బరాబర్ గుహలు

భారతదేశంలో కొండలను తొలిచి నిర్మించిన రాతి గుహలలో అత్యంత పురాతనమైనవి బరాబర్ గుహలు. ఇవి బిహార్ లోని గయ జిల్లాలో వున్నాయి. క్రీ.పూ. 3 వ శతాబ్దానికి చెందిన ఈ రాతి గుహలు మౌర్య చక్రవర్తుల కాలం నాటివి. ఈ గుహలలో మౌర్య చక్రవర్తులు అశోకుడు, అతని మనుమడు దశరథుడు లకు చెందిన శిలా శాసనాలు లభించాయి. ఈ గుహలను మౌర్య చక్రవర్తులు తొలిపించి అజీవకులకు దానంగా ఇచ్చారు.

ఇది కూడ చూడు

ఉనికి

బరాబర్ గుహలు (నాలుగు గుహలు), నాగార్జుని గుహలు (మూడు గుహలు) బిహార్ లోని గయకు 16 మైళ్ళ దూరంలో ఫల్గు నదికి ఎడమ ఒడ్డున గల బరాబర్ కొండలలో, నాగార్జుని కొండలలో వున్నాయి. బరాబర్ గుహలలో సుదామ గుహ, లోమస్ రుషి గుహ, కరణ్ చౌపర్ గుహ, విశ్వా జోప్రి అనే నాలుగు గుహలు వున్నాయి. ఈ గుహలలో సుదామ గుహ, లోమస్ రుషి గుహలు భారతదేశంలో కొండలను తొలిచి చేసిన శిలా వాస్తు నిర్మాణాలకు తొలి ఉదాహరణలు. నాగార్జుని గుహలలో గోపికా గుహ, వహిమ గుహ, వేదాంతి అనే మూడు గుహలు వున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బరాబర్ ప్రాంతంలో కూడా అనేక శిలలను తొలిపించి నిర్మించిన బౌద్ధ మరియు హిందూ శిల్పాలు వెలసి ఉన్నాయి.

ముఖ్యాంశాలు

  • బరాబర్ గుహలు భారతదేశపు తొలి ప్రాచీన రాతి గుహలు. (క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందినవి)
  • మౌర్య చక్రవర్తులు అశోకుడు, దశరథుడు వీటిని నిర్మించి అజీవక శాఖకు చెందిన శ్రమణులకు దానంగా ఇచ్చారు.
  • ఈ రాతి గుహలను శిలాఖందానికి నేరుగా (parallel to the surface of the rock) తోలిచారు. లంబరేఖా రూపంలో (perpendicular) తొలచలేదు.
  • ఈ రాతిగుహాల గోడలు మౌర్యుల కాలపు తళతళ నునుపుదనాన్ని (Polish) కలిగివున్నాయి.
  • అప్పటికీ మహాయానశాఖ ఏర్పడనందువల్ల ఈ రాతిగుహలలో బుద్ధుని శిల్పం కనిపించదు. దానికి బదులుగా ఆరాధనకు వాడే స్థూపం (otive stupa) కనిపిస్తుంది.
  • బరాబర్ గుహలకు చెందిన రాతి శిల్పంలో కొయ్య నిర్మాణానికి చెందిన వాస్తురీతి ప్రతిఫలించింది. నేర్పరియైన వడ్రంగి పనితనం ఈ గుహల రాతికట్టడంలో రమణీయంగా అనుకరించబడింది.
  • మౌర్యుల వాస్తు శిల్పకళకు ఉదాహరణగా బరాబర్ రాతి గుహలు నిలుస్తాయి.
  • బరాబర్ రాతి గుహలలో వెలసిన మౌర్యుల శిల్పం, మౌర్యుల తరువాత కొనసాగిన శిల్పకళపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

బరాబర్ గుహలు

బరాబర్ కొండ గుహలలో మొత్తం నాలుగు గుహలున్నాయి.

  • సుదామ గుహ
  • లోమస్ రుషి గుహ
  • కరణ్ చౌపర్ గుహ
  • విశ్వ జోప్ర గుహ

ఈ గుహలలో సుదామ గుహ, లోమస్ రుషి గుహలు భారతదేశంలో కొండలను తొలిచి చేసిన శిలా వాస్తు నిర్మాణాలకు తొలి ఉదాహరణలు. వీటిలో సుదామ గుహ, కరణ్ చౌపర్ గుహలలో అశోకుని శిలా శాసనాలు లభ్యమవుతున్నాయి. మొత్తం మీద బరాబర్ గుహలన్నీ ఒకే నిర్మాణ రీతిలో వున్నాయి. ఈ గుహలను శిలా ముఖభాగానికి సమాంతరంగా (face of the rock) నిర్మించడం ఒక ప్రత్యేక లక్షణం. ఈ గుహలలో ప్రవేశ మార్గాలు సమలంబ చతుర్భుజ (trapezoidal) ఆకారంలో వున్నాయి. ప్రతీ గుహకు సాధారణంగా దీర్ఘచతురస్త్రాకారపు హాలు (Hall), వర్తులాకారపు దేవగృహం (Cell) వున్నాయి. వీటి పైకప్పులు పీపాకారంలో (barrel vaulted roof) వున్నాయి.హాలుకు దేవగృహాన్ని కలుపుతూ ఒక ప్రవేశ ద్వారం కలదు. ఈ గుహల లోపలి కుడ్యభాగాలు అద్దంలాగ మెరిసే నునుపుదనాన్ని (polish) కలిగి వున్నాయి.

సుదామ గుహ

ఈ గుహకు దీర్ఘ చతురస్త్రాకారపు హాలు వుంది. దానిపై పీపాకారపై కప్పు (barrel vaulted roof) వుంది. దేవగృహం (Cell) మాత్రం గుండ్రంగాను, దాని పైకప్పు గుండ్రంగాను వుంది. సుదామ గుహలోనే అతి ప్రాచీనమైన అశోకుని శిలా శాసనం కనిపిస్తుంది. దీన్ని బట్టి అశోక చక్రవర్తి తను రాజ్యానికి వచ్చిన 12 వ పాలనా సంవత్సరంలో (క్రీ. పూ. 252 లో) ఈ గుహను నిర్మించి అజీవకులకు దానంగా ఇచ్చినట్లు తెలుస్తుంది.

లోమస్ రుషి గుహ

ఈ గుహకు కూడా ఒక దీర్ఘ చతురస్త్రాకారపు హాలు వుంది. దానిపై పీపాకారపై కప్పు (barrel vaulted roof) వుంది. దేవగృహం (Cell) మాత్రం కోడిగుడ్డు (oval) ఆకారంలో, దాని పైకప్పు పీపా ఆకారంలో వుంది. ఈ గుహలో శిలా శాసనం లేదు. ఈ గుహ ప్రవేశ ద్వారం కొయ్యతో నిర్మించిన కట్టడం యొక్క వాస్తు రీతిని పోలి వుంది. సునిశితమైన వడ్రంగి పనితనం ఈ గుహకు సంబందించిన రాతి కట్టడంలో అందంగా అనుకరించబడింది. దీని ప్రవేశ ద్వారపు పైభాగంలో ఒక వరుసలోని ఏనుగు జంటలు ఎదురెదురుగా స్తూపాన్ని ఆరాదిస్తున్నట్లు చెక్కబడ్డాయి.

కర్ణ చౌపర్ గుహ

ఇది 33 X 14 అడుగుల విస్తీర్ణం గల ఒక దీర్ఘచతురాస్త్రాకారపు హాలును, అత్యంత నునుపైన (polish) గోడలను కలిగివుంది. దీనిలో అశోకుని శిలా శాసనం కనిపిస్తుంది. దీని ద్వారా అశోక చక్రవర్తి తను రాజ్యానికి వచ్చిన 19 వ పాలనా సంవత్సరంలో (క్రీ. పూ. 245 లో) ఈ గుహను తొలిపించినట్లు తెలుస్తుంది.

విశ్వా జోప్రి గుహ

ఇది రెండు దీర్ఘచతురాస్త్రాకారపు గదులను కలిగివుంది.

నాగార్జుని గుహలు

బరాబర్ కొండకు సమీపంలో గల నాగార్జుని కొండలో 3 గుహలు వున్నాయి. బరాబర్ గుహలతో పోలిస్తే ఇవి చిన్నవి మాత్రమే కాక తరువాత కాలానికి చెందినవి.

  • గోపికా గుహ
  • వపియ గుహ
  • వేదాంతి గుహ

గోపికా గుహ

ఇది అశోకుని మనుమడు మౌర్య చక్రవర్తి దశరథుని కాలంలో క్రీ.పూ. 204 లో తొలచి నిర్మించబడింది.ఇది మౌర్యులు తొలిపించిన ఆఖరి గుహ. దీనిలో 46 అడుగుల పొడవు గల హాలు వుంది. దీనిపై పీపాకార పైకప్పు (barrel vaulted roof) వుంది. ఇది విహారం కావచ్చు.

వపియ గుహ

ఈ గుహలో కూడా ఒక దీర్ఘచతురాస్త్రాకారపు హాలు, దాని ముందు ఒక అర్ధ మండపం వుంది.

వేదాంతి గుహ

ఈ గుహ ఒక గుడిసె (toda) లాగా కనపడుతుంది.

రాతిగుహలలో మౌర్యుల వాస్తు శిల్పం-ప్రభావం

బరాబర్ గుహలు దక్షిణాసియాలో శిలా వాస్తు నిర్మాణ (రాక్-కట్ ఆర్కిటెక్చర్) సంప్రదాయాన్ని బాగా ప్రభావితం చేశాయి. బరాబర్ గుహలు, నాగార్జుని గుహలు తరువాత కాలంలో భారతదేశంలో వెలసిన అనేక రాతి గుహలకు మార్గదర్శకంగా నిలిచాయి. అప్పటిదాకా వాస్తుశిల్పాలకు కొయ్యను ఉపయోగించిన మౌర్యులు తొలిసారిగా రాతిగుహలలో వాస్తు శిల్పాలను చెక్కడం ప్రారంభించారు. అయితే మౌర్యుల వాస్తు శిల్పానికి ఉదాహరణగా నిలిచిన బరాబర్ రాతి గుహలు, అందలి మౌర్య శిల్పం ఆ మౌర్యుల తరువాత కొనసాగిన శిల్పకళపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కారణం మౌర్య చక్రవర్తుల అభిరుచులకు, సిద్ధాంతాలకు అనుగుణంగా రూపుదిద్దుకొన్న మౌర్యశిల్పం మాదిరిగానే బరాబర్ రాతి గుహలలో నిర్మించిన మౌర్య వాస్తు శిల్పం కూడా ప్రజాదరణను పొందలేదు. అందువలన మౌర్యుల పతనానతరం వారి వాస్తుకళ కూడా అంతరించిపోయింది. అయితే వాస్తు శిల్పాలకు శిలలను తొలిసారిగా ఉపయోగించడం, కొండలను తొలిచి రాతి గుహలను ప్రప్రధమంగా నిర్మించడాలు భారతీయ వాస్తు శిల్పకళకు మౌర్యులు చేసిన గొప్ప సేవగా పేర్కొనవచ్చు.

వెలుపలి లింకులు

Listed in the following categories:
వ్యాఖ్యను పోస్ట్ చేయండి
చిట్కాలు & సూచనలు
బరాబర్ గుహలు కోసం ఇంకా చిట్కాలు లేదా సూచనలు లేవు. తోటి ప్రయాణికులకు ఉపయోగకరమైన సమాచారాన్ని పోస్ట్ చేసిన మొదటి వ్యక్తి మీరు కావచ్చు? :)
Hotel Darbar International

ప్రారంభించడం $30

Hotel Viraat Inn

ప్రారంభించడం $26

Hotel Manisha International

ప్రారంభించడం $70

Hotel Grand Palace

ప్రారంభించడం $45

Hotel Buddha

ప్రారంభించడం $14

Ajatsatru Hotel

ప్రారంభించడం $12

సమీపంలో సిఫార్సు చేసిన దృశ్యాలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Mahabodhi Temple

The Mahabodhi Temple (Literally: 'Great Awakening Temple') is a

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
నలందా

నలంద (Nālānda) భారత దేశమందు ప్రస్తుత బీహరు రాష్ట్రంలో గల ప్

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Kakolat

Kakolat is the name of a waterfall located in the Nawada district of

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Agam Kuan

Agam Kuan, which means 'unfathomable well', is said to date back to

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Gandhi Maidan

Gandhi Maidan, previously known as the Patna Lawns, is a historic

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Golghar

The Golghar or Gol Ghar (गोलघर), ('Round house'), located to the west

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Gandhi Ghat

Gandhi Ghat (Hindi: गांधी घाट) is one of the main ghats on the Ga

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Rohtasgarh Fort

The Rohtas Fort is one of the most ancient forts of India located in a

ఇలాంటి పర్యాటక ఆకర్షణలు

అన్నింటిని చూడు అన్నింటిని చూడు
కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Salt Cathedral of Zipaquirá

The Salt Cathedral of Zipaquirá (Spanish: Catedral de Sal de

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Karaca Cave

Karaca Cave (Turkish: Karaca Mağarası) is a network of caves l

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Batu Caves

Batu Caves is a limestone hill, which has a series of caves and cave

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Saeva dupka

Saeva dupka (Bulgarian: Съева дупка) is a cave in Northern Bulgaria

కోరిక జాబితాకి జోడించండి
నేను ఇక్కడ ఉన్నాను
సందర్శించారు
Wieliczka Salt Mine

The Wieliczka Salt Mine, located in the town of Wieliczka in southern

అన్ని సారూప్య ప్రదేశాలను చూడండి