బఫెలో, న్యూయార్క్

న్యూయార్క్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరములలో న్యూయార్క్ నగరం తర్వాత బఫెలో () రెండవ నగరం. లేక్ ఎరీ యొక్క తూర్పు తీరంపైన పశ్చిమ న్యూయార్క్ లో మరియు ఫోర్ట్ ఏరీ, ఓన్టారియో మీదుగా నయాగర నది జన్మస్థానం వద్ద ఉన్న బఫెలో, బఫెలో-నయాగర ఫాల్స్ మెట్రోపాలిటన్ ప్రాంతం యొక్క ప్రధాన నగరం మరియు ఏరీ కౌంటీ యొక్క అధికార స్థానం. ఈ నగరంలో 292,648 (2000 జనగణన) మంది జనాభా ఉన్నారు, మరియు బఫెలో–నయాగర–కాటారాగాస్ కంబైన్డ్ స్టాటిస్టికల్ ఏరియాలో 1,254,066 మంది ఉన్నారు.

1789 సమయంలో తన పేరుతో సంబంధం ఉన్న బఫెలో క్రీక్ సమీపంలో ఒక చిన్న వ్యాపార కూటమిగా ఉద్భవించిన బఫెలో, 1825లో ఏరీ కాలువ తెరిచిన తరువాత నగరమును దాని పశ్చిమ స్థావరంగా చేసుకుని వేగంగా వృద్ది చెందింది. 1900 నాటికి, బఫెలో దేశంలో 8వ పెద్ద నగరం, మరియు ప్రముఖ రైలుమార్గ కేంద్రం అయింది, దేశంలో అతిపెద్ద గ్రెయిన్-మిల్లింగ్ (ధాన్యములను మరపట్టే) కేంద్రం, మరియు ప్రపంచములో అతి పెద్ద ఉక్కు-తయారీ ప్రక్రియలకు కేంద్రం. 20వ శతాబ్దం చివరి భాగంలో పరిస్థితులు తారుమారయ్యాయి: సెయింట్ లారెన్స్ సముద్రమార్గం ప్రారంభం వలన గ్రేట్ లేక్స్ పడవల మార్గం మళ్ళించబడింది, మరియు ఉక్కు పరిశ్రమల వంటి భారీ పరిశ్రమలు చైనా వంటి ప్రదేశములకు స్థానభ్రంశం చెందాయి. 1970లలో అమ్ట్రాక్ ప్రారంభంతో, బఫెలో సెంట్రల్ టెర్మినల్ కూడా విడిచిపెట్టబడింది, మరియు రైళ్ళు సమీపంలోని డెప్యూ, న్యూయార్క్ (బఫెలో-డెప్యూ) మరియు ఎక్స్చేంజ్ స్ట్రీట్ స్టేషను వైపు మళ్ళించబడ్డాయి. 1990నాటికి ఆ నగరం దాని 1900 నాటి జనాభా స్థాయిల దిగువకు పడిపోయింది.

ప్రస్తుతం, ఆరోగ్య రక్షణ మరియు విద్య ఆ ప్రాంతం యొక్క అతిపెద్ద ఆర్ధిక రంగములు. దేశీయ మరియు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలు వెనకబడినా ఇవి వృద్ధి చెందుతూనే ఉన్నాయి. బఫెలో నయాగర మెడికల్ క్యాంపస్ మరియు యూనివర్సిటీ ఎట్ బఫెలోల ప్రముఖ విస్తరణ మూలంగా, కొంతవరకు ఈ వృద్ధి కొనసాగింది. అదనంగా, తక్కువ పన్నులను మరియు బలహీనమైన అమెరికన్ డాలర్ ను ఉపయోగించుకోవటానికి ఇష్టపడే కెనడియన్ వినియోగదారుల నిరంతర ఆగమనం మూలంగా ఆర్ధిక వ్యవస్థ యొక్క రీటైలర్ రంగం ధృడంగా ఉంది. ఇటీవలే జరిపిన ఒక అధ్యయనములో బఫెలో యొక్క నిరుద్యోగ ప్రమాణము న్యూయార్క్ రాష్ట్రము మరియు జాతీయ సరాసరి రెండిటి కన్నా తక్కువగా ఉన్నట్లు చూపబడింది. 2010లో ఫోర్బ్స్ ఒక కుటుంబమును పోషించుకోవటానికి ఉత్తమ నగరముగా బఫెలోకు 10వ స్థానాన్ని ఇచ్చింది.

పేరు వెనుక చరిత్ర

"బఫెలో" అనే పేరు ఫ్రెంచ్ పదబంధం beau fleuve, "సుందరమైన నది," యొక్క వికృతి అని అనేక అధ్యయనముల అభిప్రాయం. నయాగర నదిని చూసిన ఫ్రెంచ్ అన్వేషకులు ఆశ్చర్యముతో ఈ పదబంధమును ఉపయోగించి ఉంటారు. అయినప్పటికీ, ఈ ఆలోచనను ప్రాధమిక మూలములు వ్యతిరేకించాయి. నిజానికి ఫ్రెంచ్ అన్వేషకులు నయాగర నదిని Rivière aux Chevaux, "అశ్వముల నది"గా అభివర్ణించినట్లు ముద్రితమైంది. ముద్రణలో అగుపించిన మొట్టమొదటి నామ ఉద్భవ సిద్ధాంతము (1825) ఎనుబోతు మాంసముగా రవాణా అవుతున్న దొంగిలించబడిన గుర్రపు మాంసము గురించిన కథను ప్రస్తావిస్తుంది. దానితో అక్రమమైన ఆ విహారయాత్రా ప్రదేశము అప్పటినుండి "బఫెలో" గా గుర్తుచేసుకోబడుతోంది. కానీ ఈ కథను తెలియజేసిన రచయిత తన సందేహవాదాన్ని వ్యక్తం చేసాడు. ఈ ప్రాంతములో ఎనుబోతులు లేవు అనేది ; బఫెలో స్థావరం దాని పేరును బఫెలో క్రీక్ నుండి స్వీకరించింది అనేది; మరియు బఫెలో క్రీక్ 1759–1760లో మొదటిసారి భౌగోళిక చిత్ర పటములలో అగుపించింది అనేవి చాల స్పష్టమైన విషయములు. చాలా వాటితో పోల్చితే Beau Fleuve సిద్ధాంతము ఎక్కువ ఆమోదయోగ్యమైనదే కానీ అంత సహేతుకమైనది కాదు. బఫెలో యొక్క అసలు పేరు పుట్టుక ఖచ్చితంగా తెలియలేదు.

చరిత్ర

ప్రధాన వ్యాసం: History of Buffalo, New York

ఆ ప్రాంతమును ఇరోక్వోయిస్ ఆక్రమించటానికి ముందు, ఈ ప్రాంతంలో న్యూట్రల్ నేషన్ ప్రజలు స్థిరపడ్డారు. తరువాత, ఇరోక్వోయిస్ కాన్ఫెడరసీకి చెందిన సెనేకాస్ న్యూట్రల్స్ ను జయించారు. 1804లో, హాలండ్ ల్యాండ్ కంపెనీ యొక్క ప్రధాన ఏజెంట్ అయిన జోసెఫ్ ఎల్లికాట్, దిగువ పట్టణం నుండి సైకిలు చువ్వలలాగా బయటకు వస్తున్న వివిధ రహదారులను పోలిన రేడియల్ స్ట్రీట్ మరియు గ్రిడ్ వ్యవస్థను రూపొందించాడు, మరియు US లో ఉన్న అతికొద్ది రేడియల్ (ఒక కేంద్ర బిందువు నుండి విస్తరించినట్లు ఉన్న) వీధి ప్రణాళికలలో ఇది ఒకటి.[ఆధారం కోరబడింది] 1812 యుద్ధం సమయంలో, డిసెంబర్ 30, 1813న ‍ '​ బ్రిటిష్ బలగాలు బఫెలోను తగలబెట్టాయి. నవంబర్ 4, 1825న ఏరీ కాలువ పూర్తి అయింది. ఇందులో బఫెలో యుక్తిగా ఆ వ్యవస్థ యొక్క పశ్చిమ తీరంలో ఉంచబడింది. ఆ సమయంలో, జనాభా సుమారు 2,400. ఏరీ కాలువ, జనాభాలో మరియు వాణిజ్యంలో ఒక ఉప్పెనను తీసుకు వచ్చింది. దీనితో సుమారు 10,000 మంది జనాభాతో 1832లో బఫెలో ఒక నగరముగా సంస్థానీకరించబడింది.

బఫెలో నగరం చాలా కాలం నుండి ఆఫ్రికన్-అమెరికన్లకు స్థావరంగా ఉంది. వర్ణముల ఆధారంగా 59 మంది కుటుంబ పెద్దల పేర్ల జాబితాను కలిగి ఉన్న 1828 గ్రామ డైరెక్టరీ దీనికి ఒక ఉదాహరణ. 1845లో, మాసిడోనియా బాప్టిస్ట్ చర్చి నిర్మాణం ప్రారంభమైంది (సాధారణముగా మిచిగాన్ స్ట్రీట్ బాప్టిస్ట్ చర్చి అని పిలవబడుతుంది). ఈ ఆఫ్రికన్-అమెరికన్ చర్చి బానిసత్వ నిర్మూలన ఉద్యమానికి ఒక ముఖ్యమైన సమావేశ స్థానం. ఫిబ్రవరి 12, 1974న ఆ చర్చి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్ (చారిత్రిక స్థలముల జాతీయ రిజిస్టర్) లో చేర్చబడింది. బానిసత్వాన్ని వ్యతిరేకించే విలియం వెల్స్ బ్రౌన్ వంటి నాయకులు బఫెలోలో స్థిరపడ్డారు. బఫెలో అండర్ గ్రౌండ్ రైలుమార్గం యొక్క ఆఖరి స్థానం కూడా. ఈ మార్గం నయాగర నది మీదుగా బఫెలో నుండి ఫోర్ట్ ఏరీ, ఓన్టారియో వరకు అనేక మజిలీలను దాటుకుంటూ చివరకు గమ్యస్థానానికి చేరుతుంది.

1840ల సమయంలో బఫెలో ఓడ రేవు అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రయాణీకుల మరియు వాణిజ్య రద్దీ రెండూ పెరిగాయి, 93,000 మంది ప్రయాణీకులు బఫెలో ఓడ రేవు నుండి పశ్చిమంగా ప్రయాణించారు. ధాన్యములు మరియు వాణిజ్య వస్తువుల రవాణా ఆ ఓడ రేవు యొక్క పునః విస్తరణకు దారితీసింది. 1843లో, స్థానిక వర్తకుడు జోసెఫ్ డార్ట్ జూనియర్ మరియు ఇంజనీర్ రాబర్ట్ డంబార్ ప్రపంచములో మొట్టమొదటి ఆవిరి-శక్తితో నడిచే గ్రెయిన్ ఎలివేటర్ ను నిర్మించారు. "డార్ట్ ఎలివేటర్" ఎక్కువ మొత్తంలో ధాన్యమును సరస్సు పడవల నుండి కాలువ పడవలకు మరియు తరువాత అక్కడి నుండి రైలు వాహకములకు రవాణా చేయటంతో పాటు లేక్ ఫ్రీటర్ల (సరస్సులలో సరుకు రవాణా చేసే పడవలు) నుండి వేగంగా సరుకును దించే వీలు కల్పిస్తుంది.

ఫిబ్రవరి 16, 1861న అబ్రహం లింకన్ యునైటెడ్ స్టేట్స్ యొక్క అధ్యక్ష పదవిని స్వీకరించటానికి వెళుతూ మధ్యలో బఫెలోను దర్శించారు. తన పర్యటన సమయంలో ఆయన ఈగిల్ స్ట్రీట్ కోర్ట్ స్ట్రీట్ మధ్యలో ఉన్న మెయిన్ స్ట్రీట్ లోని అమెరికన్ హోటల్ లో బస చేసారు. అంతర్యుద్ధ సమయంలో బఫెలో జనాభా 81,029 నుండి 1865 నాటికి 94,210 కి పెరిగింది. యూనియన్ కొరకు అనేక మంది సైనికులను పంపటంతో పాటు, బఫెలోలోని తయారీదారులు ముఖ్యమైన యుద్ధ సామాగ్రిని సరఫరా చేసారు. ఉదాహరణకు, నయాగర స్టీమ్ ఫోర్జ్ వర్క్స్ ఇనుప కవచపు ఓడ USS మానిటర్ కొరకు ఆయుధములను ఉంచే భాగములను తయారుచేసింది.

గ్రోవర్ క్లేవ్ల్యాండ్ ఏరీ కౌంటీ యొక్క షెరీఫ్ గా (1871–1873), మరియు 1882లో బఫెలోకు మేయర్ గా పనిచేసాడు. తరువాత ఆయన న్యూయార్క్ గవర్నర్ (1883–1885), యునైటెడ్ స్టేట్స్ కు 22వ ప్రెసిడెంట్ (1885–1889) మరియు 24వ ప్రెసిడెంట్ (1893–1897)గా పనిచేసారు.

మే, 1896లో, ఎల్లికాట్ స్క్వేర్ బిల్డింగ్ పూర్తి అయింది. తరువాతి పదహారు సంవత్సరముల వరకు, ఇది ప్రపంచములో అతిపెద్ద కార్యాలయ భవనము అయింది. సర్వేయర్ జోసెఫ్ ఎల్లికాట్ పేరు మీద దీనికి ఆ పేరు పెట్టబడింది.

ఇరవయ్యవ శతాబ్ద ప్రారంభ సమయంలో, నయాగర నది ద్వారా ఉద్భవించిన జల విద్యుత్తు శక్తి నుండి స్థానిక కర్మాగారములు ప్రయోజనం పొందాయి. అత్యధికంగా విస్తరించిన విద్యుత్తు వెలుగు కారణంగా ఈ సమయంలో ఆ నగరానికి సిటీ ఆఫ్ లైట్ అనే మారుపేరు వచ్చింది. 1881లో, బఫెలో యునైటెడ్ స్టేట్స్ లో మొదటి వీధి దీపాలను అమలులోకి తెచ్చింది. శతాబ్దం ప్రారంభంలో బ్రాస్ ఎరా కారు నిర్మాణదారులు పియర్స్ ఆరో మరియు సెవెన్ లిటిల్ బఫెలోస్ కు ఆతిథ్యమిచ్చింది, ఇది ఆటోమొబైల్ విప్లవంలో భాగం కూడా అయింది. సిటీ ఆఫ్ లైట్ (1999) అనేది 1901లో బఫెలో దేశస్థుడు లారెన్ బెల్ఫర్'స్ రచించిన చారిత్రిక నవల, ఇది తిరిగి ఆమె రచనలో ఉన్న కాల్పనిక వ్యక్తులు మరియు స్థలములకు ప్రతిగా వాస్తవికత యొక్క జాబితాను సృష్టించింది.

సెప్టెంబర్ 6, 1901న బఫెలోలో పాన్-అమెరికన్ ఎక్స్ పొజిషన్ వద్ద ప్రెసిడెంట్ విలియం మాక్ కిన్లీ కాల్చివేయబడి తీవ్రంగా గాయపడ్డాడు. ఎనిమిది రోజుల తర్వాత ఆయన ఆ నగరంలోనే కన్నుమూసారు మరియు విల్కాక్స్ మాన్షన్ వద్ద థియోడార్ రూజ్వెల్ట్ యునైటెడ్ స్టేట్స్ కి ఇరవయ్యారవ ప్రెసిడెంట్ గా పదవీస్వీకారం చేసాడు.

బఫెలోను ఫోర్ట్ ఏరీ, ఓన్టారియోతో అనుసంధానించే పీస్ బ్రిడ్జ్ అనే ఒక అంతర్జాతీయ వంతెన, 1927లో ప్రారంభించబడింది. న్యూయార్క్ సెంట్రల్ రైలురోడ్ కొరకు ఫెల్ హీమర్ & వాగ్నర్ రూపశిల్పులు రూపొందించిన ఒక 17-అంతస్థుల ఆర్ట్ డెకో తరహా స్టేషను అయిన బఫెలో సెంట్రల్ టెర్మినల్, 1929 యొక్క వాల్ స్ట్రీట్ క్రాష్ కు కొన్ని వారముల ముందు పూర్తి అయింది.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, ఒక ఉత్పత్తి తయారీ కేంద్రంగా దాని స్థానం మూలంగా బఫెలోలో అభివృద్ధి మరియు తక్కువ నిరుద్యోగ పర్వం నడిచాయి. రైలుకార్స్ ను తయారుచేసే అమెరికన్ కార్ అండ్ ఫౌండరీ కంపెనీ, యుద్ధ కాలంలో యుద్ధ సామాగ్రిని తయారుచేయటానికి 1940లో దాని కర్మాగారాన్ని బఫెలోలో ప్రారంభించింది.

నగరాన్ని విలువైన వ్యాపార మార్గముల నుండి విభజించే, 1957లో సెయింట్ లారెన్స్ సముద్రమార్గ ప్రారంభంతో; పరిశ్రమల తొలగింపు; మరియు యావత్ జాతి యొక్క శివారుప్రాంతముల అభివృద్ధి; మొదలైన వాటి మూలంగా ఆ నగరం యొక్క ఆర్ధిక వ్యవస్థ దిగజారటం ప్రారంభమైంది. రస్ట్ బెల్ట్ (పారిశ్రామిక ప్రాంతం) లోని చాలా భాగం వలెనే, 1950లలో అర మిలియన్ పైగా జనాభాను కలిగిన బఫెలో, పరిశ్రమలు మూతపడటం మరియు జనాభా శివారు ప్రాంతములకు మరియు ఇతర నగరములకు వెళ్లిపోవటంతో దాని జానాభాలో దాదాపు 50 శాతం తరుగుదలను చూసింది.

ఫ్లింట్, మిచిగాన్ వంటి ఇతర రస్ట్ బెల్ట్ నగరముల వలెనే, బఫెలో కూడా ఇబ్బందులతో చుట్టుముట్టబడిన ఆర్ధిక వ్యవస్థకు మరియు కూలిపోతున్న అవస్థాపన సౌకర్యములకు తిరిగి జీవం పోయటానికి ప్రయత్నించింది. 2000లలో, ఆర్ధిక అభివృద్ధి ఖర్చుని అధికంగా పెంచటం క్షీణిస్తూ ఉన్న దాని అభివృద్ధిని తలక్రిందులు చేసేందుకు ప్రయత్నించింది. గత పది సంవత్సరములలో ఖర్చు చేసిన $50 మిలియన్ల సగటుతో పోల్చితే 2007లో $4 బిలియన్లు ఖర్చు చేయబడింది. ముఖ్యంగా దిగువ పట్టణ కేంద్రంలో, కొత్త ప్రతిపాదనలు మరియు పునఃసృష్టిలు అనేకం జరిగాయి. 2008 నాటికి, నగర అధికారులు ఎంత ప్రయత్నించినప్పటికీ, జనాభా తగ్గుతూనే ఉంది. (జనసంఖ్యా విభాగాన్ని చూడుము.)

భూగోళ శాస్త్రం మరియు వాతావరణం

భౌగోళిక స్థితి

బఫెలో కెనడాలోని ఫోర్ట్ ఏరీ, ఓన్టారియోకి ఎదురుగా ఏరీ సరస్సు యొక్క తూర్పు కొనలో, మరియు నయాగర జలపాతం మీదుగా ఉత్తరముఖంగా ఓన్టారియో సరస్సులోకి ప్రవహించే నయాగర నది ప్రారంభమయ్యే ప్రదేశంలో ఉంది.

యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో ప్రకారం, నగరం యొక్క మొత్తం వైశాల్యం52.5 square mile (136 square కిలోmetre). దానిలో 40.6 square mile (105 square కిలోmetre) భూమి మరియు 11.9 square mile (31 square కిలోmetre) నీరు. మొత్తం ప్రాంతంలో 0.51% నీరు ఉంది.

శీతోష్ణస్థితి

బఫెలో మంచుతో కూడిన శీతాకాలములకు ప్రఖ్యాతి చెందింది, కానీ ఇది న్యూయార్క్ రాష్ట్రములో మంచు తక్కువగా ఉండే నగరం. ఈ ప్రాంతం ఎక్కువ తేమతో కూడిన, ఖండపు వాతావరణమును కలిగి ఉంది, కానీ గ్రేట్ లేక్స్ నుండి తీవ్రమైన మార్పు కారణంగా నిర్దిష్టమైన సముద్ర సంబంధ వాతావరణాన్ని కలిగి ఉంటుంది (కోపెన్ వాతావరణ వర్గీకరణ "Dfb" — సమమైన వర్షపాత పంపిణీ). బఫెలో మరియు పశ్చిమ న్యూయార్క్ లలో ఒక ఋతువు నుండి మరొక ఋతువుకు మారే సమయం చాల తక్కువగా ఉంటుంది.

పశ్చిమ న్యూయార్క్ లో శీతాకాలములు సాధారణముగా చల్లగా మరియు మంచుతో కూడి ఉంటాయి, కానీ మారుతూ ఉంటాయి మరియు హిమపాతములు మరియు వర్షపాతములు కూడా సంభవిస్తూ ఉంటాయి. పశ్చిమ న్యూయార్క్ లో చలికాలం కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది, ఇది నవంబర్ మధ్య నుండి మార్చి మధ్య వరకు ఉంటుంది. డిసెంబర్ చివరి నుండి మార్చి మొదలు వరకు నేల అంతా మంచుతో కప్పబడి పోతుంది, కానీ అప్పుడప్పుడు మంచు లేకుండా ఖాళీగా ఉన్న నేల కూడా కనిపిస్తూనే ఉంటుంది. వార్షిక హిమపాతంలో సగానికి పైగా లేక్ ఎఫెక్ట్ (సరస్సుల ప్రభావం) ప్రక్రియ ద్వారా వస్తుంది మరియు ఇది చాలా స్థానికమైనది. సాపేక్షముగా వెచ్చగా ఉన్న చెరువు నీటిపై నుండి చల్లని గాలి వెళ్ళినప్పుడు సరస్సుల ప్రభావ మంచు రూపొంది సంతృప్తమవుతుంది, దీనితో గాలివీచే దిశలోనే మబ్బులు మరియు అవపాతనం సంభవిస్తాయి. ప్రబలమైన గాలుల వలన, బఫెలో కు దక్షిణముగా ఉన్న ప్రాంతములలో ఉత్తరముగా ఉన్న ప్రాంతముల కన్నా సరస్సు ప్రభావ మంచు ఎక్కువగా కురుస్తుంది. సరస్సు మంచు ప్రక్రియ నవంబర్ మధ్యలో ప్రారంభమై, డిసెంబర్ లో అధికమవుతుంది, చిట్టచివరకు జనవరి మధ్యలో లేదా చివరలో ఏరీ సరస్సు గడ్డకట్టిన తరువాత ఆగిపోతుంది. బఫెలో చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన మంచు తుఫానైన, బ్లిజార్డ్ ఆఫ్ '77, బఫెలోలో సాధారణముగా సంభవించే సరస్సు ప్రభావ మంచు తుఫాను కాదు (ఆ సమయములో ఏరీ సరస్సు గడ్డకట్టుకుని ఉంటుంది), కానీ ఈదురుగాలులు మరియు నేలపైన మరియు గడ్డకట్టుకుపోయిన ఏరీ సరస్సు పైన ముందే కూడిన మంచు యొక్క కలయిక ద్వారా ఇది సంభవించింది. నగర కార్యకలాపాలకు మంచు విఘాతం కలిగించదు, కానీ గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది, అక్టోబర్ 2006 తుఫాను దీనికి ఒక ఉదాహరణ.

ఈశాన్యంలో ఉన్న అన్ని ప్రముఖ నగరముల కన్నా వేడైన మరియు పొడిగా ఉన్న వేసవిని కలిగి ఉంటుంది, కానీ చేట్లుచేమలు పచ్చగా కళకళలాడుతూ ఉండటానికి సరిపడినంత వర్షపాతమును కూడా కలిగి ఉంది. వేసవిలో విస్తారమైన ఎండ మరియు మధ్యస్థ తేమ మరియు ఉష్ణోగ్రత ఉంటుంది. జూన్, జూలై మరియు ఆగష్టులలో ఇక్కడ సగటున 65% వీలైనంత ఎండ ఉంటుంది. బఫెలోలో శీతాకాలంలో అధికంగా కురిసే మంచు దానికి ఇబ్బంది కలుగజేసినప్పటికీ వేసవి కాలంలో ఏరీ సరస్సు మీదుగా వీస్తూ వెచ్చని రోజులకు చల్లదనాన్ని అందించే చల్లని నైరుతీ పవనముల వంటి ఇతర లేక్ ఎఫెక్ట్ (సరస్సు ప్రభావములు)ల నుండి ప్రయోజనం పొందుతుంది అనేది వాస్తవం. ఫలితంగా, బఫెలోలోని నేషనల్ వెదర్ సర్వీసు స్టేషను ఎప్పుడూ అధికారికంగా 100 °F (37.8 °C) లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేయలేదు. వర్షపాతం మధ్యస్థముగా ఉంటుంది కానీ విలక్షణముగా రాత్రిపూట వర్షం కురుస్తుంది. ఏరీ కాలువ యొక్క ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచే ప్రభావము జడివానలను ఆపుతూ ప్రక్కనే ఉన్న బఫెలో ప్రాంతంలో జూలై అంతటా ఎండ వేడిమిని అధికం చేస్తుంది. ఆగష్టులో ఎక్కువ వర్షములు కురుస్తాయి మరియు వెచ్చని కాలువ దాని ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచే ప్రభావాన్ని కోల్పోవటంతో ఇది మరింత వేడిగా మరియు మరింత తేమగా ఉంటుంది.

Climate data for Buffalo, NY
Month Jan Feb Mar Apr మే Jun Jul Aug Sep Oct Nov Dec Year
Avg. precipitation days 19.8 17.2 15.7 13.6 12.6 11.9 10.5 10.5 11.6 12.8 15.8 19.4
Avg. snowy days 16.7 14.0 9.7 3.7 0.2 0 0 0 0 0.3 6.0 14.7
Mean monthly sunshine hours 89.9 110.2 164.3 204 257.3 288 306.9 266.6 207 158.1 84 68.2 2204.5
Source #1: NOAA
Source #2: Hong Kong Observatory

జనాభా

నగరం

గ్రేట్ లేక్స్ ప్రాంతం యొక్క అనేక పూర్వ పారిశ్రామిక నగరముల వలెనే, బఫెలో దాని పారిశ్రామిక మూలమును కోల్పోవటం మూలంగా పలు దశాబ్దముల పాటు జనాభా తరుగుదలను అనుభవించింది. అది యునైటెడ్ స్టేట్స్ లో పదిహేనవ పెద్ద నగరముగా ఉన్నప్పుడు, 1950లో ఆ నగర జనాభా అత్యధికముగా ఉంది. అప్పటి నుండి దాని జనాభా ప్రతి సంవత్సరమూ తగ్గుతూ ఉంది, ప్రత్యేకించి 1970ల చివరలో మరియు 1980ల ప్రారంభములో ఇది అధికముగా జరిగింది. ఈ సమయములో కేవలం ఐదు సంవత్సరములలో నగరం దాని జనాభాలో సుమారు మూడు వంతులు కోల్పోయింది. జనసంఖ్యలో మార్పు మరియు బఫెలోతో సహా ఆ ప్రాంతపు పారిశ్రామిక నగరములపై ఆ మార్పు ప్రభావము గణనీయమైనది; 2006 US జనగణన అంచనా ప్రకారం, బఫెలో యొక్క ప్రస్తుత జనాభా 1890నాటి దాని జనాభాతో సమానంగా ఉంది, 120 సంవత్సరాల జనసంఖ్య మార్పుకు ఇది వ్యతిరేక క్రమము.

ఈ సమయములో ఈ పోకడ అనిశ్చయమైనప్పటికీ, జనాభా క్షయం యొక్క క్రమం ఒక స్థిరమైన స్థితికి తగ్గుతూ వస్తోందని ప్రస్తుత జనాభా లెక్కల అంచనాలు సూచిస్తున్నాయి. 2006–2007 క్షయం అంచనా మునుపటి సంవత్సరముల కన్నా 50% తక్కువగా ఉంది, మరియు ఇది గత సంవత్సరముల క్షయం కన్నా 1% తక్కువ. ఈ పోకడ కొనసాగుతుందా అనే విషయం రాబోయే సంవత్సర అంచనా వరకు స్పష్టమవదు.

2005–2007 అమెరికన్ కమ్యూనిటీ సర్వే ఎస్టిమేట్స్ లో, నగర జనాభాలో 53.8% తెల్లజాతీయులు (48.7% హిస్పానిక్ కాని తెల్లజాతీయులు మాత్రమే), 41.1% నల్లజాతీయులు లేదా ఆఫ్రికన్ అమెరికన్లు, 1.2% అమెరికన్ ఇండియన్ మరియు అలస్కా దేశీయులు, 2.0% ఆసియావాసులు, 4.5% ఇతర జాతుల నుండి మరియు 2.5% రెండు లేదా అంతకన్నా ఎక్కువ జాతులకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. మొత్తం జనాభాలో 1.9% మంది ఏదైనా జాతికి చెందిన హిస్పానిక్ లేదా లాటినో వారు.[106]

2000 జనాభా లెక్కల ప్రకారం ఈ నగరంలో 292,648 మంది ప్రజలు, 122,720 గృహములు, మరియు 67,005 కుటుంబములు ఉన్నాయి. ఒక చదరపు మైలుకు జన సాంద్రత 7,205.8 (2,782.4/km²). 3,584.4/sq mi (1,384.1/km²) సగటు సాంద్రతతో ఇక్కడ 145,574 నివాస విభాగములు ఉన్నాయి. నగరం యొక్క జాతుల నిర్మాణం ఈవిధంగా ఉంది. 54.43% తెల్లజాతీయులు, 37.23% ఆఫ్రికన్ అమెరికన్లు, 0.77% దేశీ అమెరికన్లు, 1.40% ఆసియా వాసులు, 0.04% పసిఫిక్ ఐలాండర్, 3.68% ఇతర జాతుల వారు, మరియు 2.45% రెండు లేదా అంతకన్నా ఎక్కువ జాతుల వారు ఉన్నారు. జనాభాలో 7.54% మంది హిస్పానిక్ లేదా లాటినో తెగల వారు ఉన్నారు. టాప్ 5 స్థానములలో ఉన్న అతిపెద్ద వంశములలో జర్మన్ (13.6%), ఐరిష్ (12.2%), ఇటాలియన్ (11.7%), పాలిష్ (11.7%), మరియు ఇంగ్లీష్ (4.0%) ఉన్నాయి.

ఇక్కడ 122,720 గృహములు ఉండగా, వాటిలో 18 సంవత్సరముల వయస్సులోపు పిల్లలు 28.6% ఉన్నారు, 27.6% వివాహమై కలిసి జీవిస్తున్నవారు, 22.3% భర్త లేకుండా కుటుంబములు నిర్వహిస్తున్న స్త్రీలు, మరియు 45.4% కుటుంబములు కానివి ఉన్నాయి. మొత్తం గృహములలో 34.6% స్వంతంత్రముగా జీవించేవారివి మరియు 9% 65 సంవత్సరాలు లేదా అంట కన్నా ఎక్కువ వయస్సు కలిగి ఒంటరిగా జీవించే వారివి. ఒక సగటు గృహ పరిమాణం 2.29 మరియు సగటు కుటుంబ పరిమాణం 3.07.

నగరంలో 18 సంవత్సరముల లోపు జనాభా 26.3%, 18 నుండి 24 సంవత్సరముల వారు 11.3%, 25 నుండి 44 సంవత్సరముల వారు 29.3%, 45 నుండి 64 సంవత్సరముల వారు 19.6%, మరియు 65 సంవత్సరములు అంతకన్నా పెద్ద వయస్సు వారు 13.4% ఉన్నారు. నడి వయసు 35 సంవత్సరాలు. ప్రతి 100 మంది స్త్రీలకు 97.8 మంది పురుషులు ఉన్నారు. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న ప్రతి వంద మంది స్త్రీలకు, 95.9 మంది పురుషులు ఉన్నారు.

నగరంలో మధ్యస్థ ఆదాయం ప్రతి గృహానికి $24,536 ఉంది, మరియు మధ్యస్థ ఆదాయం ప్రతి కుటుంబానికి $30,614 ఉంది. పురుషుల మధ్యస్థ ఆదాయం $30,938 అవగా స్త్రీల మధ్యస్థ ఆదాయం $23,982. నగరంలో ఒక వ్యక్తి తలసరి ఆదాయం $22,643. జనాభాలో 26.6% కుటుంబములలో 23.0% దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి. మొత్తం జనాభాలో, 18 సంవత్సరాల వయస్సు లోపు వారు 15.7% మరియు 65 సంవత్సరములు మరియు ఆపై వయసువారు 10.4% దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నారు.

బఫెలో లో ఐరిష్, ఇటాలియన్, పాలిష్, జర్మన్, జ్యూయిష్, గ్రీక్, అరబ్, ఆఫ్రికన్ అమెరికన్, ఇండియన్, మరియు ప్యూర్టో రికాన్ సంతతికి చెందిన జనాభా ఉంది. ప్రముఖ సాంప్రదాయ (వివిధ జాతుల) పరిసర ప్రాంతములు ఇంకా ఉన్నాయి కానీ వారు ఇరవయ్యవ శతాబ్దపు రెండవ భాగంలో గణనీయంగా మార్పు చెందాయి. సాంప్రదాయబద్ధంగా, పాలిష్-అమెరికన్స్ ఈస్ట్ సైడ్ యొక్క ప్రబలమైన ఆక్రమితులు అవగా, ఇటాలియన్-అమెరికన్స్ పశ్చిమ భాగంలో దట్టమైన జనావాసములను ఏర్పరిచారు. ఈస్ట్ సైడ్ లో ప్రస్తుతం ఆఫ్రికన్ అమెరికన్ జనాభా ఎక్కువగా ఉండగా, వెస్ట్ సైడ్ పలు జాతుల యొక్క సమ్మేళన స్థానం, ఇక్కడ లాటినో సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉంది. బఫెలో చరిత్ర అంతటా, ఉమ్మడిగా ఫస్ట్ వార్డ్ అని పిలవబడే ఈ పొరుగు ప్రాంతములు, అదేవిధంగా దక్షిణ బఫెలోలలో, ఐరిష్ సంతతికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఇటీవలే, ఈ ప్రాంతమునకు అరబ్ సంతతికి చెందినవారు వలస వచ్చారు, వీరు ముఖ్యంగా యెమన్ నుండి వచ్చారు, నగరం యొక్క ముస్లిం జనాభా సుమారు 3000 కు పెరిగినట్లు అంచనా. 1950ల మరియు 1960ల నుండి యూదుల జనాభాలో ఎక్కువ భాగం నగరానికి వెలుపల ఉన్న శివారు ప్రాంతములకు, లేదా నగరం యొక్క పై ఉత్తర భాగానికి మారింది.

మహానగర ప్రాంతం

ప్రధాన వ్యాసం: Buffalo-Niagara Falls metropolitan area

2006 నాటికి, ఏరీ మరియు నయాగర కౌంటీలు రెండిటిలో కలిపి మొత్తం 1,154,378 మంది జనాభా ఉన్నట్లు అంచనా. ఈ ప్రాంతంలో 82.2% తెల్లజాతీయులు, 13% ఆఫ్రికన్ అమెరికన్, 0.6% స్వదేశీ అమెరికన్, 1.32% ఆసియా ప్రజలు, 3.3% హిస్పానిక్, మరియు 1.4% అన్ని ఇతర జాతులవారు ఉన్నారు. మహానగర ప్రాంతంలో, 39.68% ప్రజలు 18 సంవత్సరముల లోపు లేదా 64 సంవత్సరముల లోపు వారు, మరియు మధ్యస్థ వయస్సు 38 సంవత్సరములు. జనాభా మొత్తంలో, 82.88% మంది ఉన్నత పాఠశాల డిప్లొమా కలిగి ఉన్నారు మరియు 23.2% బాచిలర్స్ డిగ్రీ పొందారు. ఒక కుటుంబం యొక్క మధ్యస్థ ఆదాయం $48,400 మరియు ఆ ప్రాంతం యొక్క తలసరి ఆదాయం $39,000 కన్నా తక్కువగా ఉంది. జనాభాలో సుమారు 8% మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు.

విద్య

ఇవి కూడా చూడండి: List of Buffalo metropolitan area schools

ప్రభుత్వ పాఠశాలలు

ప్రస్తుతం, ఇక్కడ నగరంలో 78 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, వీటిలో ఎక్కువగా విస్తరిస్తున్న స్వతంత్ర పాఠశాలలు ఉన్నాయి. 2006 నాటికి, మొత్తం 41,089 మంది విద్యార్ధులు ఉండగా, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 13.5 - 1 ఉంది. 2006లో 50% మరియు 2007లో 45% ఉన్న విద్యార్హత ప్రమాణం 2008లో 52% కు పెరిగింది . 27% కన్నా ఎక్కువ ఉపాధ్యాయులు మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకన్నా ఉన్నతమైన విధ్యార్హతను కలిగి ఉన్నారు మరియు ఉద్యోగములో సగటున 15 సంవత్సరముల అనుభవాన్ని కలిగి ఉన్నారు. మహానగర ప్రాంతమంతటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఇక్కడ మొత్తం 292 పాఠశాలలు ఉన్నాయి మరియు మొత్తం 172,854 మంది విద్యార్ధులు ఉన్నారు. బఫెలో ఒక అయస్కాంత విద్యాl వ్యవస్థను కలిగి ఉంది, ఇందులో సైన్సు, ద్విభాషా అధ్యయనములు, మరియు నేటివ్ అమెరికన్ అధ్యయనములు వంటి ప్రత్యేక ఆసక్తులు ఉన్న విద్యార్ధులను ఆకర్షించే పాఠశాలలు ఉన్నాయి. ప్రత్యేక సంస్థలలో బఫెలో ఎలిమెంటరీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ; Dr. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మల్టీకల్చరల్ ఇన్స్టిట్యూట్; ఇంటర్నేషనల్ స్కూల్; Dr. చార్లెస్ R. డ్రూ సైన్సు మాగ్నెట్ స్కూల్; బిల్డ్ అకాడెమి; లియోనార్డో డా విన్సీ హై స్కూల్ బఫెలో; PS 32 బెన్నెట్ పార్క్ మాంటిస్సోరి; బఫెలో అకాడెమి ఫర్ ది విజ్యువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, BAVPA; రివర్ సైడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; లఫఎట్ హై స్కూల్/బఫెలో అకాడెమి ఆఫ్ ఫైనాన్స్; హచిన్సన్ సెంట్రల్ టెక్నికల్ హై స్కూల్; సౌత్ పార్క్ హై స్కూల్ మరియు ఎమర్సన్ స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మొదలైనవి ఉన్నాయి.

ప్రస్తుతం బఫెలో $1 బిలియన్ తో నగర పాఠశాల పునరుద్ధరణ యోచనలో ఉంది.

ప్రైవేటు పాఠశాలలు

నగరంలో 47 ప్రైవేటు పాఠశాలలు ఉండగా మహానగర ప్రాంతంలో 150 విద్యాసంస్థలు ఉన్నాయి. చాలా ప్రైవేటు పాఠశాలలు రోమన్ కాథలిక్కులకు అనుబంధంగా ఉన్నాయి. ఇక్కడ ఇస్లాం మరియు జుడైజం వంటి ఇతర మతములకు అనుబంధముగా ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ మతసంబంధంలేని పాఠశాలలు కూడా ఉన్నాయి, వీటిలో ది బఫెలో సెమినరి (పశ్చిమ న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రైవేటు, మత సంబంధంలేని, బాలికల పాఠశాల), మరియు నికోల్స్ స్కూల్ ఉన్నాయి.

దాని సాధారణ పనితో పాటు, బఫెలో పబ్లిక్ స్కూల్స్ అడల్ట్ అండ్ కంటిన్యూనింగ్ ఎడ్యుకేషన్ డివిజన్ ఆ సమాజంలో ఉన్న వయోజనులందరికీ విద్య మరియు సేవలను అందిస్తోంది. అదనంగా, కెరీర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 20 పైగా విద్యా సంబంధిత కార్యక్రమములను అందిస్తోంది, మరియు ప్రతి సంవత్సరము సుమారు 6,000 విద్యార్ధులు దీనికి హాజరవుతున్నారు.

కాథలిక్ పాఠశాలలు

  • కానిసియస్ ఉన్నత పాఠశాల
  • బిషప్ టిమోన్ - సెయింట్ జూడ్ ఉన్నత పాఠశాల
  • నార్డిన్ అకాడెమి
  • హోలీ ఏంజిల్స్ అకాడెమి
  • మౌంట్ మెర్సీ అకాడెమి

కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు

ప్రైవేటు

  • కనిసియస్ కాలేజీ
  • ద'యువిల్లే కాలేజీ
  • మెడైల్లె కాలేజీ
  • ట్రోకైర్ కాలేజీ

SUNY

బఫెలోలో నాలుగు స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ (SUNY) విద్యాసంస్థలు ఉన్నాయి. దానికి సంబంధించిన వ్యవస్థలో ప్రతిదీ పెద్ద విద్యాసంస్థ. అన్నిటిలో కలుపుకుని వీటిలో మొత్తంమీద ఆ ప్రాంతానికి 40,000 మంది విద్యార్ధులు ఉన్నారు.

  • బఫెలో లోని విశ్వవిద్యాలయం, SUNY వ్యవస్థలో ఉన్న నాలుగు యూనివర్సిటీ సెంటర్ లలో ఒకటి.
  • బఫెలో స్టేట్ కాలేజీ, సమగ్రమైన 4 సంవత్సరముల కళాశాల.
  • ఏరీ కమ్యూనిటీ కాలేజీ SUNY తో అనుబంధముగా ఉన్న 2 సంవత్సరముల కమ్యూనిటీ కళాశాల.
  • ఎంపైర్ స్టేట్ కాలేజీ, ప్రభుత్వ స్వతంత్ర కళల కళాశాల

ఆర్థిక వ్యవస్థ

చరిత్ర

బఫెలో మరియు చుట్టుపక్కల ప్రాంతం చాలాకాలం నుండి రైలుమార్గ వాణిజ్యం, ఉక్కు తయారీ, వాహనముల ఉత్పత్తి, విమానము/విమాన సాంకేతికత రూపకల్పన మరియు ఉత్పత్తి, గ్రేట్ లేక్స్ ఓడల రవాణా, మరియు ఆహార ధాన్యముల నిలువలో నిమగ్నమై ఉన్నాయి. అనేక సంవత్సరముల తరువాత వీటిలో చాలా పరిశ్రమలు ఈ నగరాన్ని విడిచిపెట్టేశాయి. ఉక్కు ఉత్పత్తిలో ఎక్కువ భాగం ఈ ప్రాంతంలో జరగటంలేదు, అయినప్పటికీ పలు చిన్న ఉక్కు పరిశ్రమలు పనిచేస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు, భవనములు, పరిశ్రమలు మరియు వాహనముల విపణుల కొరకు ఉక్కు ఉత్పత్తులను తయారుచేసి, పంపిణీ చేసే ప్రముఖ సంస్థ జిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ యొక్క ప్రధాన కార్యాలయం బఫెలోలో ఉంది. 1950 యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ ప్రకారం, బఫెలో దేశంలో పదిహేనవ పెద్ద నగరం, దేశం యొక్క అతిపెద్ద అంతర రేవు (మొత్తంమీద పన్నెండవది), రెండవ పెద్ద రైలు కేంద్రం, ఆరవ పెద్ద ఉక్కు ఉత్పత్తిదారు, మరియు ఎనిమిదవ పెద్ద తయారీదారు.

ప్రస్తుతం ఈ ప్రాంతం యొక్క ఆర్ధిక వ్యవస్థను పారిశ్రామిక, లఘు తయారీ, అధిక సాంకేతికత మరియు సేవా పక్ష ప్రైవేటురంగ సంస్థల మిశ్రమముగా నిర్వచించవచ్చు. దాని ఆర్ధిక వ్యవస్థ భవిస్యత్తు కొరకు కేవలం ఒక పరిశ్రమ లేదా రంగం పైన ఆధారపడే బదులు, ఆ ప్రాంతం 21వ శతాబ్దములో పెరుగుదల మరియు విస్తరణకు అవకాశములను కల్పించిన భిన్న విధానమును అవలంబించింది [ఆధారం కోరబడింది].

ఉపాధి

మొత్తంమీద, అక్కడ జనాభా తగ్గిపోవటం మరియు ఉత్పత్తి ఆగిపోవటంతో బఫెలోలో ఉపాధి గతి తప్పింది. బఫెలో యొక్క 2005 నిరుద్యోగ ప్రమాణము 6.6%, ఆ సమయంలో న్యూయార్క్ రాష్ట్రం యొక్క నిరుద్యోగ ప్రమాణము 5.0%. 2005 యొక్క నాలుగవ భాగం నుండి 2006 యొక్క నాలుగవ భాగం వరకు, ఏరీ కౌంటీలో ఉపాధిలో ఏ మాత్రం అభివృద్ధి లేదు. దేశంలోని అతిపెద్ద 326 కౌంటీలలో దీనికి 271వ స్థానం లభించింది. ఈ ప్రాంతంలో నిరుద్యోగం 2005లో 6.6% మరియు 2006లో 5.2% నుండి జూలై 2007లో కేవలం 4.9% కు పడిపోవటంతో ఉపాధి అవకాశములలో మెరుగుదల కనిపించింది. ఈ ప్రాంతం యొక్క ఉత్పత్తి ఉద్యోగములలో అధిక క్షయం కొనసాగుతూనే ఉంది. 2006 ప్రారంభములో ఉన్న ఉద్యోగముల కన్నా 17,000 ఉద్యోగములు తక్కువగా ఉన్నాయి. కానీ ఇతర ఆర్ధిక రంగములు ఉత్పత్తి రంగమునకు భిన్నంగా అభివృద్ధి పథంలో కొనసాగాయి. విద్య మరియు ఆరోగ్య సేవలు 2006లో అదనముగా 30,400 పైగా ఉద్యోగములను జతచేయగా వృతి మరియు వ్యాపార (ముఖ్యంగా పెట్టుబడి) రంగములలో 20,500 పైగా ఉద్యోగములు జతచేరాయి.

జీవ శాస్త్రములు

బఫెలో బయోఇన్ఫర్మాటిక్స్ మరియు మానవ జీవపదార్ధ పరిశోధనకు అభివృద్ధి చెందుతున్న కేంద్రం అయింది, ఇక్కడ యూనివర్సిటీ ఎట్ బఫెలో మరియు రాస్వెల్ పార్క్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ లలో పరిశోధనచేస్తున్న వారి శోధనలు కూడా ఉన్నాయి. ఈ సంస్థ బఫెలో నయాగర మెడికల్ క్యాంపస్ గా ప్రసిద

Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
బఫెలో, న్యూయార్క్ కోసం ఇంకా చిట్కాలు లేదా సూచనలు లేవు. తోటి ప్రయాణికులకు ఉపయోగకరమైన సమాచారాన్ని పోస్ట్ చేసిన మొదటి వ్యక్తి మీరు కావచ్చు? :)
Curtiss Hotel, an Ascend Hotel Collection Member

ప్రారంభించడం $340

Embassy Suites Buffalo Hotel

ప్రారంభించడం $201

Hyatt Regency Buffalo Hotel and Conference Center

ప్రారంభించడం $146

Holiday Inn Express & Suites Buffalo Downtown

ప్రారంభించడం $187

Hilton Garden Inn Buffalo Downtown

ప్రారంభించడం $238

Adam's Mark Buffalo Niagara

ప్రారంభించడం $135

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
McKinley Monument

The McKinley Monument is a 96-foot (29 m) tall obelisk in Niagara

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Buffalo City Hall

Buffalo City Hall is the seat for municipal government in the City of

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Ellicott Square Building

The Ellicott Square Building is an office complex in Buffalo, New

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Coca-Cola Field

Coca-Cola Field (formerly Dunn Tire Park, North AmeriCare Park,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Buffalo Zoo

Founded in 1875, the Buffalo Zoo located in Buffalo, New York is the

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
HSBC Arena (Buffalo)

HSBC Arena is a multi-purpose indoor arena located in downtown

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Rowing Boathouse

Frank Lloyd Wright's Rowing Boathouse is located at 194 Porter Avenue,

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Old Fort Erie

Fort Erie was the first British fort to be constructed as part of a

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Uçhisar Kalesi

Uçhisar Kalesi ఒక పర్యాటక ఆకర్షణ, Üçhisar , Turkey లోని Interest

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Riomaggiore

Riomaggiore (Rimazùu in the local Ligurian language) is a village and

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Fethiye

Fethiye is a city and district of Muğla Province in the Aegean region

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Cinque Terre

The Cinque Terre (Шаблон:IPA-it) is a rugged portion of coast on the I

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Oaxaca, Oaxaca

The city of Oaxaca (formally: Oaxaca de Juárez, in honor of

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి