హూవర్ డామ్ ఒకానొకప్పుడు బౌల్డర్ డామ్ అనేవారు. ఇది కొలరాడోనది యొక్క బ్లాక్ కేనియాన్‌లో నిర్మించబడిన ఆర్చ్-గ్రావిటీ డామ్. ఈ డామ్ అమెరికా లోని అరిజో మరియు నెవాడా రాష్ట్రాల సరిహద్దులలో ఉన్నది. గ్రేట్ డిప్రెషన్ కాలంలో ఈ డామ్ 1931 మరియు 1936ల మధ్య నిర్మించబడి 1935 సెప్టెంబర్ 30న అప్పటి ప్రెసిడెంట్ అయిన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ చేత దేశానికి అంకితమివ్వబడింది. ఈ డామ్ నిర్మాణం వేల మంది శ్రామికుల సమిష్టి పరిశ్రమకు నిదర్శనం. దీని నిర్మాణంలో 100 మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. ఈ ఆనకట్ట కు అధ్యక్షుడు హెర్బర్ట్ హోవర్ పేరు పెట్టడం వివాదాస్పదమయ్యింది. 1900 నుండి బ్లాక్ కాన్యన్ మరియు సమీపంలోని బౌల్డర్ కాన్యన్ డామ్ నిర్మాణానికి తగిన శక్తి కలిగి ఉన్నాయా అని పరిశోధించబడ్డాయి. ఈ ప్రదేశంలో నిర్మించబడే డామ్ వరదలను తట్టుకుని వ్యవసాయ పనులకు కావలసిన నీటిని సరఫరా చేయడానికి, హైడ్రో ఎలెక్‌ట్రిక్ పవర్ ఉత్పత్తికి అనువైనదా అని పరిశోధించబడింది. 1928లో కాంగ్రెస్ డాం నిర్మాణానికి తన అధికారిక అంగీకారాన్నిచ్చింది. వేలాన్ని జయించి నిర్మాణ పధకాన్ని చేపట్టిన నిర్మాణసంస్థ సిక్స్ కంపెనీస్, ఐ ఎన్ సి పేరుతో డామ్ పనులను1931లో ప్రారంభించింది. ఇలాంటి బృహత్తర సిమెంట్ నిర్మాణం ఇంతకు ముందు ఎప్పుడూ నిర్మింపబడలేదు. కొన్ని ఇంకా కొన్ని సాంకేతికవివరాలు నిరూపించబడ లేదు. తీవ్ర ఉష్ణోగ్రత తో కూడిన వేసవి వాతావరణం మరియు కొన్ని వసతుల కొరత సమస్యలను కలిగించినా సిక్స్ కంపెనీలు అనుకున్న ప్రణాళిక కంటే రెండు సంవత్సరాల ముందే నిర్మాణపు పనులను ముగించి ఫెడరల్ గవర్నమెంట్ కు 1936 మార్చ్ 1 నాటికి ఆనకట్ట ను సమర్పించింది. నెవాడా రాష్ట్రం లోని లాస్ వెగాస్ కు అగ్నేయంలో డామ్ నిర్మాణపు పనివారి కొరకు 25 చదరపు మైళ్ళ ప్రదేశంలో బౌల్డర్ సిటీ నిర్మించబడింది. ఈ బౌల్డర్ సిటీ సమీపంలోని లేక్ మీడ్ సరస్సుకు డామ్ నీరు పంపబడుతుంది. డామ్‌లో ఉత్పత్తి చేయబడే విద్యుత్తు అరిజోనా, నెవాడా మరియు కాలిఫోర్నియా రాష్ట్రాలలో ప్రజోపయోగానికి మరియు ప్రైవేట్ సంస్థలకు అందించబడుతుంది. హోవర్ డామ్ ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఏటా పది లక్షల పర్యాటకులు ఈ ఆనకట్టను చూడటానికి వస్తుంటారు. రద్దీగా ఉండే యు ఎస్ 93 రహదారి, 2010 అక్టోబర్ న ఆనకట్ట బైపాస్ రోడ్ తెరిచే వరకు డామ్ వరకు ఉండేది.
అమెరికా నరుతి ప్రాంతపు అభివృద్ధి చేయడానికి, వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన కొలరాడో నదీ జలాలు ప్రధాన అధారము. 1890లో భూపరిశీలకుడు విలియమ్ బీటీ మెక్సికన్ సరిహద్దులకు అతి సమీపంలో నిర్మించిన అల్మో కెనాల్ నిర్మాణంతో కొలరడో నదీజలాలు వ్యవసాయ ఉత్పత్తి కొరకు మళ్ళించే కార్యక్రమం ఆరంభమైంది. ఈ కాలువ నిర్మించే ముందు కొలరాడో నదీజలాలు మెక్సికోలో ప్రవేశించే ముందు నిర్మానుష్య ప్రదేశాలను తడుపుతూ ఉండేది. బీటీ ఆ ప్రదేశానికి ఇంపీరియల్ వెల్లీ నామకరణం చేసాడు. ఈ కాలువగుండా ప్రవహించిన నదీజలాలు విశాలమైన లోయలలోకి చేరడం వలన దీని నిర్వహణ చాలా వ్యయంతో కూడినదై ఉంటూ వచ్చింది. ఈ నీట్ఇని మళ్ళించిన జలాలు సాల్టన్ సీని నింపింది. ది సదరన్ పసిఫిక్ రైల్ రోడ్ 3 మిలియన్ల డాలర్లను 1906-07 నదీజలాలను క్రమపరచడానికి వెచ్చించింది. ఈ క్రమబద్దీకరణ కార్యక్రమం మెక్సికన్ వైపున్న భూయజమానులను తృప్తి పరచలేక పోవడమే కాక వివాదాలు చెలరేగాయి. ఎలెక్ట్రిక్ పవర్ ట్రాన్స్ మిషన్ సంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత దిగువ కొలరాడో నదీజలాలు హైడ్రాలిక్ పవర్ తయారీకి ప్రధాన వనరుగా ఉపయోగపడ్డాయి. 1902లో ది ఎడిసన్ ఎలెక్ట్రానిక్ కంపెనీ ఆఫ్ లాస్ ఏంజలెస్ సర్వేచేసి ఇక్కడ 40 అడుగుల (12 మీటర్ల) రాతి ఆనకట్టను నిర్మించి 10,000 హార్స్ పవర్(అశ్వశక్తి)(7,500 కిలోవాట్స్) ఉత్పత్తి చేయవచ్చని విశ్వసించారు. ఎలాగైతేనేమి ఆ సమయములో విద్యుత్చక్తిని సరఫరా చేయకలిగిన పరిమితి 80 మైల్స్ (130 కి.మీ) అప్పుడు ఆ పరిమితిలో కొంత మంది వాడకం దారులు (అధికంగా గనుల యజమానులు)మాత్రమే ఉన్నారు. ఆనకట్ట నిర్మాణానికి ఎడిసన్ నిర్ణయించిన ప్రదేశాలలో ప్ర్స్తుతం హోవర్ డామ్ నిర్మించబడిన ప్రదేశం ఒకటి. తరువాతి సంవత్సరాలలో బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ కొలరడో లోతట్టు ప్రాంతం లోయనిర్మాణానికి నువైనదని సూచించింది. సర్వీస్ చీఫ్ ఆర్థర్ పవెల్ డేవిస్ బౌల్డర్ కేనియన్‌ను డైనమైట్ సహాయంతో పడగొట్టాలన్న ప్రతిపాదన చేసాడు. డామ్6కు ఉత్తరంలో 20 మైళ్ళ నుండి ఈ పడగొట్టబడిన సిధిలాల తునకలను నది జజాలు ముందుకు తరలిస్తాయని మిగిలిన రాళతో ఆనకట్టను నిర్మించవచ్చని అంచనా వేసారు. చాలా సంవత్సరాలు దీని గురించి ఆలోచనలు చేసిన తరువాత 1922లో రిక్లమేషన్ సర్వీస్ ఈ ప్రతిపాదనలను త్రోసిపుచ్చింది. ఈ ప్రణాళికలోని సాంకేతికత నిరూపించబడలేదు కనుక ఇది ధనవ్యయం తగ్గిస్తుందా అన్న సందేహాలను లేవనెత్తింది.
1922లో రిక్లమేషన్ సర్వీస్ కొలరాడో నదీ వరదలను అదుపు చేయడానికి విద్యుత్చక్తి ఉత్పత్తి చేయడానికి కావలసిన ఆనకట్ట నిర్మాణానికి ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక రూపకల్పన విధానాలు డేవిస్ చేత రచింపబడ్డాయి. ఇంటీరియర్ సెక్రెఎటరీ ఆల్బర్ట్ ఫాల్ మరియు నివేదిక రచయిత డేవిస్ పేర్ల మీద ఫాల్-డేవిస్ నివేదిక గా పేర్కొనబడినది. ఫాల్-డేవిస్ నివేదిక ప్రకారం అనకట్ట నిర్మాణానికి నిర్ణయించిన ప్రదేశం ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆలోచింపజేసింది. ఈ ఆనకట్టకు ప్రతిపాదించిన ప్రదేశం అనేక రాష్ట్రాలకు సంబంధించి ఉండడం కొలరాడో నది మెక్సికోలో ప్రవేశించడము అందుకు కారణాలు. ఫాల్-డేవిస్ సూచించిన బౌల్డర్ కేనియన్ వద్ద లేక సమీప ప్రదేశాన్ని రిక్లమేషన్ సర్వీస్ానకట్ట నిర్మాణానికి తగనిదని అనుకున్నారు. బౌల్డర్ కేనియన్ వద్ద ఉన్న శక్తివంతమైన ప్రదేశం భౌగోళికంగా ఆనకట్ట నిర్మాణానికి తగనిదని భావించారు. చాలా ఇరుకుగా ఉన్న ఆ ప్రదేశం ఆనకట్ట నిర్మాణానికి, అదనపు నీరు విడుదల చేసే మార్గ నిర్మాణానికి వీలుపడన్నది మరొక కారణం. ది సర్వీస్ బ్లాక్ కేనియన్ ప్రదేశం ఆనకట్టకు నిర్మాణానికి అనువైనదని భావించింది. అలాగే లాస్ వెగాస్ నుండి ఆనకట్ట వరకు ఒక రైలు రోడ్ నిర్మాణాన్ని నిర్మించవచ్చని భావించింది. నిర్మాణ ప్రదేశం మారిన కారణంగా ఈ ప్రణాళికకు బౌల్డర్ కేనియన్ అన్న పేరు నిర్ణయించారు.
సుప్రీమ్ కోర్ట్ నదీజలాల వినియోగానికి దిశానిర్ధేశంతో ఎడతెగని చట్టసమస్యలతో ఆనకట్ట నిర్మాణం పనులు ముందుకు సాగలేదు. కొలరాడోకు చెందిన అటార్నీ కొరాడో నదితీరాన ఉన్న ఏడురాష్ట్రాలు కాంగ్రెస్ అంగీకారంతో ఆనకట్టనిర్మాణానికి ఒక ఒప్పందానికి రావాలని ప్రతిపాదించాడు. అమెరికాలో రష్ట్రాల మధ్య ఒప్పందాలు కాంగ్రెస్ అనుమతితో జరగాలన్న నియమం ఉన్నది కాని అంత వరకు ఈ ఒప్పందం రెండు రాష్ట్రాల మధ్యమాత్రమే జరిగింది. 1922లో ఏడురాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ విషయమై కలిసారు. ఈ సమావేశాన్ని సెక్రెటరీ ఆఫ్ కామర్స్ హర్బర్ట్ హోవర్అని పేర్కొనబడింది. ప్రారంభపు చర్చలు ఫలించకపోయినా సుప్రీమ్ కోర్ట్ వైమింగ్ వి కొలరాడో అన్న పేరుతో కొలరాడో నదీజలా ఉపయోగానికి సంబంధించి కొన్ని విశేష అధికారాలు ఇచ్చింది. ఈ సంఘటననదీజలాల ఉపయోగానికి సంబంధించిన ఒక ఒప్పందానికి రావడానికి వీలైంది. దీని ఫలితంగా 1922 నవంబర్ 24న కొలరాడో రివర్ కాంపాక్ట్ మీద సంతకాలు జరిగాయి.
ఫిల్ స్వింగ్ మరియు హైరమ్ జాన్సన్ ప్రాతినిధ్యంలో లెజిస్లేషన్ ఆనకట్ట నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అయినా మిగిలిన ప్రతినిధులు మాత్రం ఇదిీ ప్రణాళిక అత్యధిక వ్యయమైనదని అది కలిఫోర్నియాకు మాత్రమే ప్రయోజనాన్ని చేకూర్చగలదని భావించారు. ది 1927 మిసిసిపీ ఫ్లడ్స్ అని పేర్కొనబడిన మిసిసీపీ వరదల కారణంగా మధ్యపడమటి ప్రాంతం మరియు దక్షిణ కాంగ్రెస్ సభ్యులు మరియు సెనేటర్ల మనసులో కలిగిన అనుతాపము ఆనకట్టనిర్మాణానికి అనుకూలంగా స్పందించడానికి కారణమైంది. 1928 మార్చ్ 13 లాస్ ఏంజలెస్ నగర నిర్మితమైన సెయింట్ ఫ్రాన్సిస్ డామ్ నిషలమైన కారణంగా ఏర్పడిన విషాదకరమైన వరదల వలన కొన్ని వందల మంది మరణించారు. ఆ ఆనకట్ట ఆర్చ్ గ్రావిటీ తరహాకు చెందినది. ఈఇ కారణంగా బ్లాక్ కేనియాన్ ఆనకట్ట నిర్మించాలకున్న విధానం ప్రమాదకరమైనదని ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతికూలించే వారు అభిప్రాయం వెలిబుచ్చారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన కొలరాడో ఆనకట్ట పరిశీలనకు నియమించిన అధికారిక ఇంజనీర్ల బృందం ఈ ప్రణాళికను పరిశీలించారు. కొలరాడో రివర్ బోర్డ్ ఆనకట్ట నిర్మాణం ఆపివేయాలని ఆనకట్ట నిష్ఫలమైతే కొలరాడో దిగువ ప్రాంతపు సమూహాలు నాశనం ఔతాయని కొలరాడో నదీ జలాలు సాల్టన్ సీ కు తరలి పోయి నదీజలాలు లుప్తమై పోతాయని హెచ్చరించారు. ఈ బోర్డ్ " ఇలాంటి విపత్కర పరిస్థితుల నుండి బయట పడాలంటే ఆనకట్ట సురక్షిత ప్రదేశంలో నిర్మించడం మంచిది " అని సూచించారు.
1928 డిసెంబర్ 21 ఆనకట్ట నిర్మాణ బిల్లు మీద ప్రెసిడెంట్ కూలిడ్జ్ సంతకం చేసాడు. ఈ ప్రణాళిక కొరకు 165 మియన్ డాలర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రణాళికలో ఇంపీరియల్ డామ్ మరియు ఆల్ అమెరికన్ కెనాల్ , అమెరికా వైపున్న బెట్టీస్ కెనాల్ పునరుద్ధరణ ఇవన్నీ అనుమతించబడడంతో ఏడు రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చాయి కాని అరిజోనా రాష్ట్రం మాత్రం 1944 వరకు దీనిని నిర్ధారించ లేదు.
కాంగ్రస్ ఈ ప్రణాళికను అనుమతించక మునుపే బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ ఎలాంటి ఆనకట్ట ఉపయుక్తం అని అలోచనలు సాగించింది. అధికారులు చివరకు మాసివ్ కాంక్రీట్ ఆర్చ్- గ్రావిటీ డామ్ నిర్మించడం మేలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని బ్యూరో చీఫ్ ఇంజనీర్ జాన్ ఎల్ సేవేజ్ పర్యవేక్షణలో జరిగింది. దిమోనోలిథిక్ డామ్ కేంద్రములో మందముగానూ అంచులలో పలుచన గాను ఆనకట్ట జలాలకు అభిముఖంగా ఉంటుంది. ఆనకట్ట యొక్క ది కర్వింగ్ ఆర్చ్ జలాలను కేనియాన్ గోడలకు తరలిస్తుంది. వెడ్జ్-షేప్డ్ ఆనకట్ట కేంద్రం 660 అడుగుల మందం (200 మీటర్లు), అంచుల వద్ద 45 అడుగుల మందం (14 మీటర్లు) ఉంటుంది. అన్నకట్ట నుండి అరిజోనా మరియు నెవాడా వరకు రహదారి మార్గం ఉంటుది.
1931 జనవరి 10వ తారీఖున బ్యూరో తయారుచేసిన ఒప్పంద దస్తావేజులు (బిడ్ డాక్యుమెంట్) ఆసక్తి కలవారికి ఒక్కొక్క కాఫీ 5 డాలర్లకు లభించింది. ప్రభుత్వము చేత సరఫరా చేయబడిన సామానులతో ఒప్పందదారులు ఆనకట్ట నిర్మాణ ప్రదేశం సరిచేసి నిర్మాణపు పనులు చేపట్టేలా నిర్ణయించబడింది. 100 పేజీల దస్తావేజులతో 76 చిత్రాలతో సూక్ష్మమైన వివిరణలతో ఆనకట్ట నిర్మాణ డైజైన్ తయారైంది. ఉటాహ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అధినేతలు వాట్టిస్ బ్రదర్స్ ఆనకట్ట నిర్మాణంలో ఆసక్తి కనపరచినా పర్ఫార్మెన్స్ బాండ్‌కు కావలసిన ధనం సమకూర్చలేక పోయారు. వారు తమ చిరకాల భాగస్వాములైన మొరిషన్-నుడ్సెన్ దేశపు ప్రధాన ఆనకట్ట అయిన ఫ్రాంక్ క్రోవ్ ఆనకట్ట నిర్మాణంలో వారి ధనము పెట్టుబడిగా ఉంచిన కారణంగా హోవర్ డామ్ నిర్మాణానికి కావలసిన ధనం సమకూరని కారణంగా వారు పోర్ట్ లాండ్‌కు చెందిన పసిఫిక్ బ్రిడ్జ్ కంపెనీతో ఆనకట్ట నిర్మాణ బిడ్‌లో పాల్గొనడానికి భాగస్వామ్యము ఏర్పరచున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఒరిజన్ హెన్రీ జె కైజర్ & బెచెల్ కంపెనీ, లాస్ ఏంజలెస్‌కు చెందిన మెక్ డోనాల్డ్ & కాహ్న్ లిమిటెడ్ మరియు పోర్ట్ లాండ్ ఓరిజెన్‌కు చెందిన జె ఎఫ్ షెయా కంపెనీలు భాగస్వామ్యం వహించాయి. ఈ భాగస్వామ్యం సిక్స్ కంపెనీ ఐ ఎన్ సి గా పేర్కొనబడింది. నిర్మాణానికి వచ్చిన మూడు బిడ్స్ లో సిక్స్ కంపెనీస్ ఐ ఎన్ సి బిడ్ 48,890,955 అమెరికన్ డాలర్లు. ఇది కాన్ఫిడెన్షియల్ గవర్న్‌మెంట్ అంచనా వేసిన దాని కంటే 24,000 డాలర్లు తక్కువ. తరువాతి తక్కువ బిడ్ కంటే 5 మిలియన్ డాలర్ల తక్కువ. డిసిషన్ మేకర్ సెక్రెటరీ రే విల్‌బర్ రాక తరువాత లాస్ వెగాస్ హోవర్ డామ్ నిర్మాణానికి చక్కగా సహకరించింది. వారు స్పీకీసియస్ అనే మత్తుపదార్ధాల షాపులను మూసి వేసారు. విల్బర్ 1930లో ఆనకట్టకు సమీపంలో ఆనకట్టలో పని చేసేవారి కొరకు ఒక మాదిరి నగరాన్ని బౌల్డర్ సిటీ, నెవాడా పేరుతో నిర్మించాలని అక్కడ నుండి లాస్ వెగాస్ వరకు మరియు ఆనకట్ట వరకు ఒక రైలు మార్గం నిర్మించాలని ప్రకటించాడు. లాస్ వెగాస్ మరియు ఆనకట్టలను కలుపుతూ రైలు మార్గం నిర్మాణం 1930లో ఆరంభం అయింది.
ఆనకట్ట నిరాణపు పనులు అధికారపూర్వకంగా ఆరంభం కాగానే దక్షిణ నెవాడాకు నిరుద్యోగుల రాక అధికం అయింది. 5,000 మంది నివసించే లాస్ వెగాస్ నగరానికి 10,000-20,000 మంది నిరుద్యోగులు చేరుకున్నారు. ప్రభుత్వం సర్వేయర్ల కొరకు ఒక కేంప్ ఏర్పాటు చేసింది. మిగిలిన వారు నదీసమీపంలో వేరొక కేంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రదేశం త్వరలోనే తాత్కాలిక నివాసితులతో నిండి పోయింది. దీనిని మెక్ కీవర్స్ విల్లే పేర్కొన్నారు. ఈ కేంప్ ఉధ్యోగాల మీద ఆశపెట్టుకున్న మనుషులు వారి కుటుంబాలకు ఆలవాలమైంది. కొలరాడో నది వెంట ఉన్న మిగిలిన నివాసాలను అధికారికంగా విలియమ్స్ విల్లె అని పిలువబడింది అయినా ఇక్కడి నివాసితుల చేత రేగ్ టౌన్ అని పిలువబడింది. 1932లో పనులు ఆరంభం కాగానే సిక్స్ కంపెనీస్ 3,000 కంటే అధికమైన పనివారిని వేతనమిచ్చే ఏర్పాటుతో పనిలోకి తీసుకుంది. 1934 నాటికి ఉద్యోగాల అవసరం 5,251 ఉద్యోగాల ఉచ్ఛస్థికి చేరుకున్నాయి. నిర్మాణపు ఒప్పందా నుండి మంగోలియన్ పనివారికి నిషేధం ఎదురైంది. అధికంగా నల్లజాతీయులను ముప్పై కంటే మించకుండా వేతనం (ఇది అతి తక్కువ వేతనం)చెల్లించి పనిలోకి తీసుకున్నారు. ఒప్పందంలో భాగంగా సిక్స్ కంపెనీ ఐ ఎన్ సి బౌల్డర్ సిటీని నిర్మించింది. అసలైన టైమ్‌టేబుల్ ప్రకారం ఆనకట్ట నిర్మించే ముందే బౌల్డర్ సిటీ నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ హోవర్ డామ్ ప్రెసిడేంట్ పనులు అక్టోబర్ మాసం బదులుగా మార్చ్ మాసంలో ఆరంభం కావాలని ఆదేశించాడు. కంపెనీ కేనియాన్ గోడను ఆనుకుని బంక్ హౌస్‌లను నిర్మించింది. రివర్ కేంప్ అని పిలువబడిన ఈ ఇళ్ళలో 480 ఒంటరి పని వారు నివసించారు. పని వారి కుటుంబాలు వారికి బౌల్డర్ సిటీ నివ్వసాలు పూర్తి అయ్యేవరకు దూరంగానే ఉన్నారు అలాగే చాలా మంది రేగ్ టౌన్‌లో నివసించారు. హోవర్ డామ్ ప్రదేశం అధికంగా వేడి వాతావరణం కలిగి ఉంటుంది. 1931 వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా 115.5 డిగ్రీల(48.8 సెంటీ గ్రేడ్) ఫారెన్‌హీట్ వరకు ఉంటుంది. జూన్ 25 నుండి జూలై 26 మధ్య 16 మంది పని వారు ఇతర నివాసితులు వడదెబ్బకు మరణించారు.
ది ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్( ఐ డబ్ల్యూ డబ్ల్యూ లేక విబ్లీస్) ఇరవైవ శతాబ్ధపు ఆరంభకాలంలో తీవ్రవాద కార్మిక నాయకులుగా పిలువబడ్డారు. వారు సిక్స్ కంపెనీ పనివారిని సంఘటితం చేయడానికి 11 మంది ప్రతినిధులను పంపారు. వారిలో చాలా మంది లాస్ వెగాస్ పోలీస్ చేత అరెస్ట్ చేయబడ్డారు. విబ్లీస్‌తో పని వారి సంబంధాలను ఇష్టపడని యాజమాన్యం ప్రతినిధులను పంపివేసి నప్పటికీ 1931 ఆగస్ట్ 31న టన్నెల్ పని వారికి వేతనములు ఆపివేసింది. పనివారి తరఫున ఓక కమిటీ ఏర్పాటయింది. ఆ కమిటీ సాయంత్రానికి ఒక నిబంధనల జాబితాను తయారు చేసి మరునాటికి క్రోవ్‌కు వాటిని అందజేసింది. కాని అది ఫలించలేదు. పనివారు క్రోవ్ తమ మీద సానుభూతు ఉందని కనుక ఆయన తమపట్ల అనుకూలంగా స్పందించగడని విశ్వసించారు. క్రోవ్ వార్తా పత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూ లో పని వారికి అనుకూలంగా తన స్పందన తెలియజేయడమే అందుకు కారణం.
9వ తారీఖు ఉదయము క్రోవ్ కమిటీని కలుసుకుని యాజమాన్యము వారి నిబంధనలను నిరాకరించారని, పని అంతా ఆపి వేసారని, కార్యాలయ సింబ్బంది కొంత మంది వడ్రంగి పని వారు మాత్రమే ఉంటారని, పని వారిని అందరిని తొలగించారని తెలియజేసాడు. పనివారు తమ నివాసాలను ఖాళీ చేయడానికి ఆ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చారు. పని వారు వారి వేతన చెక్కులను తీసుకుని లాస్ వెగాస్ కు వెళ్ళి పరిస్తితులు చక్కపరచడానికి ఎదురుచూసాగారు. 13వ తారీఖున కంపెనీ తిరిగి పనివారిని పనిలోకి తీసుకుంది. రెండు రోజుల అనంతరం స్ట్రైక్ వెనక్కు తీసుకొనబడింది. పనివారి నిబంధనలను అంగీకరించబడలేదు అలాగే కంపెనీ వారు వేతనం తగ్గించమని తెలియజేసారు. బౌల్డర్ సిటీకి నివాసులు తరలి వెళ్ళడం ప్రారంభంకాగానే నివాస వసతులు అభివృద్ధి చేసారు. రెండవ శ్రామిక చర్య 1935 జూలై లో ఆనకట్ట నిర్మాణాన్ని దెబ్బతీసింది. సిక్స్ కంపెనీ యజమానులు పని గంటలలో మార్పులు తీసుకు వచ్చి పని వారు వారి మధ్యాహ్న భోజనం వారే ఏర్పాటు చేసుకోవాలని సూచించడమే అందుకు కారణం. పని వారు మొదట స్ట్రైక్ ప్రకటించి తరువాత మధ్యాహ్న భోజనముకు బదులుగా వేతనములో 1 డాలరు ఎక్కించాలని కోరింది. కంపెనీ వేతన విషయములో ఫెడరల్ గవర్నమెంటుతో ఆలోచనలు చేసినా అది ఫలించ లేదు కాని స్ట్రైక్ మాత్రం ముగింపుకు వచ్చింది.
ఆనకట్ట నిర్మించే ముందు కొలరాడో నదీజలాలలను నిర్మాణ ప్రదేశం నుండి మళ్ళించవలసిన వచ్చింది. అది సాధించడానికి కేన్‌యాన్ గోడల పక్కగా అరిజోనా వైపు రెండు మళ్ళింపు టన్నెల్స్ నెవాడా వైపు రెండు మళ్ళింపు టన్నెల్స్ ఏర్పాటు చేసారు. ఈ టన్నెల్స్ 56 అడుగుల(17 మీటర్లు) వ్యాసముతో నిర్మించబడ్డాయి. వాటి మొత్తం పొడవు షుమారు 16,000 అడుగులు(3 మైళ్ళు లేక 5 కిలోమీటర్లు). 1933 అక్టోబర్ 1 నాటికి ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి అయ్యేలా టెండర్లు విడుదల చెయ్యబడ్డాయి. పని ఆలస్యానికి ఒక్కోరోజుకు 3,000 అపరద్ధ రుసుము చెల్లించే షరతు మీద ఈ టెండర్లలో ప్రతిపాదించబడింది. ఈ ముగింపు తేదీని ఎదుర్కోవడానికి సిక్స్ కంపెనీ యాజమాన్యం 1933కు ముందే ఈ నిర్మాణం పూర్తి చేసాడు. తరువాతి ఆకురాలు కాలానికి చివరకు చలికాలానికి నదీజలాలు మళ్ళించబడి నదీజలాలు సురక్షిత పరిమితికి చేరాయి.
1931 మే నాటికి లోతట్టు ప్రాంతం అయిన నెవాడా టన్నెల్స్ పని మొదలైంది. అరిజోనా టన్నెల్స్ 1932 మార్చ్ నాటికి పనిమొదలైంది. 1932టన్నెల్ గోడలకు కాంక్రీట్ పని మొదలైంది. మొదటి బేస్ పోతపోయబడింది. కాంక్రీట్‌ను నిలబెట్టటాడికి మొత్తం టన్నెల్ అంతా పట్టలు మీద గ్రాంటీ క్రేన్స్ నడిచాయి. తరువాత పక్క గోడలు నిర్మాణం జరిగింది. పక్క గోడలకు కదిలించే స్టీల్ స్టాండులను ఉపయోగించారు. చివరకు ఓవర్ హెడ్ ఆఫ్ టన్నెల్స్ నిర్మించడానికి ప్‌న్యూమేటిక్ గన్స్ ఉపయోగించారు. కాంక్రీట్ లైనింగ్ 3 అడులు (1 మీటర్) మందం ఉంది. ఇది టన్నెల్ వ్యాసాన్ని 50 అడుగులకు(15 మీటర్లు) తగ్గించింది. నది 1932 నవంబర్ నాటికి రెండు అరిజోనా టన్నెల్స్‌కు మళ్ళించబడింది. అరిజోనా టన్నెల్స్ ఎగువ జలాలకొరకు ఎర్పాటు చేయబడ్డాయి. అరిజోనా టన్నెల్స్ సురక్షిత నిర్మాణం ద్వారా సంరక్షించబడ్డాయి. నదిలో చేరవేసిన రబ్బుల్ నుండి కూడా అవి సురక్షితంగా ఉన్నాయి.
ఆనకట్ట పూర్తి అయ్యేనాటికి ఈ టన్నెల్స్ సగము మూసి వేయబడ్డాయి. దిగువభాగం సగభాగము టన్నెల్స్ ప్రస్తుతం ప్రధాన స్పిల్వే మార్గాలుగా పని చేస్తున్నాయి.
కొలరాడో నదీజలాల నుండి నిర్మాణాన్ని రక్షించడం కొరకు నదీజలాల మళ్ళింపు కొరకు రెండు కాఫర్ డామ్లను నిర్మించారు. నదీ జలాలు మళ్ళించకపోయినా 1932లో ఎగువ డామ్ నిర్మాణం జరిగింది. కొలరాడో నదికి ఒకవేళ వరదలు సంభవిస్తే దాని నుండి నిర్మాణాన్ని రక్షించడం కొరకు ఎగువ కాఫర్ డామ్ నిర్మించబడింది. 2,000 మంది ఈ నిర్మాణకార్యానికి పనిచేసారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే బిడ్ దస్తావేజులలో ఆనకట్ట నిర్మాణం ఎంత ముఖ్యంగా ప్రస్తావించబడిందో అంతగా లాగా కాఫర్ డామ్ వివరణ కూడా ప్రస్తావించబడింది. ఎగువ కాఫర్ డామ్ 96 అడుగుల(29 మీటర్లు) ఎత్తు, 750 అడుగుల (230 మీటర్ల)మందంతో నిర్మించబడ్డాయి. ఇది ఆనకట్ట కంటే మందమైనది. దీనికి 650,000 ఘనపు గజముల స్థలము, (500,000 ఘనపు మీటర్లు) మెటీరియల్ అవసరమైనది.
కాఫర్ డామ్ నిర్మించగానే నిర్మాణ ప్రదేశం తడారి పోయి నిర్మాణానికి అనువుగా మారింది. తరువాత ఆనకట్ట నిర్మాణం మొదలై ఆనకట్టనిర్మాణ పునాదుల తవ్వకం ప్రారంభమైంది. కేనియన్ ధృఢమైన గోడలవెంట నిర్మాణం సాగించడానికి భూ ఊచకోతవలన చేరిన మట్టిని (అక్యుములేటెడ్ ఎరోషన్ సాయిల్)తొలగించవలసిన అవసరం ఏర్పడింది. అలాగే ఇతర నది పక్కన ఉన్న వదులైన వస్తుజాలాన్ని దృఢమైన రాళ్ళు వచ్చేవరకు కూడా తొలగించవలసిన అవసరం ఉంది. 1933 జూన్ నాటికి పునాదుల తవ్వకపు పనులు ముగిసాయి. ఈ తవ్వకముల పనులులలో షుమారు 1,500,000 ఘనపు గజములు (1,100,000 ఘనపు మీటర్లు )వస్తుజాలం తొలగించబడింది. అర్చ్-గ్రావిటీ శైలి ఆనకట్ట కారణంగా కేనియన్ గోడలు సరోవర జలాలను భరించవలసిన అవసరం ఉంది. అందు వలన పక్కగోడలపునాదులను దృఢమైన రాయి వచ్చే వరకు తవ్వవలసిన అవసరం ఉంది. లేకుంటే ఆనకట్ట నుండి నీరు వెలుపలకు కారే ప్రమాదం ఉంది.
రాళ్ళు తొలగించే పనివారిని అధిక వేతనదారులు గా పిలువబడ్డారు. వీరు కేనియాన్ గోడల మీదుగా కిందకు దిగి జాకేమ్మర్ మరియు డైనమైట్ లను ఉపయోగించి వదులైన రాళ్ళను తొలగించారు. ఆనకట్ట నిర్మాణ ప్రదేశములో రాళు పడడం వలన మరణించడం సాధారణ విషయము అయింది. అలాగే ఈ అధిక వేతనదారులు పనివారి రక్షణకు ఉపకరించారు. ఒక అధికవేతదారుడు నేరుగా ఒకరిని రక్షించాడు. ఒక పర్యవేక్షకుడు రక్షితరేఖ(సేఫ్టీ లైన్) నుండి పత్తు తప్పి జారి కిందకు జారే దాదాపు మరణానికి సమీపించిన తరుణంలో అధికవేతనదారుడు అతడిని పట్టుకుని గాలిలోకి లాగి రక్షించాడు. నిర్మాణంలోనే ఆనకట్ట పర్యాటకులను అయస్కాంతంలా ఆకర్షించసాగింది. అధికవేతనదారులు ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకులకు చూపించబడ్డారు. అధికవేతదారులు ఆలోచించతగినంతగా మాధ్యమ దృష్టిని ఆకర్షించారు. ఒక పనివాడు ఇలా ఊగులాడే అధికవేతనదారుడిని మానవ లోలకము (హ్యూమన్ పెండ్యులమ్)గా వర్ణించాడు. ఊగులాడే పనివారు డైనమైట్‌లను కేనియాన్ గోడలలో అమర్చే పనిని చేస్తారు. పడిపోయే వస్తుజాలం నుండి రక్షించికునే నిమిత్తం వారు వారి బట్టతో తయ్యరు చేసిన టోపీలను తారులో ముంచి వాటిని ఆరబెట్టి తల మీద ధరించి పని చేసే వారు. అలా చేయడం వలన ప్రమాద సమయంలో కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలినా తలభాగం మాత్రం సురక్షితంగా ఉండేది. ఆరంభంలో హార్డ్ బాయిల్డ్ హ్యాట్స్ (గట్టిగా కాగపెట్టిన టోపీ)అని పిలువబడిన ఈ టోపీలను సిక్స్ కంపెనీస్ పెద్ద మొత్తంలో ఆర్డర్ చేసారు. తరువాత వీటిని హార్డ్ హ్యాట్స్ అని పిలిచారు. ఈ టోపీలు వాడకాన్ని బలంగా ప్రోత్సహించారు.
రాళ్ళను తొలగించడం పూర్తికాగానే పునాదులను కాంక్రీటువేసి దృఢపరిచారు. కేనియన్ గోడలలో నిర్మాణం కొరకు 150 అడుగుల (46 మీటర్లు)లోతుగా రంధ్రాలు చేసారు. అలాగే ఏర్పడిన పగుళ్ళను కూడా కాంక్రీటుతో మూసారు. ఇలా చేసిన కారణంగా రాళ్ళను క్రమబద్ధీకరించి ఆనకట్ట నుండి నీరు వెలుపలకు స్రవించకుండా కాపాడుతుంది. అధికముగా పెరిగే నీటి వత్తిడి నుండి ఆనకట్టను రక్షిస్తుంది. పనివారు అడ్డంకులను సరిచేయకుండానే కాంక్రీటు పోసే స్థలానికి పావాలని నిర్బంధించబడ్డారు. 393లో 58 పగుళ్ళు పూర్తిగా మూయబడలేదు. ఆనకట్ట పూర్తి అయి సరసులలోని నీటితో నింపబడగానే అనేక నీటిస్రావాలను కనిపెట్టబడ్డాయి. వాటిని కనిపెట్టిన బ్యూరో ఆఫ్ రిక్రియేషన్ పరిస్థితిపై దృష్టిని సారించారు. పని అసంపూర్తిగా నిలిచిపోయిందని కేనియాను గురించి పూర్తి అవగాహన చేసుకోక లేక పోయామని గ్రహించారు. ఆనకట్టను పూర్తిగా పర్యవేక్షించి పరిసర రాళ్ళలో కొత్త రంద్రాలు చేసి లోపాలను గ్రహించి సహాయంగా కాంక్రీటు వేసి ఆనకట్టను సరిచేయడానికి అదనంగా తొమ్మిది సంవత్సరాలు పట్టింది(1938-47).
ముందుచేసిన ప్రణాళిక కంటే 18 మాసాల ముందుగానే 1933 జూన్ 6 నాటికి మొదటి కాంక్రీటు వేసారు. కాంక్రీటును వేడి చేయడం మరియు చల్లబరచడం వంటి ప్రక్రియలలో ఉన్న అసమానతల వలన కాంక్రీటు తీవ్రమైన సమస్యలను ఎదుర్కంది. బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ వారు ఆనకట్టను ఇలా ఒకే కాంక్రీటుగా పోసి తయారు చేస్తే కాంక్రీటు ఆరడానికి 125 సంవత్సరాల కాలం పడుతుందని గణించారు. ఈ వత్తిడి కారణంగా ఆనకట్టలో పగుళ్ళు ఏర్పడతాయని భావించారు. దీనిని తప్పించడానికి భూమిమీద నిర్మాణము దీర్ఘచాతురస్రపు గుర్తులను పెట్టారు. వాటిని కాంక్రీటు అచ్చులతో నిర్మించాలని చేయాలనుకున్నారు. ఇందుకొరకు 50 (15 మీటర్లు)అడుగుల చదరము 5 (1.5 మీటర్లు)అడుగుల ఎత్తుగల అచ్చులను పోసారు. ఒక్కొక్క బ్లాకుకు 1 అంగుళము స్టీల్ పైపుల వరుసతో నదినీటిని సరఫరాచేసి చల్లబరచారు. ఒకబ్లాకు వేసి పపులను మూసి వేసేవారు.
కాంక్రీటును 7 అడుగుల ఎత్తు (2.1 మీటర్లు)పెద్ద 7 అడుగుల (2.1 మీటర్లు)వ్యాసము కలిగిన పెద్ద బక్కెట్ల ద్వారా తీసుకురాబడింది. ఈ బక్కెట్లను రూపకల్పన చేసినందుకు క్రోవ్ రెండు పేటెంట్ హక్కుయ్లను పొందాడు. ఈ బక్కెట్లు నింపబడినప్పుడు షుమారు 18 టన్నుల బరువు కలుగి ఉంటాయి. కాంక్రీటు తయారీకి రెండు ప్లాంటులను నెవాడా వైపు పనిచేసాయి. కాంక్రీటు నెవాడా నుండి రైల్వే కార్లలోనిరంఆణస్థలానికి పంపే వారు. తరువాత బక్కెట్లు కేబుల్ వే ద్వారా కావలసిన ప్రదేశానికి చేర్చే వారు. ఒకసారి బకెట్ తెరిస్తే 8 ఘనపు గజముల (6.1 ఘనపు మీటర్లు) మేరకు పని చేయవచ్చు. దీనిని సరిగా పని చేయించడానికి ఒక బృందం పనివారు పనిచేయవలసి ఉంటుంది.
పనిపూర్తి చేసిన 1935 మే 29 నాటికి మొత్తం 3,250,000 ఘనపు గజముల (2,480,000 ఘనపు మీటర్లు) కాంక్రీటును వాడారు. పవర్ ప్లాంట్ మరియు ఇతర పనులకు అదనంగా 1,110,000 ఘనపు అడుల(ఘనపు మీటర్ల)సిమెంటును వాడారు. కాంక్రీటును చల్లబరచడానికి 582 మైళ్ళ(937 కిలోమీటర్ల)పొడవు కంటే అధికంగా స్టీలు పపులను వాడారు. మొత్తం మీద శాన్ ఫ్రాన్సిస్కో మరియు న్యూయార్క్‌ల మధ్య రహదారికి ఇరువైపులా కాలిబాటకు ఎంత కాంక్రీటు పడుతుందో అంతకంటే అధికమైన కాంక్రీటు ఈ ఆనకట్ట నిర్మాణానికి వాడబడింది.
ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి 112 మరణాలు సంభవించాయి. వీరిలో సర్వేయర్ జె గి టియర్నీ ఒకరు. హూవర్ ఆనకట్ట నిర్మాణానికి తగిన ప్రదేశం కొరకు పరిశీలిస్తున్న తరుణంలో ఆయన 1922 డిసెంబర్ 20న మునిగిపోయాడు. ఆయన మరణాన్ని ఆనకట్ట నిర్మాణ సమయములో సంభవించిన మొదటి మరణంగా గణించారు. 13 సంవత్సరాల అనంతరం ఆయన కుమారుడు పాతిక్ డబ్ల్యూ తియర్నీ హూవర్ ఆనకట్ట నిర్మాణంలో సంభవించిన చివరి మరణం. 96 మరణాలు నిర్మాణ సమయంలో నిర్మాణప్రదేశంలో సంభవించాయి. 112 మందిలో సిక్స్ కంపెనీలో ఉద్యోగులే. 3 మంది బి ఒ ఆర్ ఉద్యోగులు. నిర్మాణ ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన పర్యాటకులలో ఒకరి మరణం సంభవించింది. మిగిలిన వారు సిక్స్ కంపెనీకి చెందని ఇతర ఒప్పందదారుల ఉద్యోగులు.
అధికారికంగా గుర్తింపబడిన మరణాలేకాక అనధికారికంగా సంభవించిన మరణాలు న్యుమోనియా మరణాలుగా నమోదయ్యాయి. మళ్ళింపు కనుమలు(డైవర్షన్ టన్నెల్స్) వద్ద ఉపయోగించిన వాహనాలకు ఉపయోగించిన గ్యాస్ మరియు ఇంధనము వాహనముల నుండి వెలువడిన కార్బన్ మొనాక్సైడ్ న్యుమోనియాకు మూలకారణమని పనివారు అభిప్రాయపడ్డారు. సిక్స్ కంపెనీ వారు నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఇలా నమోదు చేసారని వారు అభిప్రాయపడ్డారు. టన్నెల్స్ వద్ద ఉష్ణోగ్రత 140 డిగ్రీల ఫారెన్ హీట్ (60 డిగ్రీల సెంటిగ్రేడ్)చేరిన సమయంలో వాహనముల నుండి దట్టంగా వెలువడిన కార్బన్ మొనాక్సైడ్ మొత్తంగా 42 పనివారు న్యుమోనియా సోకి మరణించారు. అయినా వీరిలో ఎవరి మరణానికి కార్బన్ మొనాక్సైడ్ కారణమని నమోదు చేయబడ లేదు. నిర్మాణ సమయంలో పనివారు కాకుండా బౌల్డర్ సిటీలో సంభవించిన న్యుమోనియా మరణాలు నమోదు చేయబడ లేదు.
ఆరంభపు ప్లానులో ప్రవేశద్వారము, ది పవర్ ప్లంట్, టన్నెల్స్ వెలుపలి భాగము మరియు అలంకరణలు అధునిక శైలిలో ఉన్న ఆర్చ్ డామ్‌తో ఒకదానికి ఒకటి పూర్తిగా విభేదించాయి. ది బ్యూరో ఆఫ్ రిక్లెమేషన్ (పునరుద్ధరణ బృందం) ఆనకట్ట పనితీరు మీదనే అధికమైన జాగ్రత్త వహించింది, గోతిక్ శైలి వసారా స్థంభాలు (బాల్కని పిల్లర్స్) మరియు గద్ద శిల్పాలు ఆనకట్ట పైగాన అలంకరణ కొరకు ఉపయోగించబడ్డాయి. ఈ మొదటి అలంకరణ చాలా సాధారణంగా ఉందని చాలా మంది విమర్శించారు. భారీ ప్రణాళికతో రూపొందించిన అత్యంత ప్రతిష్టాత్మక ఆనకట్టకు ఈ అలంకరణ చాలదని భావించారు. అందు వలన లాస్ ఏంజలెస్ నుండి వాస్తుశిల్పి గార్డెన్ బి కౌఫ్‌మెన్ రప్పించి బ్యూరో ఆఫ్ రిక్లెమేషన్(పునరుద్ధరణ బృందం) పర్యవేక్షణలో వెలుపలి అలంకరణలను తిరిగి రూపొందించారు. కౌఫ్‌మాన్ అత్యంత సమర్ధవంతంగా డిజై వేసి మొత్తం ఆనకట్టకు ఆర్క్ డికో శైలిలో అలంకరణ చేసి సొంపైన రూపం తీసుకువచ్చాడు. ఆనకట్ట అడుగు భాగం నుండి చెక్కిన కట్టడాలను పైకి లేపి గడియార గోపురాలుగా తీర్చిదిద్దారు. ఈ గోపురాలు నెవాడ మరియు ఆరిజోనా విభిన్నమైన కాలమును సూచిస్తుంటాయి. అరిజోనా డే లైట్ సేవింగ్ టైమ్(పగటి కాల పొదుపు)ను పాటించదు. ఒకే సమయంలో ఈ గడియారాలు ఒకే సమయంలో ఆరు నెలల కంటే అధికమైన తేడాతో సమయాన్ని చూపించడం విశేషం.
కౌఫ్‌మాన్ అభ్యర్ధన మీద డెన్వర్ కళాకారుడు అలెన్ టప్పర్ ట్రూ ఆనకట్ట కుడ్యాలంకరణ మరియు భూ అలంకరణ(ఫ్లోరింగ్ డిజైన్) పనికి నియమించబడ్డాడు. ట్రూస్ అలంకరణ పధకంలో ఇక్కడి పూర్వీక సంతతి వారైన నవాజో మరియు ప్యూబ్లో కలయిక కలిగిన మూలాంశమైన అలంకరణలు చోటు చేసుకున్నాయి. మొదటి అలంకరణలు వీటికి వ్యతిరేకంగా ఉంన్నప్పటికీ ట్రూ తనపనిలో ముందుకు సాగేలా అనుమతించబడడమే కాక అధికారిక వాస్తుకళా సలహాదారుగా నియమించబడ్డాడు. నేషనల్ లాబరేటరీ ఆఫ్ అంత్రోపాలజీ(జాతీయ శిలాపరిశోధనా శాస్త్ర పరిశోధనాలయం ) సహాయముతో ఇండియన్ శాండ్ పెయింటింగ్స్ (ఇండియన్ ఇసుక చిత్రాలు), వస్త్రాలు, బుట్టలు మరియు అలంకరణ పెంకులు (సెరామిక్స్) ట్రూ పరిశోధన సాగించాడు. బొమ్మలు మరియు వర్ణాలు స్థానిక అమెరికన్ దృష్టిలో పధంలోని వర్షం, మెరుపులు, నీరు, మేఘాలు మరియు ప్రాంతీయ జంతువులు (బల్లులు, పాములు, పక్షులు మరియు నైరుతీ దిశా ప్రకృతి దృశ్యాలు) మిశ్రితమైన అలంకరణలు ఆనకట్ట దారులు మరియు లోపలి ఉన్న మందిరాల గోడలలో చోటుచేసుకున్నాయి. అలాగే ట్రూ ఆనకట్ట యంత్రాలను కూడా అలంకరణలలో చేర్చి ఆనకట్టకు పురాతన అధునాతన మిశ్రిత అందాలను చేకూర్చాడు.
ట్రూ ఇంజనీర్లతో కుదుర్చుకున్న ఒప్పందంతో మెషనరీలు(యంత్రాలు) మరియు పైపుల కొరకు వినూతన వర్ణాలను ప్రవేశపెట్టాడు. ఈ వర్ణాలే బి ఒ ఆర్ ప్రణాళిక మొత్తంలో అమలులోకి వచ్చింది. 1942 వరకు ట్రూ సలహాదారుడిగా పనిలో కొనసాగాడు. అలాగే పార్కర్, షస్తా మరియు గ్రాండ్ కౌలీ ఆనకట్టలు విద్యుత్చక్తి ప్రణాళికలు పూర్తి అయ్యే వరకు ట్రూ వాస్తు అలంకరణ పనిని కొనసాగించాడు. కౌఫ్‌మాన్ మరియు ట్రూల పనికి పురస్కారంగా అమెరికన్ పూర్వీకుడూ నార్వేలో పుట్టిన వాడు అయిన ఆస్కార్ జె.డబ్ల్యూ హన్‌సేన్ రూపకల్పన చేసిన అనేక శిల్పాలు ఆనకట్ట మీద దాని చుట్టుపక్కల అనేక శిల్పాలు చోటు చేసుకున్నాయి. ఆయన కళారూపాలు స్మారకచిహ్నంగా అంకితమిచ్చిన వ్యాపారకూడలి, ఈ ప్రణాళికలో ప్రాణాలు అర్పించిన వారి కొరకు ఒక ఫలకము గోపురముల మీద నివారణా కుడ్యశిల్పాలలో చోటుచేసుకున్నాయి. హన్‌సేన్ తన పనిని గురించి వర్ణిస్తూ " తిరుగులేని మేధావిలాసాన్ని నిశ్శబ్ధంగా శిక్షణాయుతమైన భౌతిక శక్తి సమానంగా పనిచేసి సాధించి ఈ శాస్త్రీయ అద్భుతాన్ని ప్రశాంతంగా సింహాసనం మీద ప్రతిష్టించాయి. ఎందుకంటే హూవర్ డామ్ ధైర్యసాహసాల ధారాహికా గాధల సమాహారం " నెవేడా వైపు అంకిత వ్యాపారకూడలి దన్నుగోడ మీద జంఢస్థంభం మీద అంచులలో రెండు రెక్కలు కలిగిన రూపం చోటుచేసుకున్నది. స్మారక చిహ్నం కింద భాగంలో టెర్రజ్జో ఫ్లోర్ (ఎర్రని మొజాయిక్ నేల) మీద రాశి లేక నక్షత్ర చక్రము (స్టార్ మ్యాప్) చిత్రించబడింది. ఈ నక్షత్ర చక్రము ప్రెసిడేంట్ రూజ్‌వెల్ట్ ఆనకట్టను దేశానికి అంకితమిచ్చిన రోజు జ్యోతిష పరమైన ఆకాశ పరిస్థితిని వర్ణిస్తున్నది. ఈ చిత్రం జ్యోతిష్కులకు భవిష్యత్తులో ప్రెసిడెంట్ ఆనకట్టను అంకితమిచ్చిన కాలాన్ని తెలియజేస్తుందని భావించారు. 30 అడుగులవింగ్స్ ఫిగర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ (స్వాంత్రాన్ని సూచించే రెక్కలు విపీన రూపాలు)ఒక్కొక్కటి నిరంతరం పోతపోసి రూపొందించబడ్డాయి. చాలా అధికంగా మెరుగు దిద్దబడిన ఈ బృహాతర ఇత్తడి చిత్రాలను చెదరకుండా గ?