కరిబ ఆనకట్ట (Kariba Dam - కరిబ డ్యామ్) అనేది జాంబియా మరియు జింబాబ్వే మధ్య జంబేజీ నది పరీవాహక ప్రాంతంలోని కరిబ గార్జ్‌లో ఉన్న ఒక డబుల్ వక్రత కాంక్రీటు వంపు ఆనకట్ట. ఈ డ్యాం 128 మీటర్ల (420 అడుగులు) ఎత్తుతో, 579 మీటర్ల (1,900 అడుగులు) పొడవు ఉంటుంది. ఈ డ్యామ్ వలన కరిబ సరస్సు ఏర్పడినది, ఇది 280 కిలోమీటర్లు (170 మైళ్ళు) విస్తరించి ఉంది మరియు 185 ఘనపు కిలోమీటర్ల నీటిని కలిగియుంటుంది.