న డిస్నీ పది లక్షల మంది స్వచ్ఛంద సేవకులు చేరడంతో తాము తమ లక్ష్యాన్ని సాధించినట్లు ప్రకటించింది, అప్పటివరకు నమోదు చేసుకొని మరియు ఒక నిర్దిష్ట సేవా పరిస్థితికి సంతకం చేయని వారికి ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిలిపివేసింది.

పార్కు ప్రణాళిక

పార్కు పలు ప్రదేశాలుగా విభజించబడివుంది, ఇది సెంట్రల్ ప్లాజా నుంచి దిక్సూచి యొక్క నాలుగు ప్రాథమిక బిందువులు మాదిరిగా, బాగా రహస్యమైన బ్యాక్‌స్టేజ్ ప్రదేశాలుగా విస్తరించివుంటుంది. ఒక ప్రదేశంలోకి అడుగుపెట్టిన అతిథి పూర్తిగా ఆ పర్యావరణంలోకి మునిగిపోతాడు, మరే ఇతర ప్రదేశాన్ని చూడటం లేదా వినడం ఉండదు. ఒక భూభాగం నుంచి మరోదానికి నిరంతర ప్రవాహంతో నాటకరంగ "వేదికలు" అభివృద్ధి చేయాలనే ఆలోచన నుంచి దీనిని అభివృద్ధి చేశారు. ప్రజాసందర్శన ప్రదేశాలు సుమారుగా 85 acres (34 ha) విస్తీర్ణం కలిగివున్నాయి. మొదట పార్కు ప్రారంభించినప్పుడు, దీనిలో ఐదు థీమ్ పార్కులు ఉన్నాయి:

  • మెయిన్ స్ట్రీట్, U.S.A., ఇది వాల్ట్ డిస్నీ బాల్యం ఆధారంగా రూపొందించిన 20వ శతాబ్దపు ప్రారంభ మధ్యప్రాచ్య పట్టణం
  • అడ్వెంచర్‌ల్యాండ్, ఇది అడవి-ఇతివృత్త సాహసాలను ప్రదర్శిస్తుంది
  • ఫ్రాంటియర్‌ల్యాండ్, పశ్చిమ ఫ్రాంటియర్‌ను ప్రతిబింబిస్తుంది
  • ఫ్యాంటసీల్యాండ్, ఊహాలోకాన్ని సాక్షాత్కరిస్తుంది
  • టుమారోల్యాండ్, భవిష్యత్ లోకాన్ని ప్రతిబింబిస్తుంది.

ప్రారంభమైన రోజు నుంచి, పార్కులో అదనపు ప్రదేశాలను జోడించడం జరిగింది:

  • 1957లో, హాలిడేల్యాండ్ ఏర్పాటు చేశారు, 9 acres (3.6 ha) విస్తీర్ణంలో ఉన్న దీనిలో ఒక సర్కస్ మరియు బేస్‌బాల్ డైమండ్ ఉన్నాయి, 1961లో దీనిని మూసివేశారు.
  • 1966లో, న్యూ ఓర్లీన్స్ స్క్వేర్‌ ను, 19వ శతాబ్దపు న్యూ ఓర్లీన్స్ ఆధారంగా రూపొందించారు
  • 1972లో, "బీర్ కంట్రీ" ఏర్పాటు చేశారు, దక్షిణ ప్రాంత పర్వతప్రాంత అడవుల నేపథ్యంలో ఇది రూపొందించబడింది. దీని పేరును తరువాత క్రిటెర్ కంట్రీగా మార్చారు, స్ప్లాష్ పర్వతం యొక్క సాంగ్ ఆఫ్ ది సౌత్ అంశాల చుట్టూ ఇది నిర్మించబడింది.
  • 1993లో, మిక్కీస్ టూన్‌టౌన్ ఏర్పాటు చేశారు, హు ఫ్రేమ్డ్ రోజెర్ రాబిట్ చలనచిత్రంలో కనిపించే టూన్‌టౌన్ ఆధారంగా ఇది రూపొందించబడింది

పార్కువ్యాప్తంగా 'హిడెన్ మిక్కీస్' లేదా మిక్కీ మౌస్ ప్రతిబింబాలు వింత ప్రదేశాల్లో కనిపిస్తాయి.

ఎత్తైన బెర్మ్ ఆధారిత ఒక నారో గేజ్ రైల్‌రోడ్ పార్కు చుట్టూ ఉంది. డిస్నీ యొక్క కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్కును డిస్నీల్యాండ్ పార్కింగ్ ప్రదేశంగా ఉపయోగించినచోట ఏర్పాటు చేశారు.

డిస్నీల్యాండ్‌లో ప్రాంతాలు

ప్రధాన వ్యాసంs: :List of current Disneyland attractions and :List of past Disneyland attractions

ఒకదానితో ఒకటి వైవిధ్యంగా కనిపించే షాప్‌లు, రెస్టారెంట్‌లు, ప్రత్యక్ష వినోద కార్యక్రమాలు మరియు ఆకర్షణలకు ఆతిథ్యం ఇచ్చే 8 ఇతివృత్త ప్రదేశాలు దీనిలో ఉన్నాయి.

మెయిన్ స్ట్రీట్, U.S.A.

ప్రధాన వ్యాసం: :Main Street, U.S.A.

మెయిన్ స్ట్రీట్, U.S.A.ను 20వ శతాబ్దం ప్రారంభ కాలానికి చెందిన ఒక ప్రత్యేక మధ్యప్రాచ్య పట్టణం ఆధారంగా తీర్చిదిద్దారు. బాల్యంలో తాను నివసించిన మిస్సౌరీలోని మార్సెలైన్ పట్టణ స్ఫూర్తితో వాల్ట్ డిస్నీ దీనికి రూపకల్పన చేశారు, ప్రధాన వీధి (మెయిన్ స్ట్రీట్)ని పూర్తిగా ప్రతిబింబించేందుకు రూపకర్తలు మరియు వాస్తుశిల్పులతో ఆయన కలిసి పనిచేశారు. పార్కులోకి అడుగుపెట్టినప్పుడు అతిథులు చూసే మొట్టమొదటి ప్రదేశం ఇది (మోనోరైల్ ద్వారా అడుగుపెట్టనట్లయితే) మరియు దీని నుంచే అతిథులు సెంట్రల్ ప్లాజాకు చేరుకుంటారు. ది మ్యాజిక్ కింగ్‌‍డమ్ మధ్య భాగంలో మరియు సెంట్రల్ ప్లాజా యొక్క ఉత్తర భాగంలో స్లీపింగ్ బ్యూటీ కాజిల్ ఉంది, ఇక్కడ నుంచి ఒక కందకం గుండా ఉన్న వంతెనపై ఫ్యాంటసీల్యాండ్‌లోకి ప్ర్రవేశించవచ్చు. అడ్వెంచర్‌ల్యాండ్, ఫ్రాంటియర్‌ల్యాండ్ మరియు టుమారోల్యాండ్ కాజిల్ రెండు వైపులా అమర్చబడ్డాయి.

మెయిన్ స్ట్రీట్, U.S.A. అమెరికా విక్టోరియా శకాన్ని ప్రతిబింబిస్తుంది, రైల్వే స్టేషను, పట్టణ కూడలి, సినిమా థియేటర్, నగర హాల్, ఆవరి యంత్రం ఆధారంగా నడిచే ఇంజిన్ ఉన్న ఫైర్‌హౌస్, ఎంపోరియం, షాపులు, తోరణాలు, డబుల్-డెక్కర్ బస్, గుర్రాలు-లాగే వీధి కారు, జిట్నైస్ మరియు ఇతరాలను జ్ఞప్తికి తెచ్చే అంశాలు దీనిలో చూడవచ్చు. మెయిన్ స్ట్రీట్‌లో డిస్నీ ఆర్ట్ గ్యాలరీ, ఒపెరా హౌస్ ఉన్నాయి, ఒపెరా హౌస్‌లో లింకన్ జీవితపు గొప్ప సందర్భాలు ప్రదర్శించే ఒక ప్రదర్శన ఉంది, ఇది అధ్యక్షుడి జీవితంపై ఒక ఆటోనోమాట్రోనిక్ వెర్షన్‌ను ప్రదర్శిస్తుంది. మెయిన్ స్ట్రీట్‌లో ఉన్న పలు ఇతర ప్రత్యేక స్టోర్లు: క్యాండీ స్టోర్, జ్యువెలరీ మరియు వాచ్ షాప్, సిల్‌హౌయెట్ స్టేషను, వివిధ కళాకారులు సృష్టించిన డిస్నీ సేకరణ వస్తువుల ప్రతిరూపాలను విక్రయించే ఒక దుకాణం, ప్రత్యేకంగా టోపీలు తయారు చేసుకునేందుకు వీలున్న ఒక హ్యాట్ షాపు దీనిలో ఉన్నాయి. మెయిన్ స్ట్రీట్, U.S.A. చివరిలో స్లీపింగ్ బ్యూటీ కాజిల్ మరియు సెంట్రల్ ప్లాజా (దీనిని హబ్‌గా కూడా పిలుస్తారు) ఉన్నాయి, ఇవి దాదాపుగా అన్ని థీమ్ పార్కులకు ప్రధాన ద్వారాలుగా ఉన్నాయి. పార్కు ప్రారంభించినప్పుడు సెంట్రల్ ప్లాజా కీలకంగా ఉండగా, సెంట్రల్ ప్లాజాకు ప్రస్తుతం న్యూ ఓర్లీన్స్ స్క్వేర్, క్రిటెర్ కంట్రీ మరియు టూన్‌టౌన్ అనే పేర్లు గల ప్రధాన ప్రదేశాలు నేరుగా కలపబడి లేవు.

మెయిన్ స్ట్రీట్ U.S.A. నమూనా ఎత్తుగా కనిపించేందుకు ఫోర్స్‌డ్ పెర్‌స్పెక్టివ్ (ఒక ప్రదేశాన్ని దూరంగా లేదా దగ్గరగా కనిపించేలా చేసేందుకు వాడే సాంకేతిక పద్ధతి) అని పిలిచే సాంకేతిక పద్ధతిని ఉపయోగించారు, దీనిని తరచుగా చలనచిత్రాల్లో ఉపయోగిస్తుంటారు. మెయిన్ స్ట్రీట్‌లో ఉన్న భవనాలను మొదటి స్థాయిలో 3/4 కొలతతో నిర్మించారు, రెండో దశలో 5/8తో మరియు మూడోదానిలో 1/2 కొలతో నిర్మించారు, ప్రతి స్థాయికి 1/8 కొలతను తగ్గించారు. మెయిన్ స్ట్రీట్ U.S.A.లో మిగిలిన అన్ని ప్రదేశాల కంటే ఎక్కువ దీపాలు ఉన్నాయి. మొత్తం 100,000 దీపాల్లో 11,000 దీపాలు ఇక్కడే ఉన్నాయి.

అడ్వెంచర్‌ల్యాండ్

ప్రధాన వ్యాసం: :Adventureland

ప్రపంచానికి సుదూరమైన ఒక అపరితమైన ఉష్ణమండల ప్రదేశంగా అడ్వెంచర్‌ల్యాండ్‌ ను తీర్చిదిద్దారు. "ఈ కలను సాకారపరిచే ఒక భూభాగాన్ని సృష్టించేందుకు, తాము నాగరికతకు చాలా దూరంగా ఉన్న ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల్లోని మారుమూల అటవీ ప్రాంతాల ఛాయాచిత్రాలను స్వయంగా సేకరించామని వాల్ట్ డిస్నీ చెప్పారు." ప్రారంభ రోజునాటి జంగిల్ క్రూయిజ్‌లో ఉన్న ఆకర్షణల్లో, ఇండియానా జోన్స్ అడ్వెంచర్‌లోని "టెంపుల్ ఆఫ్ ది పార్‌బిడన్ ఐ" మరియు వాల్ట్ డిస్నీ రూపొందించిన చలనచిత్రం స్విస్ ఫ్యామిలీ రాబిన్‌సన్ నుంచి స్విస్ ఫ్యామిలీ రాబిన్సన్ ట్రీ హౌస్‌ను ప్రతిబింబించే టార్జాన్స్ ట్రీహౌస్ భాగంగా ఉన్నాయి. వాల్ట్ డిస్నీస్ ఎన్‌ఛాంటెడ్ టికీ రూమ్ అడ్వెంచర్‌ల్యాండ్ ప్రవేశద్వారం వద్ద ఉంది, కంప్యూటర్ ఆధారిత ఒక ధ్వని మరియు రోబోటిక్స్‌ను ప్రదర్శించే ఈ గది మొట్టమొదటి ఆడియో-యానిమేట్రోనిక్స్‌ను ఉపయోగించింది.

న్యూ ఓర్లీన్స్ స్క్వేర్

ప్రధాన వ్యాసం: :New Orleans Square

న్యూ ఓర్లీన్స్ స్క్వేర్ అనేది 19వ శతాబ్దపు న్యూ ఓర్లీన్స్ నేపథ్యంలో రూపొందించిన ప్రదేశం. దీనిని జూలై 24, 1966న ప్రజల సందర్శనార్థం తెరిచారు. ఇది బాగా పాతదైనప్పటికీ, ఇప్పుటికీ డిస్నీల్యాండ్ అతిథుల్లో ఎంతో ప్రాచుర్యం కలిగివుంది, పార్కులోని అత్యంత ప్రధాన ఆకర్షణలు దీనిలో ఉన్నాయి: అవి పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మరియు హంటెడ్ మాన్షన్‌ లు, అంతేకాకుండా ఇక్కడ రాత్రిపూట వినోదాన్ని అందించే ఫాంటాస్మిక్! ఉంది. దీనిలో మార్క్ ట్వెయిన్ యొక్క నది పడవ, సెయిలింగ్ షిప్ కొలంబియా, పైరేట్స్ లెయిర్ ఆన్ టామ్ స్వాయెర్స్ ఐల్యాండ్ ఉన్నాయి. పైన పేర్కొన్న ఆకర్షణలు అప్పుడప్పుడు ఫ్రాంటియర్‌ల్యాండ్ ఆకర్షణల్లో భాగంగా తప్పుగా చెప్పబడుతున్నాయి.

ఫ్రాంటియర్‌ల్యాండ్

ప్రధాన వ్యాసం: :Frontierland

అమెరికన్ ఫ్రాంటియర్ వ్యాప్తంగా మార్గదర్శక రోజుల ప్రతిరూపాలతో ఫ్రాంటియర్‌ల్యాండ్ వినోదాన్ని అందిస్తుంది. వాల్ట్ డిస్నీ వెల్లడించిన వివరాల ప్రకారం, మన దేశ చరిత్రను చూసి గర్వపడేందుకు మనందరికీ కారణం ఉంటుంది, మన పూర్వీకుల మార్గదర్శక స్ఫూర్తితో ఇది రూపొందించబడినట్లు ఆయన పేర్కొన్నారు. మన దేశం యొక్క మార్గదర్శక రోజుల్లో జీవించిన అనుభూతిని, కనీసం కొద్ది సమయమైనా నివసించిన భావనను కల్పించేందుకు ఇది రూపొందించబడిందని చెప్పారు. అమెరికా నదీ పరీవాహ ప్రాంతాల్లో నివసించిన స్థానిక అమెరికన్‌లను ప్రతిబింబించే, రోబోట్‌ల సాయంతో యానిమేట్ చేసిన పైన్‌వుడ్ ఇండియన్స్ బృందాన్ని ఫ్రాంటియర్‌ల్యాండ్‌లో చూడవచ్చు. ఇక్కడ ఉన్న వినోద మరియు ఆకర్షణ ప్రదేశాలు బిగ్ థండర్ మౌంటైన్ రైల్‌రోడ్, ఫ్రాంటియర్‌ల్యాండ్ షూటింగ్ ఎక్స్‌పొజిషన్, ఇదిలా ఉంటే ఫ్రాంటియర్‌ల్యాండ్‌లో గోల్డెన్ హార్స్‌‌షూ సెలూన్ ఉంది, ఇది పురాతన పశ్చిమ ప్రాంతం యొక్క ఒక ప్రదర్శన భవనం. ప్రస్తుతం దీనిలో "బిల్లీ హిల్ అండ్ ది హిల్‌బిల్లీస్" హాస్య బృందం అతిథులకు వినోదాన్ని పంచుతుంది.

క్రిటెర్ కంట్రీ

ప్రధాన వ్యాసం: :Critter Country

క్రిటెర్ కంట్రీ 1972లో "బీర్ కంట్రీ"గా ప్రారంభమైంది, 1988లో దీని పేరును మార్చారు. గతంలో ఈ ప్రదేశంలో ఒక ఇండియన్ గ్రామం ఉండేది, ఇక్కడ భారతసంతతికి చెందిన అసలు గిరిజన పౌరులు వారి నృత్యాలు మరియు వస్త్రధారణలతో ప్రదర్శనలు ఇచ్చేవారు. ప్రస్తుతం, ఈ ప్రదేశం యొక్క ప్రధాన ఆకర్షణ స్ప్లాష్ మౌంటైన్, ఇది అంకుల్ రెమస్ యొక్క జోయెల్ ఛాండ్లెర్ హారిస్ కథల స్ఫూర్తితో రూపొందించిన ఒక దీర్ఘ-కృత్రిమ ప్రవాహ ప్రయాణం, అంతేకాకుండా ఇక్కడ డిస్నీకి అకాడమీ అవార్డులు తెచ్చిపెట్టిన 1946 చలనచిత్రం సాంగ్ ఆఫ్ ది సౌత్‌ కు చెందిన యానిమేట్ భాగాలు ఉన్నాయి. 2003లో, ది మెనీ అడ్వెంచర్స్ ఆఫ్ విన్నీ ది పూహ్ అని పిలిచే ఒక డార్క్ రైడ్ (చీకట్లో ప్రయాణం) ప్రారంభమైంది, 2001లో మూతపడిన కంట్రీ బీర్ జాంబోరీ స్థానంలో దీనిని ప్రారంభించారు. ఆడియో-యానిమేట్రోనిక్స్‌గా గుర్తించే డిస్నీ యొక్క విద్యుత్ నియంత్రిత మరియు యాంత్రికంగా యానిమేట్ చేసిన బొమ్మల రూపంలో ఉండే పాడే ఎలుగుబంటి పాత్రలు కంట్రీ బీర్ జాంబోరీ ప్రదర్శించేది.

ఫ్యాంటసీల్యాండ్

ప్రధాన వ్యాసం: :Fantasyland

చంద్రకాంతితో వెలుగుతున్న లండన్‌ నగరంపై పీటర్ ప్యాన్‌తో ఎగరడం లేదా ఎలీస్ యొక్క పిచ్చి వండర్‌ల్యాండ్‌లోకి పోవడం గురించి కలలో కూడా ఊహించని యువకులకు వాటి అనుభూతులు కలిగించే ప్రదేశమే ఫ్యాంటసీల్యాండ్ అని వాల్ట్ డిస్నీ చెప్పారు. ఫ్యాంటసీల్యాండ్‌లో, ప్రతిఒక్కరి కౌమారదశ యొక్క ఈ సాంప్రదాయిక కథలు పాల్గొనే అన్ని వయస్సుల వారికి వాస్తవానుభూతిని కల్పిస్తాయి. ఫ్యాంటసీల్యాండ్‌ను మొదట మధ్యయుగ ఐరోపా శైలిలో నిర్మించడం జరిగింది, అయితే, 1983 ఆధునికీకరణ కార్యక్రమాలు దీనిని ఒక బవేరియా గ్రామంగా మార్చాయి. ఇక్కడ ఉన్న ఆకర్షణలు డార్క్ రైడ్‌‍లు, కింగ్ ఆర్థూర్ కారౌసెల్ మరియు వివిధ బాలల సవారీలు.

ఫైర్‌వర్క్స్ (బాణసంచా) ప్రారంభకావడానికి ముందు, ఫ్యాంటసీల్యాండ్‌లోని కొన్ని ఆకర్షణలు రాత్రిపూట సుమారుగా 8:30 గంటల సమయంలో మూసివేస్తారు, బాణసంచా కాల్చడం 9:25 గంటలకు ప్రారంభమవుతుంది. స్లీపింగ్ బ్యూటీ కాజిల్ లోపల 1959 నుంచి 1972 వరకు నడిచివెళ్లే ప్రయాణం ఉండేది, తరువాత కొన్ని సంవత్సరాలపాటు స్లీపింగ్ బ్యూటీ కథలో ఈ చీకటి నడక ప్రయాణాన్ని మూసివేశారు. ఈ నడకను ఇప్పుడు తిరిగి ప్రారంభించారు, ఇది పునరుద్ధరించిన ఎవిండ్ ఎర్లీ (మేరీ బ్లెయిర్ సృష్టించిన అమరిక కాకుండా) అమరికను ప్రదర్శిస్తుంది. డయోరమాలను ఆధునిక యుగాల

Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
Sean Harrigan
23 January 2015
Best things to do in Disneyland is grab a churro, turkey Leg, or Dole Whips a must. Grab a Fast Pass for popular attractions. Main Street stays open an hour later after park closing to enjoy shopping.
Stephanie Low
1 September 2014
Make sure you get your fast passes to maximize your rides! My fav include space mountain, splash mountain and the sunset view with Thunder railroad. Oh, and daily fireworks.
StarGirl11
2 September 2014
If you want to avoid the really long lines and don't mind an early morning rope drop is the best time to be there. You still will have to deal with the hotel crowd but it's lot less.
Ellen DeGeneres
5 July 2011
Welcome to the Happiest Place on Earth. While you’re in Disneyland, make sure you go to the castle. That’s where I ran into Mickey! Mickey Disanti, from my old neighborhood. He looked great.
Matt Ta-Min
16 September 2018
Not the biggest Disneyland, but still gets packed out throughout the year. It is still pretty easy to walk around all of it, but you can take the train and get fastpasses to maximize your time.
Matt Ta-Min
16 September 2018
Disneyland is better for kids, California Adventure has more adult rides. In Disney I would say the minimum age for kids would be around 2 yrs old, but even then my daughter was scared by much of it.
Anaheim Three Bedroom Home

ప్రారంభించడం $11359

Orange County Luxury Unit 2

ప్రారంభించడం $11359

Anaheim Majestic Garden Hotel

ప్రారంభించడం $101

Quality Inn and Suites Anaheim Maingate

ప్రారంభించడం $102

Ramada by Wyndham Anaheim Maingate North

ప్రారంభించడం $139

Days Inn & Suites by Wyndham Anaheim At Disneyland Park

ప్రారంభించడం $103

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Disney's California Adventure Park

Disney's California Adventure Park is a theme park in Anaheim,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Crystal Cathedral

The Crystal Cathedral is a Protestant Christian megachurch in the city

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Knott's Berry Farm

Knott's Berry Farm is the brand name of two separate entities: a theme

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Earl Burns Miller Japanese Garden

The Earl Burns Miller Japanese Garden is a Japanese garden

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Balboa Fun Zone

The Balboa Fun Zone is a family destination located on the Balboa

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
The Wedge (surfing)

The Wedge is a spot located at the extreme east end of the Balboa

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Long Beach Grand Prix

|Previous names = Inaugural Long Beach Grand Prix (1975)United States

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
RMS Queen Mary

RMS Queen Mary is a retired ocean liner that sailed the North Atlantic

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Disney's California Adventure Park

Disney's California Adventure Park is a theme park in Anaheim,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Tokyo DisneySea

Tokyo DisneySea (東京ディズニーシー, Tōkyō Dizunīshī) is a 176 acre (712,246 m

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Tokyo Disneyland

Tokyo Disneyland (東京ディズニーランド, Tōkyō Dizunīrando) is a 115

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Walt Disney Studios Park

Walt Disney Studios Park is the second theme park of Disneyland Paris,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Tokyo Disney Resort

Tokyo Disney Resort (東京ディズニーリゾート, Tōkyō Dizunī Rizōto) is a the

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి